TSPSC పేరుతో నకిలీ మెయిల్స్ … జాగ్రత్త మోసపోకండి !

TSPSC పేరుతో నకిలీ మెయిల్స్ … జాగ్రత్త మోసపోకండి !

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC పేరుతో నకిలీ ఈ మెయిల్‌ ఐడీని సృష్టించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. పౌర సరఫరాలు, తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగం, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయని.... తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ విభాగానికి మెయిల్ వచ్చింది. అయితే TSPSC అధికారిక వెబ్ సైట్ నుంచి కాకుండా.. tspscgo.in అనే నకిలీ ఈమెయిల్ ఐడి నుంచి ఈ మెయిల్ వచ్చింది. దాంతో అప్రమత్తమయ్యారు అధికారులు. నకిలీ ఈ-మెయిల్ అని గుర్తించారు tspsc అధికారులు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు TSPSC ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్. ఇలాంటి ఫేక్ మెయిల్స్ నుంచి వచ్చే లింకులకు స్పందించవద్దని కోరారు.

(ప్రస్తుతం ఎన్నికలు నడుస్తున్నందున ఉద్యోగాల నోటిఫికేషన్లకు టైమ్ పడుతుంది. కొత్తగా ఏ నోటిఫికేషన్ వచ్చినా మీకు www.telanganaexams.com ద్వారా నేను సమాచారం ఇస్తాను. ఒకవేళ మీకు డౌట్ వస్తే... 7036813703 కి వాట్సాప్ ద్వారా మెస్సేజ్ పంపండి. దయచేసే ఏ లింక్స్ ఓపెన్ చేయకండి... మీ బ్యాంక్ అకౌంట్స్ డబ్బులు ఖాళీ అవుతాయి. మీ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. - విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ )