తెలంగాణ చారిత్రక నేపథ్యం

1) త్రిలింగ పదం ఎలా వచ్చింది ?
జ: కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం .. ఈ మూడు ప్రదేశాలు ఉన్న ప్రదేశం కాబట్టే త్రిలింగ దేశం అంటారు.
2) తెలంగాణపురం అనే పేరు ఎక్కడి శాసనంలో లభించింది ?
జ: మెదక్ జిల్లా తెల్లాపూర్ లో లభించిన శాసనంలో ఈ పేరు ప్రస్తావించారు.
3) తెలివాహన నది అంటే ఏది ?
జ: గోదావరి ( దీని నుంచే తిలింగ్ శబ్దం వచ్చిందని చెబుతారు)
4) తిలింగ శబ్దాలను ఉపయోగించిన ముస్లిం చరిత్రకారులు ఎవరు ?
జ: అమీర్ ఖుస్రో (తిలింగ), అబుల్ ఫజల్ (తెలింగాణ)
5) శ్రీకృష్ణ దేవరాయులు వేయించిన ఏ శాసనాల్లో తెలంగాణ శబ్దం కనిపిస్తుంది
జ: తిరుమల (చిత్తూరు జిల్లా), చిన్నకంచి (తమిళనాడు) శాసనాల్లో కనిపిస్తుంది.
6) దక్షిణా పథాన్ని తన రచల్లో పేర్కొన్న గ్రీకు యాత్రికుడు ఎవరు ?
జ: పెరిప్లస్ ( ప్లీని సమకాలికుడు) తమిళనాడును మినహాయించాడు.
7) దక్షిణ భారతదేశంలో ఏర్పడిన ఏకైక మహాజనపదం ఏది?
జ) ఆశ్మక.
8) ఆశ్మక రాజధాని అయిన పోతన (బోధన్) తెలంగాణాలోని ఏ జిల్లాలో ఉంది?
జ) నిజామాబాద్

9) దక్షిణ భారతదేశంలో బౌద్దాన్ని మొదట వ్యాప్తి చేసినది ఎవరు?
జ) భావరి.
10) భావరి బౌద్దమతాన్ని ఎక్కడి నుంచి మొదలుపెట్టారు ?
జ) ఆదిలాబాద్ జిల్లాలోని భావనకుర్తి
11) మొదటగా తెలంగాణలో దిగంబర జైన మతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ?
జ) భద్రబాహు
12) ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి రాజవంశంగా ఎవరిని గుర్తిస్తారు?
జ) శాతవాహనులు
13) శాతవాహన రాజ్య స్దాపకుడైన సిముఖుడు తెలంగాణాలో ఎక్కడి నుంచి పాలించాడు?
జ) కోటిలింగాల
14) తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది ?
జ: 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా
15) తెలంగాణ ఏ పీఠభూమిలో ఉంది ?
జ: దక్కన్ పీఠభూమికి మధ్యభాగంలో
16) తెలంగాణ పీఠభూమిలో ఎన్ని రకాల శిలలు ఉన్నాయి?
జ) రెండు. 1. గోండ్వానా శిలలు 2.దక్కన్ నాపలు.
17) ఆశ్మక రాజు బోధన్ లో ఏ విగ్రహాన్ని నిర్మించాడు?
జ) గోమఠీశ్వర 1
18) తెలంగాణ ప్రాంతం అప్పటి ఏ రాజ్యంలో ఉండేది?
జ) ఆశ్మక
19) ఆశ్మక రాజ్యంలో ప్రజలు ఏ మతాన్ని పాటించారు?
జ) బౌద్దం లేదా జైన మతం.
20) శాతవాహన రాజు కుంతల శాతకర్ణికి సమకాలికుడు ఎవరు?
జ) గుణాడ్యుడు
21) గుణాఢ్యుడు బృహత్కథను ఏ భాషలో రాశాడు ?
జ: పైశాచి భాష (ఇదే తెలుగు భాషకు మూలమని చెబుతారు)

22) శాతవాహనుల అధికార భాష ఏది?
జ) ప్రాకృతం
23) గుణాఢ్యుడి కాలంలో ఏ పదాలు వాడుకలోకి వచ్చాయి?
జ) తెలుగు
24) హిందూ దేవాలయాలను మొదటగా నిర్మించినది ఎవరు ?
జ) ఇక్ష్వాకరాజు ఎహువల శాంతమూలుడు. నాగార్జున కొండ దగ్గర
25) తెలంగాణలోని మొదటి సంస్కృతి శాసనమైన ఇంద్రపాల నగర శాసనాన్ని వేయించినది ఎవరు ?
జ) గోవిందవర్మ (ఇది నల్గొండ జిల్లాలో ఉంది)
26) తెలంగాణలోని తొలి ప్రాకృత శాసనమైన హైదరాబాద్ చైతన్యపురి శాసనాన్ని ఎవరు వేయించారు?
జ) గోవిందవర్మ
27) క్రీ.పూ.6వ శతాబ్దంలో ఎన్ని మహాజన పదాలు ఉండేవి ?
జ) 16 జనపదాలు
28) మహాజనపదాల గురించి మొదటగా ఎందులో ప్రస్తావించబడింది?
జ) సుత్త పీఠికలోని అంగుత్తరనికయ
29) తెలంగాణవారి కాలంలో ఎన్ని వృత్తి శ్రేణులు ఉండేవి?
జ)18 వర్గాలు
30) మహాజన పదాల కాలంలో ఏ నాణేలు ముద్రించేవారు?
జ) సీసం నాణేలు
31) విదేశీ వర్తకం ప్రధానంగా ఎవరితో చేశారు?
జ) రోమ్ దేశం.
32) ఇనుము పరిశ్రమ ఎక్కడ బాగా ప్రసిద్ది చెందింది?
జ) కొండాపూర్
33) తెలంగాణ, తెలుగు ప్రజల గురించి ప్రస్తావించిన మొదటి సాహిత్య గ్రంథాలు ఏవి ?
జ: మార్కండేయ పురాణం, వాయు పురాణం
34) కళింగ అనే పదానికి అర్థమేంటి ?
జ: వరి ధాన్యం తినేవారు లేదా జలమయం అని అర్థం
35) తెలుగు తామ్ర శాసనాల్లో మొదటి శాసనం ఏది ?
జ: మద్రాస్ మ్యూజియం తామ్ర శాసనం
36) కాకతీయ రాజు ప్రోలరాజు మొదటగా ఏయే చెరువులను తవ్వించాడు?
జ) కేసముద్రం, జగత్ కేసరి
37) తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు స్ఫూర్తి ఎవరు?
జ) ఒకటో ప్రోలరాజు (ఈయన హయాంలోనే చెరువులు తవ్వించబడ్డాయి)
38) చెంచులు తెలంగాణాలోని ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నారు?
జ) మహబూబ్ నగర్ (వారి ఆరాధ్య దైవం భైరవుడు)
39) పోచంపల్లి దేనికి ప్రసిద్ది ?
జ) చేనేత వస్త్ర్రాలు
40) అద్దకం పరిశ్రమ ఎక్కడ ఉంది?
జ) మెదక్
41) బొమ్మలు, ఆటవస్తువులకు ప్రసిద్ది చెందిన ప్రదేశం ఏది?
జ) నిర్మల్ (బూరుగు, పొనుకు కర్రతో బొమ్మలు చేస్తారు )
42) బిద్రి లోహంతో ఏమేమి తయారుచేస్తారు?
జ) నీళ్ల కూజాలు,హుక్కాలు,భరిణెలు.
43) లేసు అల్లికలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది ?
జ: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం
44) నృత్య కళలకు పుట్టిల్లు ఏది?
జ) నిజామాబాద్.
45) గుస్పాడీ నృత్యం ఎప్పుడు మొదలవుతుంది?
జ) పౌర్ణమినాడు మొదలై బహుళ చతుర్దశి వరకు
46) గరగ నృత్యం ఎక్కడ ఏ సందర్బంలో చేస్తారు?
జ) బోనాలు

47) పేరిణి శివతాండవం ఏ ప్రాంతంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది?
జ) వరంగల్
48) ఓరుగల్లును ఏమని అంటారు ?
జ) వరంగల్ ( ఆంధ్ర మహానగరి)
49) స్వయంభూ దేవాలయానికి రంగమండపాన్ని నిర్మించింది ఎవరు?
జ) రుద్రమదేవి
50) కాకతీయుల కాలంనాటి దేవాలయాల్లో గొప్పది ఏది?
జ) రామప్ప దేవాలయం.
51) రామప్ప ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
జ) రేచర్ల రుద్రుడు.
52) హైదరాబాద్ లో ఏ భాష మాట్లాడేవారు?
జ) ఉర్దూ
53) సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుంది?
జ) వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో
54) సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర్ర పండుగగా ఎప్పుడు గుర్తించారు?
జ) 1996
55) మేడారంలో అమ్మవార్లకు నైవేద్యంగా ఏమి సమర్పిస్తారు?
జ) బంగారం(బెల్లం)
56) బతుకమ్మ పండుగను రాష్ట్ర్ర పండుగగా ఎప్పుడు గుర్తించారు?
జ) 2014, జూన్ 16
57) బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు జరుపుతారు ?
జ) 9 రోజులు
58) బతుకమ్మ చివరిరోజును ఏమని పిలుస్తారు?
జ) సద్దుల బతుకమ్మ
59) బోనాల పండుగ సందర్భంగా ఎవరిని ఆరాధిస్తారు?
జ) మహంకాళి అమ్మవారు
60) బాసర ఏ జిల్లాలో ఉన్నది?
జ) నిర్మల్ జిల్లా (గతంలో అదిలాబాద్)
61) జ్ఞాన సరస్వతి దేవి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారు?
జ) వ్యాసమహర్షి
62) బతుకమ్మ పండుగలో మొదటిరోజుని ఏమని పిలుస్తారు?
జ) ఎంగిలిపూల బతుకమ్మ

 

63) మిగతా రోజుల్లో బతుకమ్మను ఏయే పేర్లతో పిలుస్తారు?
జ) 1వ వ రోజు -ఎంగిలిపూల బతుకమ్మ
2వ రోజు - అటుకులబతుకమ్మ
3వ రోజు - ముద్ద పప్పు బతుకమ్మ
4వ రోజు - నాన బియ్యం 5వ రోజు - అట్ల బతుకమ్మ
6వ రోజు - అలిగిన బతుకమ్మ
7వ రోజు - వేపకాయల బతుకమ్మ
8వ రోజు - వెన్నముద్దల బతుకమ్మ
64) తెలంగాణ రాష్ట్ర్రంలోని అత్యంత ఎత్తయిన జలపాతం ఏది?
జ) కుంటాల జలపాతం
65) నిర్మల్ దేనికి ప్రసిద్ది చెందింది?
జ) కొయ్యబొమ్మలు
66) చార్మినార్ ను ఎవరు నిర్మించారు?
జ) మహ్మద్ కులీకుత్ బ్ షా.
67) సాలర్ జంగ్ మ్యూజియం దేనికి ప్రసిద్ది ?
జ) గడియారాల సేకరణలో
68) గోల్కొండ కోట దేనికి జన్మస్దానంగా పేర్కొంటారు?
జ) వజ్రాలు, రత్నాలు
69) హుస్సేన్ సాగర్ కు ఇంకొక పేరు ఏంటి?
జ) ట్యాంక్ బండ్
70) హుస్సేన్ సాగర్ లో బుద్ద విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
జ) ఎన్టీ రామారావు
71) ఫలక్ నామా ప్యాలెస్ ను ఇప్పుడు ఎలా మారింది ?
జ) హెరిటేజ్ హోటల్
72) మాసాబ్ ట్యాంక్ ను నిర్మించినది ఎవరు ?
జ) హయత్ బక్షీ బేగం (ఈమె పేరుమీదే హయత్ నగర్ ఏర్పడింది)
73) బిర్లామందిర్లో ఏ దేవుడి విగ్రహం ఉంది?
జ) వెంకటేశ్వర స్వామి
74) భారతదేశంలోని అతి పెద్ద మసీదు ఏది?
జ) మక్కామసీదు

75) కొండగట్టు దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?
జ) కృష్ణారావు దేశ్ ముఖ్
76) భద్రాచల ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
జ) కంచర్ల గోపన్న
77) జమలాపురానికి ఉన్న ఇంకో పేరు ఏంటి?
జ) తెలంగాణ తిరుపతి
78) గద్వాల్ దేనికి ప్రసిద్ది చెందింది?
జ) నేత చీరలకు
79) మెదక్ కోటను ఎవరు నిర్మించారు?
జ) కాకతీయ ప్రతాప రుద్రుడు.
80) ఆసియా ఖండంలోనే అతి పెద్ద చర్చి ఏది?
జ) మెదక్ చర్చి
81) ఇటీవల యాదగిరిగుట్టను ఏ పేరుతో పిలుస్తున్నారు?
జ) యాదాద్రి
82) భువనగిరి కోటను ఎవరు నిర్మించారు?
జ) త్రిభువన మల్ల విక్రమాదిత్యడు
83) పోచంపల్లిని ఏమని పిలుస్తారు ?
జ) సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా.
84) ఆసియాఖండంలోనే అతి పెద్ద రిజర్వాయర్ ఏది?
జ) నాగార్జునసాగర్
85) నిజాంసాగర్ డ్యాంను ఎక్కడ నిర్మించారు?
జ) మంజీరనదిపై అచ్చంపేట గ్రామం దగ్గర
86) చిలుకూరు బాలాజీకీ ఇంకో పేరేంటి ?
జ) వీసా బాలాజీ
87) మేడారం జాతర ఎన్నేళ్ళకోసారి జరుగుతుంది?
జ)రెండేళ్ళకి
88) తెలంగాణలో అద్దకపు పరిశ్రమకు పేరున్న జిల్లా ఏది?
జ) మెదక్
89) పేరిణి శివతాండవం నృత్యకళలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది ఎవరు?
జ) పద్మశ్రీ నటరాజ రామకృష్ణ
90) శివుడు లింగ రూపంలో ఏయే ప్రాంతాల్లో వెలిశాడని చెబుతారు?
జ) కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం
91) దేశంలోనే అతి పురాతన బహుబలి విగ్రహం ఎక్కడుంది?
జ) బోధన్ (నిజామాబాద్)
92) మొదటగా తెలంగాణలోనే దిగంబర జైనమతాన్ని ఎవరు వ్యాప్తి చేశారు?
జ) భద్రబాహు
93) జైనమత నిజమైన స్దాపకుడు ఎవరు?
జ) వర్దమాన మహావీరుడు
94) ఏ జాతరను దక్షిణ భారతదేశ కుంభమేళాగా పరిగణిస్తారు?
జ) సమ్మక్క సారక్క
95) సంక్రాంతి పండగని తమిళనాడులో ఏమని పిలుస్తారు ?
జ) పొంగల్
96) రాష్ట్ర్రంలోనే అత్యంత ఎత్తయిన కుంటాల జలపాతం ఎత్తు ఎంత?
జ) 45 మీటర్లు

97) హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ ఎత్తు ఎంత?
జ) 180 అడుగులు
98) అబ్దుల్లా కుతుబ్ షా నిర్మించిన తారామతి మందిరాన్ని టూరిజం శాఖ ఏ విధంగా మార్చింది ?
జ) తారామతి బారాదరి కల్చరల్ విలేజ్
99) చౌమహల్లా ప్యాలెస్ నిర్మాణం ఏ నిజాం రాజు కాలంలో పూర్తయింది?
జ) అఫ్జల్ ఉద్దౌలా
100) ఏ చెరువును రహస్య చెరువు అంటారు ?
జ) దుర్గం చెరువు (హైదరాబాద్) (గోల్కొండ కోటలో ఉండే కుతుబ్ షాహీలకు ఇక్కడి నుంచే తాగునీటి సరఫరా జరిగేది)
101) హిందూ దేవాలయంలోనే దర్గా కూడా ఎక్కడ ఉంది ?
జ) వేముల వాడలోని రాజరాజేశ్వరి దేవాలయంలో.
102) 3 ఎకరాల్లో విస్తరించిన అతి పెద్ద వృక్షం ఏది ? ఎక్కడుంది ?
జ) పిల్లలమర్రి వృక్షం ( మహబూబ్ నగర్ ) (700 యేళ్ళ నాటిది)
103) బ్రహ్మకు ఏ ప్రాంతంలో దేవాలయం ఉంది?
జ) కాళేశ్వరం (కరీంనగర్)
104) మేథో సంపత్తి హక్కులు పొందిన రాష్ట్రానికి చెందిన మొదటి ఉత్పత్తి ఏది?
జ) పోచంపల్లి చీర
105) 1951లో ఆచార్య బినోభాభావే భూదాన్ ఉద్యమం ప్రారంభించిన ప్రాంతమేది?
జ) భూదాన్ పోచంపల్లి
106) క్రీ.శ.1213లో రేచర్ల రుద్రుడు నిర్మించిన దేవాలయం ఏది?
జ)రామప్ప దేవాలయం (ఇతను గణపతిదేవుని యొక్క సేనాని)