వేములవాడ చాళుక్యులు

1) వేములవాడ చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు?
జ: వినయాదిత్య యుద్ధ మల్లుడు
2) రెండో అరికేసరి పంపకవికి ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు?
జ: ధర్మపురి
3) వేములవాడలోని బద్దెగేశ్వరాలయాన్ని నిర్మించినదెవరు?
జ: బద్దెగ
4) కొల్లిపర్ల శాసనం ప్రకారం సద్యో శివాచార్యుడికి మొదట అరికేసరి ఏ ప్రాంతాన్ని దానంగా ఇచ్చాడు?
జ: బెల్గోర
5) కొల్లిపర్ల శాసనం ప్రకారం వేములవాడ చాళుక్య వంశ మూలపురుషుడు ఎవరు?
జ: సత్యాశ్రయ రణ విక్రముడు
6) మొదటి అరికేసరి బిరుదులు ఏంటి?
జ: సమస్త లోకాశ్రయ, త్రిభువనమల్ల రాజాది నేత్ర, సమస్రనామ
7) రాష్ట్రకూటులకు తెలంగాణ ప్రాంతంలో సామంతులు ఎవరు?
జ: వేములవాడ చాళుక్యులు
8) యుద్ధమల్లుడి రాజధాని ఏది?
జ: ఇందూరు
9) సాలద గండ అంటే ఏమిటి?
జ: నల్లభై రెండు యుద్ధాల వీరుడు
10) కందూరు చోడవంశ రాజధాని ఏది?
జ: పానగల్లు(నల్గొండ)
11) వేములవాడ చాళుక్య వంశంలో గొప్పరాజు ఎవరు?
జ: రెండో అరికేసరి
12) తెలంగాణలో తొలి పద్య శాసనం ఏది?
జ: కుర్మ్యాల బొమ్మలగుట్ట శాసనం (దీని కర్త జినవల్లభుడు)
13) పానగల్లోలో ఉదయ సముద్రం తటాకాన్ని తవ్వించిన కందూరు చోడరాజు ఎవరు?
జ: రెండోఉదయ చోడ మహారాజు
14) తెలుగులో తొలి చందో గ్రంధం ఏది?
జ:కవిజనాశ్రయం
15) తెలంగాణలో భూసారాన్ని బట్టి పన్నులు వసూలు చేసిన రాజవంశం ఏది ?
జ: కందూరు చోడులు
16) వేములవాడ చాళుక్యులు అనుసరించిన మతం ఏది?
జ: జైనమతం
17) కందూరు చోడులు ఆదరించిన మత శాఖ ఏది?
జ: కాలాముఖ శైవం