Monday, March 30

త్వరలో మున్సిపల్ శాఖలో 3 వేల ఉద్యోగాల భర్తీ

తెలంగాణలో మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న 3 వేల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు (CDMA) సిద్ధం చేస్తున్నారు. కొత్త మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అలాగే పాత మున్సిపాలిటీలో ఉన్న ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకొని మొత్తం 3 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. వీటిల్లో 100 వరకూ ఇంజనీరింగ్ పోస్టులు ఉండగా... 2,900 మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.

CDMA పరిధిలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 12 కార్పోరేషన్లు ఉన్నాయి. 2018 లో 173 గ్రామపంచాయతీలు, 75 కొత్త మున్సిపాలిటీలుగా మారాయి. మరో 131 గ్రామపంచాయతీలు 42 పాత మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. దాంతో ఆ గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఆఫీసర్ (కేటగిరి3), సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్లు 240 మందిని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్ లోకి మెర్జ్ చేశారు. ప్రస్తుతం చాలా మున్సిపాలిటీల్లో ఎంపీడీవోలు, ఇతర అధికారులే ఇంఛార్జ్ కమిషనర్లుగా కొనసాగుతున్నారు. దాంతో ఈ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశముంది.

మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఏమేమి పోస్టులు ఉండొచ్చు ?

1) మున్సిపల్ కమిషనర్లు

2) అసిస్టెంట్ ఇంజనీర్స్ గ్రేడ్ 3

3) అసిస్టెంట్ ఇంజనీర్స్ గ్రేడ్ 3 (ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్స్)

4) జూనియర్ అకౌంటెంట్స్

5) హెల్త్ అసిస్టెంట్స్

6) బిల్ కలెక్టర్స్

7) టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అబ్జర్వర్స్

అయితే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను TSPSCకి అప్పగిస్తారా... లేదా మున్సిపల్ డిపార్ట్ మెంట్ లోనే రిక్రూటింగ్ అథారిటీకి ఇస్తారా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ప్రతిపాదనలు మాత్రం ప్రభుత్వానికి అందచేస్తున్నారు. ఈ రిక్రూట్ మెంట్ పై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మున్సిపల్ పోస్టులకు అర్హత ఏంటి ? సిలబస్ ఎలా ఉంటుంది ? ప్రిపరేషన్ ఎలా ? ఈ వీడియో చూడండి (గతంలో 558 పోస్టుల భర్తీ చేస్తారన్నప్పుడు తయారు చేసిన వీడియో ఇది. ఇప్పుడు ఈ సంఖ్య 3 వేలకు పెరిగింది )

తెలంగాణ ఎగ్జామ్స్Annual Subscription for All Tests (Last Date : 20th Feb 2020)
Gr.1(Prelims),2,3,4, SI, PC, GP Secy, RRB, Discoms, Court, Muncipal Jobs Exams
http://telanganaexams.com/annual-subscription-for-all-tests-rs-1000/
దయచేసి ఈ మెస్సేజ్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఎక్కువ మంది Talent Exam రాసేందుకు ప్రోత్సహించండి.

( This article source : Velugu daily 4th Page 18th Feb 2020)