Monday, September 24
Log In

కొలువుల జాతరకు రెడీ ! జూన్ 2 కి మూడు కొత్త నోటిఫికేషన్లు !?

రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఎదురు చూస్తున్న కొలువుల జాతరకు సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కానుకగా గ్రూప్.4, VRO ప్రకటనలు ఇచ్చేందుకు TSPSC అన్ని ఏర్పాట్లు చేసింది. అటు TRT ఫలితాలు కూడా 2,3 రోజుల్లో రాబోతున్నాయి. అలాగే ఇప్పటికే ఖాళీగా ఉన్న 125 పోస్టులతో గ్రూప్ - 1 ప్రకటన కూడా రాబోతుంది. కొత్త ఉద్యోగాల ప్రకటనలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాలు ఎప్పుడు వెల్లడించాలి అన్నదానిపై ఓ షెడ్యూల్ తయారు చేసింది TSPSC. అయితే తక్కువ పోస్టులు ఉన్నా.. ఆయా రిక్రూట్ మెంట్స్ కి సంబంధించిన ప్రకటనలు ఇచ్చి... రాబోయే 2,3 నెలల్లో వచ్చే ఖాళీలను కూడా అదే నోటిఫికేషన్ లోకి చేర్చాలని TSPSC వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్ని పోస్టులు ఉండొచ్చు ?

గ్రూప్ - 1 = 125 పోస్టులు
గ్రూప్ - 4 = 1500 పోస్టులు
VRO 700 పోస్టులు

 

SI/PC/VRO/GR.II/GR.IV పోస్టులకు ప్రిపేరయ్యే వారికి మాక్ టెస్టులు - పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/mock-tests/

రైల్వేలో గ్రూప్ - సి, డి ఉద్యోగాలకు గ్రాండ్ టెస్టులు, అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/rrb-gt-tests/