ఆసరా ఫించన్లు (ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు)

1) వృద్ధులు, వికలాంగులు, వితంతవులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఆసరా. దీనికింద నెలకు ఎంత మొత్తాన్ని ఇస్తారు ?
జ: ఒక్కో లబ్దిదారుడికి నెలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ.1500
2) ఆసరా ఫించన్ పథకాన్ని ముఖ్యమంత్రి ఎక్కడ ప్రారంభించారు ?
జ: 2014, నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో
3) HIV బాధితులు, హెచ్‌ఐవీ బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు ఎంత మొత్తం ఆసరా కింద చెల్లిస్తారు?
జ: రూ. 1000
4) రాష్ట్ర జనాభాలో ఎంత శాతం మంది అంగవైకల్యంతో బాధపడుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ?
జ: 2.97 శాతం మంది
5) బీడీ కార్మికులకు ఫించన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ?
జ: రూ.188 కోట్లు

6) ఆసరా పథకం కింద సర్కార్ ఎంత మొత్తం ఖర్చు చేసింది ?
జ: రూ.4,700 కోట్లు
7) తెలంగాణలో ఆసరా పథకం కింద ఎంతమంది లబ్ది పొందుతున్నారు ?
జ: 37,65,304 మంది
8) వృద్ధులకు అమలు చేస్తున్న ఆసరా పథకాన్ని ఏ పేరుతో వ్యవహరిస్తున్నారు ?
జ: రక్షణ
9) వితంతువులకు అమలు చేసే ఆసరా పథకం పేరేంటి ?
జ: జీవనాధారం
10) చేనేత కార్మికులకు అందిస్తున్న ఫించన్ పథకం ఏది ?
జ: చేయూత
11) కల్లు గీత కార్మికులకు అందించే ఫించన్ పథకం పేరేంటి ?
జ) ఆలంబన
12) వికలాంగులకు అందించే ఫించన్ పథకం ఏది ?
జ: భద్రత
13) ఎయిడ్స్ బాధితులకు తెలంగాణ సర్కార్ అందించే ఫించన్ పథకానికి ఏం పేరు పెట్టారు ?
జ: భరోసా

14) ఒంటరి మహిళలకు కూడా ఆసరా ఫించన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ?
జ: 2017 ఏప్రిల్ నుంచి
15) ఆసరా ఫించన్లకు 2017-18 బడ్జెట్ లో ఎంత కేటాయించారు ?
జ: రూ.5,33.59 కోట్లు
16) ఒంటరి మహిళలకు ప్రభుత్వం నెలకు ఎంత మొత్తం ఫించన్ ఇస్తోంది ?
జ: రూ.1000