జైన మతం

1) జైన మతానికి నిజమైన స్థాపకుడిగా ఎవరిని చెబుతారు ?
జ: వర్ధమాన మహావీరుడు ( 24వ తీర్థంకరుడు)
2) జైనమతంలోని 24 తీర్థంకరులను ఏమని పిలుస్తారు ?
జ: జినులు
3) మోక్షం పొందగానికి జైనమతస్థులు అనుసరించే సూత్రాలను ఏమంటారు ?
జ: త్రిరత్నాలు (1) సరైన విశ్వాసం (2) సరైన జ్ఞానం (3) సరైన నడవడిక
4) జైన మతం ఎన్ని శాఖలుగా విడిపోయింది ? ఎవరెవరు నాయకత్వం వహించారు ?
జ: దిగంబరులు (బద్రబాహు) , శ్వేతాంబరులు (స్థూల భద్ర)
5) దక్షిణ భారత దేశానికి వలస వచ్చిన వారిని ఏమంటారు ?
జ: దిగంబరులు ( కర్ణాటకలోని శ్రావణ బెళగొళకి వచ్చారు )
6) స్థూలభద్రుని నేతృత్వంలోని శ్వేతాంబరులు ఎక్కడ ఉండిపోయారు ?
జ: మగధలో