Saturday, August 18
Log In

VRO ఉద్యోగాలకు గడువు పెంపు

VRO తో పాటు ఇతర ఉద్యోగాల దరఖాస్తులకు గడువు పెంచింది TSPSC. ASO, CCLA (GROUP.IV) హోంశాఖలో సీనియర్ స్టెనో ఉద్యోగాలకు గడువు పెరిగింది. ఈ ఉద్యోగాలకు ఇవాళ చివరి రోజు కావడంతో చాలా మంది TSPSC వెబ్ సైట్‌కి లాగిన్ అయ్యారు. దీంతో TSPSC సర్వర్‌లో టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చింది. దీంతో దరఖాస్తుల గడువును పెంచుతున్నట్టు TSPSC ప్రకటించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పెంచినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. ఇవాళ సెకనుకు 12 వేల దరఖాస్తులు చొప్పున వెబ్ సైట్ కి అప్ లోడ్ అయ్యాయి. ఈనెల 8 (ఆదివారం) వరకూ దరఖాస్తులు పెట్టుకోడానికి గడువు పెంచారు.

ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తులు:

700 వీఆర్వో పోస్టులకు 9లక్షల 25 వేలు (అంటే ఒక్కో వీఆర్వో పోస్టుకి 1321 మంది పోటీ )

స్టాటిస్టికల్ ఆఫీసర్ కి  75 వేల దరఖాస్తులు

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
https://telanganaexams.com/mockmaterial/