అలాగైతే TSPSC ని మూసేయ్యండి : హైకోర్టు

అలాగైతే TSPSC ని మూసేయ్యండి : హైకోర్టు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 4 వారాల్లో ఛైర్మన్, సభ్యులను నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిరుద్యోగి జె.శంకర్ వేసిన ప్రజా ప్రయోజనాల పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఛైర్మన్, సభ్యులను నియమించకపోతే TSPSC ని మూసివేయండని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఛైర్మన్, సభ్యులను వెంటనే నియమించి తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పిల్ పై విచారణను జూన్ 17కు వాయిదా వేసింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.