ముల్కీ రూల్స్, ముల్కీ ఉద్యమం

1) ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంచ సూత్ర పథకాన్ని ఏ రోజున ప్రకటించింది ?
ఎ) 1972 నవంబర్ 28
బి) 1972 నవంబర్ 26
సి) 1972 నవంబర్ 27
డి) 1972 నవంబర్ 29

2) ఏ ఉద్యమాన్ని అణచివేయుటకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకం ప్రవేశపెట్టింది ?
ఎ) సాయుధ పోరాటం
బి) జై ఆంధ్ర ఉద్యమం
సి) నక్సలైట్ ఉద్యమం
డి) పైవేవి కావు

3) ముల్కీ బదులుగా జోన్లను ప్రవేశపెడుతూ సీమాంధ్ర ఉద్యోగులకు రిజర్వేషన్లను కల్పించేందుకు రాష్ట్రపతికి అధికారం ఇస్తున్న ఆర్టికల్ ఏది ?
ఎ) 371(బి)
బి) 371(సి)
సి) 371(ఎ)
డి) 371(డి)

4) 1952 ముల్కీ ఉద్యమ సమయంలో ఉథావ్ రావు సంపాదకత్వంలో వచ్చిన పత్రిక ఏది ?
ఎ) పాయం
బి) ప్రజాతంత్ర
సి) గోలకొండ
డి) మాభూమి

5) ముల్కీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ లో పి.డి. యాక్ట్ క్రింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు ఎవరు ?
ఎ) పూల్ చంద్ గాంధీ
బి) జి.ఎస్. మేల్కొటె
సి) సయ్యద్ అక్తర్ హుస్సేన్
డి) నవాబ్ జంగ్ బహదూర్

6) ముల్కీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమయ్యింది ?
ఎ) 1954
బి) 1952
సి) 1956
డి) 1950

7) 1952 ముల్కీ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభం అయినది ?
ఎ) మదన్ మోహన్
బి) ప్రొ.జయశంకర్
సి) టి.హయగ్రీవాచారి
డి) జి. రామాచారి

8) ముల్కీ ఉద్యమం కారణంగా సాలార్ జంగ్ పదవిని కోల్పోయిన ప్రధాని ?
ఎ) సాలార్ జంగ్-II
బి) సాలార్ జంగ్-III
సి) సాలార్ జంగ్-I
డి) పైవారందరూ

9) ఎపిఎన్ఇబిలోని ఉద్యోగులకు కూడా ముల్కీ నిబంధనలు అమలు చేయాలని ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారు ?
ఎ) కాకతీయ థర్మల్ ప్లాంట్
బి) కోత్తగూడెం థర్మల్ ప్లాంట్
సి) పై రెండూ
డి) పైవేవి కావు

10) 1971 ఫబ్రవరి 14న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలపై ఇచ్చిన తీర్పులో ఏ ఫర్మానాలో పేర్కోన్న నిబంధలను అమలులోకి వచ్చాయి ?
ఎ) 1868 ఫర్మానా
బి) 1919 ఫర్మానా
సి) 1955 ఫర్మానా
డి) 1949 ఫర్మానా

11) ముల్కీ నిబంధనలు ఆరంభంలో నియమావళికి మాత్రమే వర్తిస్తుంది తప్ప అనంతరం ప్రమేషన్, సీనియారిటీ, రివర్షన్, రిట్రెంచ్ మెంట్లకు కాదని హైకోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది ?
ఎ) 1973 జూన్ 12
బి) 1973 జూలై 11
సి) 1973 జూన్ 11
డి) 1973 జూలై 12

12) 1952 ముల్కీ ఉద్యమం ప్రారంభం అయినపుడు వరంగల్ కలెక్టర్ ఎవరు ?
ఎ) రామేశ్వర్ దేశ్ పాండే
బి) గోవిందరావు దేశ్ పాండే
సి) వి.డి. దేశ్ పాండే
డి) ఎవరూ కాదు

13) 1952 ముల్కీ ఉద్యమంలో వరంగల్ లో ఎప్పుడు విద్యార్థులపై లాఠీచార్జీ జరిగింది ?
ఎ) 1952 ఆగస్టు 17
బి) 1952 ఆగస్టు 30
సి) 1952 ఆగస్టు 29
డి) 1952 ఆగస్టు 28

14) 1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలపై తీర్పు వ్యక్తపరిచినపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు ?
ఎ) జలగం వెంగళరావు
బి) టి.జంగయ్య
సి) పి.వి.నరసింహరావు
డి) కాసు బ్రహ్మానందరెడ్డి

15) ఇంధిరాగాంధీ ప్రకటించిన అష్టసూత్ర పథకాన్ని లక్ష్యపెట్టవలసిన అవసరం లేదని పేర్కోన్న తెలంగాణ ప్రజాసమితి తాత్కాలిక అధ్యక్షులు ఎవరు ?
ఎ) మదన్ మోహన్
బి) శ్రీధర్ రెడ్డి
సి) సదాలక్ష్మీ
డి) మర్రి చెన్నారెడ్డి

16) హైదరాబాద్ లో 1952 ఆగస్టు 27న మొట్టమొదటి జరిగిన ముల్కీ సభకు అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు ?
ఎ) బుచ్చయ్య
బి) డా. తిమ్మరాజు
సి) గోపాలరావు ఎక్సెటి
డి) కొండా వెంకటరంగారెడ్డి

17) 1952 ముల్కీ ఉద్యమం ప్రారంభం కావటానికి వరంగల్ లో 180 మంది ఉపాధ్యాయులకు బదిలీ చేసిన డివిజనల్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎవరు ?
ఎ) పార్ధసారధి
బి) జి. రామాచారి
సి) టి. హయగ్రీవాచారి
డి) ఎవరూ కాదు

18) ముల్కీ ఉద్యమ సమయంలో ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఏ రోజున ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు ?
ఎ) 1952 సెప్టెంబర్ 5
బి) 1952 సెప్టెంబర్ 3
సి) 1952 సెప్టెంబర్ 2
డి) 1952 సెప్టెంబర్ 4

19) లోక్ సభ ముల్కీ నిబంధనలకు అడ్డు తగిలిన నాయకులు ఎవరు ?
ఎ) నీలం సంజీవరెడ్డి
బి) వెంకట సుబ్బయ్య
సి) ఎం. సుదర్శన్
డి) ఎస్.ఎం. జోషి

20) ముల్కీ అనగా అర్ధం ఏమిటి ?
ఎ) స్థానికేతరుడు
బి) స్థానికుడు
సి) హైదరాబాదీ
డి) ఉర్దూ వచ్చినవారు

21) 1952 సెప్టెంబర్ లో తెలంగాణాలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం పేరు ఏమిటి ?
ఎ) ముల్కీ ఉద్యమం
బి) నాన్ ముల్కీ ఉద్యమం
సి) గైర్ ముల్కీ ఉద్యమం
డి) పైవేవి కావు

22) ముల్కీ గైర్ ముల్కీ అనే సమస్య ఎవరి కాలం నుండి ఉంది ?
ఎ) అసఫ్ జాహీలు
బి) మొగలులు
సి) బహమనీలు
డి) కుతుబ్ షాహీలు

23) ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవి. ఇవి చెల్లవని చెప్పిన న్యాయమూర్తి ఎవరు ?
ఎ) కొండా వెంకటరంగారెడ్డి
బి) కొండామాధవరెడ్డి
సి) డా. తిమ్మరాజు
డి) ఎవరూ కాదు

24) ఇందిరాగాంధీ పంచసూత్ర పథకాన్ని ముల్కీ రూల్స్ తో కలిపి ఏ రోజున లోక్ సభలో ప్రవేశపెట్టింది ?
ఎ) 1972 డిసెంబర్ 20
బి) 1972 డిసెంబర్ 23
సి) 1972 డిసెంబర్ 25
డి) 1972 డిసెంబర్ 21

25) ముల్కీ నిర్వచనం అను పదం అర్థంను వివరిస్తూ తీర్పు చెప్పిన హైకోర్టు న్యాయమూర్తి ఎవరు ?
ఎ) ఓబుల్ రెడ్డి
బి) జస్టిస్ కుమరయ్య
సి) జస్టిన్ గోపాలరావు
డి) ఎం. హిదయతుల్లా