Sunday, June 24
Log In

TSPSC నుంచి 5 నోటిఫికేషన్లు ; విద్యార్హతలు, ఇతర తేదీలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 5 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో ఇంటర్, డిగ్రీతో పాటు టైప్ హయ్యర్, స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ కలిగిన వారికి వివిధ కేటగిరీలకు సంబంధించి 2,786 పోస్టులు ఉన్నాయి. మరో 12 వేల పోస్టులను డిసెంబర్ లోగా భర్తీ చేస్తామని TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. అలాగే ఈ నెలాఖరులోగా మరో 3 నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు.

ఏమేం పోస్టులు ?
గ్రూప్ - 4 లో : 1521 పోస్టులు
రెవెన్యూశాఖలో VRO లు : 700 పోస్టులు
అర్థగణాంక శాఖలో మండల ప్రణాళిక, గణాంక అధికారులు/ సహాయ గణాంక అధికారులు : 474 పోస్టులు

VRO పోస్టులు: 700 (13/2018)
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 700
విద్యార్హతలు : ఇంటర్ లేదా తత్సమానం
దరఖాస్తుల స్వీకరణ: జూన్ 8 నుంచి జులై 2
ఎగ్జామ్ తేది: సెప్టెంబర్ 16

ముఖ్యాంశాలు :
జిల్లాల వారీగా పోస్టులు:
మహబూబ్ నగర్ : 155
ఆదిలాబాద్ : 107
కరీంనగర్: 90
ఖమ్మం : 19
వరంగల్ : 49
నల్గొండ : 83
నిజామాబాద్: 50
హైదరాబాద్: 07
రంగారెడ్డి : 90
మెదక్ : 50

గ్రూప్ - 4 పోస్టులు: 1521 ( 10/2018)
పోస్టులు: జూ.అసిస్టెంట్స్, టైపిస్టులు, స్టెనోలు
దరఖాస్తుల స్వీకరణ: జూన్ 7 నుంచి జులై 6
ఎగ్జామ్ డేట్: అక్టోబర్ 7

విద్యార్హతలు:
జూనియర్ అసిస్టెంట్స్: డిగ్రీ అర్హత

టైపిస్టులు: డిగ్రీతో పాటు తెలుగులో హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ కలిగి ఉండాలి. హయ్యర్ గ్రేడ్ లేకపోతే లోయర్ గ్రేడ్ వారిని పరిగణిస్తారు. తెలుగు టైప్ రైటింగ్ వచ్చిన వారు లేకుంటే ఇంగ్లీష్ వాళ్ళని ఎంపిక చేస్తారు. ఎంపికైన తర్వాత ఏడాది లోగా తెలుగు హయ్యర్ గ్రేడ్ పూర్తి చేయాలి.
జూనియర్ స్టెనో: డిగ్రీతో పాటు హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ ఉండాలి. హయ్యర్ అభ్యర్థులు లేకపోతే లోయర్ గ్రేడ్ వారిని తీసుకుంటారు. తెలుగు టైప్ రైటింగ్ కి ఎగ్జామ్ ఉంటుంది.

ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్స్ పోస్టులు: 33 ( 11/2018)

పోస్టులు: జూనియర్ అసిస్టెంట్స్ (పర్సనల్, ఫైనాన్స్ )
దరఖాస్తుల స్వీకరణ: జూన్ 7 నుంచి జులై 6
ఎగ్జామ్ డేట్: అక్టోబర్ 7
విద్యార్హతలు: పర్సనల్ జూ.అ.లకు డిగ్రీతో పాటు తెలుగు లేదా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ పాసై ఉండాలి
ఫైనాన్స్ జూ.అ.లకు: కామర్స్ డిగ్రీ

అర్థగణాంక శాఖ : SO/ASO - 474 ( 12/2018)
దరఖాస్తుల స్వీకరణ: జూన్ 8 నుంచి జులై 2
పరీక్ష తేది: సెప్టెంబర్ 2
విద్యార్హతలు : డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. లేదా మ్యాథ్స్ లేదా కామర్స్ లేదా ఎకనామిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుగా డిగ్రీతో పాటు స్టాటిస్టిక్స్ ఏదైనా ఒక సంవత్సరంలో ఒక పేపరుగా ఉండాలి.

సీనియర్ స్టెనో పోస్టులు : 19 ( 14/2018)
దరఖాస్తుల స్వీకరణ: జూన్ 11 నుంచి జులై 2
పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు
విద్యార్హతలు: డిగ్రీతో పాటు హయ్యర్ గ్రేడ్ షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ అర్హత కలిగి ఉండాలి. తెలుగు టైప్ రైటింగ్ లో పరీక్ష ఉంటుంది

( ఏయే ఎగ్జామ్స్ కి  ఏం సిలబస్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న అంశాలపై ఆర్టికల్స్ (లేదా యూట్యూబ్ ద్వారా గైడెన్స్ తర్వాత ఇవ్వబడును )

ఇలా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టొచ్చు
మీ సీరియస్ టార్గెట్ కి మా ప్లానింగ్ !
https://telanganaexams.com/new-planning/

Telangana Exams మాక్ టెస్టుల డిటైల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
http://telanganaexams.com/mock-tests/

TSPSC ప్రకటించిన అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది.  ఈ కింది లింకులు క్లిక్ చేసి వివరాలు తెలుసుకోగలరు

VRO ఉద్యోగాలకు లింక్

GROUP IV SERVICES

STENO TYPIST

SO ASO

JUNIOR ASST

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *