Friday, October 30

గ్రూప్ 4 ఫలితాలు విడుదల

రెండున్నర యేళ్ళ తర్వాత గ్రూప్ 4 ఫలితాలను వెల్లడించింది TSPSC. నోటిఫికేషన్ 10/2018 ప్రకారం 1595 పోస్టులకు అప్పట్లో ఎగ్జామ్ నిర్వహించింది. వీటిల్లో 1098 జూనియర్ అసిస్టెంట్స్, 450 టైపిస్టులు, 44 స్టెనో (ఇంగ్లీష్), మూడు స్టెనో (తెలుగు) పోస్టులకు నోటిఫికేషన్ పడింది.

1098 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో 1090 పోస్టులకి అభ్యర్తులను ఎంపిక చేసినట్టు TSPSC పేర్కొంది. మరో 8 పోస్టులు అభ్యర్థులు దొరక్క ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. అలాగే 450 టైపిస్టుల్లో 425 ఫిలప్ అవుతుండగా... మరో 25 ఖాళీగా మిగిలాయి. గ్రూప్ 4 రిక్రూట్ మెంట్ కోసం మొత్తం 4,35,389 మంది ఎగ్జామ్ రాసినట్టు TSPSC వర్గాలు వెల్లడించాయి.
గ్రూప్ 4 రిజల్ట్స్ వివరాలు ఇంకా వెబ్ సైట్ లో పోస్ట్ చేయలేదు.. ఈ రాత్రికల్లా రిజల్ట్స్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరయ్యే వాళ్ళ కోసం... Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp