Friday, July 19

TRT నియామకాలకు ప్రభుత్వం ఆదేశాలు

రాష్ట్రంలో టీఆర్టీ నియామకాలను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డికి ఆదేశాలు జారీచేసింది. దాంతో టీఆర్టీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇవాళ, రేపట్లో విడుదలవుతాయి. దాంతో ఈ నెలాఖారులోగా నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. పోస్టల భర్తీ కోసం గత కొన్ని రోజులుగా టీఆర్టీ సెలెక్టడ్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.