కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం

తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం మొదటి దశను 2016 ఆగస్టు 10న ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. భారత్, రష్యా సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని నిర్మిస్తున్నాయి.  1988లో ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.  మొదటి దశలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు.  మొదటి ప్లాంట్ నిర్మాణం సమయంలో తమిళనాడులో నిరసనలు ఎదురయ్యాయి.  2001లో 13,500 కోట్ల అంచనాతో మొదలవగా, ఆలస్యం కారణంగా ఒకటి, రెండు యూనిట్ల నిర్మాణానికి 21వేల కోట్లు ఖర్చయ్యాయి.  శుద్ధి చేసిన యురేనియంను ఇంధనంగా ఉపయోగించిన VVER తరహాలో అణు రియాక్టర్లను ఇందులో ఏర్పాటు చేశారు.  కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు N.సుబ్రమణ్యన్ నాయకత్వం వహించారు.  గ్రీన్ పార్టీ పేరుతో ఉద్యమాలు జరిగాయి.