Monday, September 23

తెలంగాణ – అడవులు

1) అడవులు ఎంత విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి?
జ: 29,243 చ.కి.మీ.
2) అటవీ పరంగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎన్నో స్థానంలో ఉంది ?
జ: 12వ ప్థానంలో
3) ఆకురాల్చే అడవుల్లో ఏ చెట్లు ఉంటాయి?
జ: వేగి, ఏగిస, మద్ది, బండారు, జిట్టెగి.
4) తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో ఏచెట్లు పెరుగుతాయి?
జ: మద్ది, టేకు, వెలగ, ఏగిస, వేప, దిరిసెన. బూరుగు.
5) అటవీ హక్కుల చట్టం ఎప్పుడు ఏర్పడింది?
జ: 2006
6) శ్రీగంధము చెట్లు ఎక్కడ పెరుగుతున్నాయి?
జ: మెదక్
7) వెదురు దేనికి ఉపయోగపడుతుంది?
జ. కాగితము తయారీకి
8) అదిలాబాద్ జిల్లాలోని గడ్డి దేనికి ఉపయోగపడుతుంది?
జ: కాగితం, రేయాన్
9) నిజామాబాద్ జిల్లాలోని రూసా గడ్డి దేనిని తీయడానికి ఉపయోగిస్తారు?
జ: సుగంధ నూనె
10) వెదరును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
జ: భద్రాచలం కొత్తగూడెం
11) తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఎచ్చట ఉన్నది?
జ: ధూళపల్లి.
12) ఇప్పపువ్వు ఏ జిల్లాలో ఎక్కువుగా దొరుకుతుంది?
జ: మహబూబ్ నగర్.
13) మన ఊరు - మన ప్రణాళిక కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం దేనికి సంబంధించినది ?
జ: తెలంగాణ హరిత హారం
14) రాష్ట్రంలో అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్ర్చ ఎక్కడ కలదు?
జ: శ్రీశైలం
15) రాష్ట్రంలో మొసళ్ల సంరక్షణ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?
జ: అదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలోని మంజీర
16) రాష్ట్రంలో చిట్టడవులు ఎక్కడ ఎక్కువుగా ఉన్నాయి?
జ: వికారాబాద్
17) దేశంలో కెల్లా అతి పెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది?
జ: నాగార్జునసాగర్- శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
18) తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ప్రచురించే పత్రికలు ఏవి ?
జ: వన సంరక్షిణి, వన జ్ఞాపిక
19) 1952 నాటి అటవీ చట్టం ప్రకారం ఎంత శాతం అడవులు ఉండాలి ?
జ: 33 శాతం
20) మహవీర్ హరిణ వనస్థలిలో సంరక్షిస్తున్న జంతువు ఏది ?
జ: జింక