Wednesday, February 26

జాతీయ వ్యవసాయ మార్కెట్ ‘ఈ-నామ్’

రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు వచ్చేందుకు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలుకల్పించేదే ఈనామ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ లో ఈపథకాన్ని ప్రధాన నరేంద్ర మోడీ ప్రారంభించారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ 8 రాష్ట్రాల్లోని 21 మార్కెట్లలో ఏర్పాటు చేస్తారు. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఈ మార్కెట్లలో గోధుమలు, నూనె
గింజలు, గిజం ధాన్యాలు, ఉల్లిపాయలు, మసాలా దినుసులు, బంగాళా దుంపలు లాంటి మొత్తం 25 పంటలను అమ్ముకునే వీలుంటుంది. ఈ మార్కెట్లను ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో అనుసంధానిస్తారు. ఏ రోజుకారోజు మార్కెట్లో పంటల రేట్లను అందులో పొందుపరుస్తారు. రైతులు తమకు గిట్టుబాటు ధర
అందుతున్నప్పుడు తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలుంటుంది.