Table of Contents
- ఇస్రో పిలుస్తోంది!
- 63 సైంటిస్ట్ కొలువుల భర్తీ
- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 63 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. ఎంపికైనవారిని హైద రాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, మహేంద్రగిరి, అహ్మదాబాద్, హసన్, వలి యమల, శ్రీహరికోట కేంద్రాల్లో నియమించే అవకాశం ఉంటుంది.
- మొత్తం ఖాళీల్లో సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సి' (ఎలక్ట్రా నిక్స్)- 22, సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎసిసి' (మెకాని కల్)- 33, సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సి' (కంప్యూటర్ సైన్స్)- 8 ఉన్నాయి.
- అర్హతలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మెకాని కల్/ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ బీఈ/ బీటెక్/తత్సమాన పరీక్ష 65 శాతం మార్కులతో పాసవ్వాలి. 2024 25 2025 5 .
- వయసు: 28 ఏళ్లు మించకూడదు. ప్రత్యేక వర్గాలకు చెందినవారికి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: రూ.250, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాం గులు/ మాజీ సైనికోద్యోగులు/ మహిళలకు ఫీజు లేదు.
- వేతన శ్రేణి: రూ.56,100. మూలవేతనానికి అద నంగా డీఏ, హెచ్ఎస్ఏ, టీఏ, న్యూ పెన్షన్ స్కీమ్ /యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, వ్యక్తిగత, కుటుంబ సభ్యు లకు వైద్య సదుపాయాలు, ఎల్డీఏ, గ్రూప్ ఇన్సూ
- రెన్స్, హౌస్బల్డింగ్ అడ్వాన్స్ మొదలైన సదుపా యాలు ఉంటాయి. మెరిట్ బేస్డ్ పర్ఫార్మెన్స్ రివ్యూ సిస్టమ్ ద్వారా ప్రతిభ ఆధారంగా ఉద్యోగులు పదోన్న తులు పొందే అవకాశం ఉంటుంది.
- ఎంపిక ఎలా?
- * 2024/2025 గేట్ స్కోరు ఆధారంగా 1:7 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
- * ఇంటర్వ్యూకు 100 మార్కులు. టెక్నికల్ (అకడ మిక్) నాలెడ్జు 40 మార్కులు, జనరల్ అవేర్నెస్కు 20 మార్కులు, ప్రజెంటేషన్/ కమ్యూనికేషన్ స్కిల్కు 20 మార్కులు, కాంప్రహెన్షన్ కు 10 మార్కులు, అకడ మిక్ అచీవ్మెంట్స్కు 10 మార్కులు.
- * ఇంటర్వ్యూలో 60 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. దివ్యాంగులకు 50 శాతం సరిపోతుంది. ఇంటర్వ్యూకు 50 శాతం, గేట్ స్కోరుకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు.
- ◆ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నవారు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్'ను ఇంటర్వ్యూ సమయంలో సమ ర్పించాలి.
- * ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు సెకండ్ క్లాస్ రైలు ఛార్జీలను చెల్లిస్తారు.
- ◆ ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 19.05.2025 http://www.isro.gov.in/http://www.isro.gov.in/