టెట్ సర్టిఫికెట్ కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ

టెట్ సర్టిఫికెట్ కు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ

టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ చెల్లుబాటు సమయాన్ని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి పెంచుతూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 2011 నుంచి ఈ నిర్ణయం అమలయ్యేలా కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 7 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వారికి రీవ్యాలిటేడ్ చేయాలని లేదా కొత్త టెట్ సర్టిఫికెట్ జారీ చేయాలని సూచించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.