గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ‘మౌ’ గ్రామంలో ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. గ్రామాల్లో సామాజిక సామరస్యం, జాతీయ సమైక్యతపై ఆయన భావాలను తెలిపే పాంప్లేట్స్, పుస్తకాల పంపిణీ, బడుగు వర్గాల అభివృద్ధికి ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్షేమ పథకాల పరిచయం లాంటి పథకాలు చేపడతారు. ఇది ప్రత్యేక పథకం కాదు. ప్రచార ఉద్యమం మాత్రమే. పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం, గ్రామీణాభివృద్ధి, రైతుల అభివృద్ధికి ఈ ప్రచార ఉద్యమం చేపట్టారు.