Tuesday, September 25
Log In

TEST : 349, 350-CA- DEC 19&20

రాష్ట్రీయం
1) ప్రపంచ తెలుగు  మహాసభల ముగింపు ఉత్సవంలో ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
2) ప్రతి యేటా ఏ నెలలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు ?
జ: డిసెంబర్ నెలలో
3) దళిత విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఉద్దేశించిన అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ఆదాయ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది?
జ: రూ.5 లక్షలు ( గతంలో రూ.3 లక్షలు )
4) సీతారామ ఎత్తిపోతల సాగునీటి పథకానికి తెలంగాణ వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది.  ఈ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు ?
జ: ఖమ్మంజిల్లాలో
5) జాతీయ డిజైన్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ?
జ:  డాక్టర్ జి.సతీష్ రెడ్డి
(నోట్: కేంద్ర రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు, క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరక్టర్ జనరల్ )

జాతీయం
6) గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.  ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయి
జ: గుజరాత్ 182, హిమాచల్ ప్రదేశ్ 68 సీట్లు
7) నీట్, జేఈఈ ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, పరీక్షల నిర్వహణకు ఏ పేరుతో స్వతంత్ర్య ప్రతిపత్తి సంస్థను ఏర్పాట్లు చేయాలనుకుంటోంది ?
జ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)
8) మాధ్యమిక, ఉన్నత విద్యా సుంకం కింద కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న రూ.83,497 కోట్లు వృధాగా పడి ఉన్నట్టు కాగ్ గుర్తించింది.  ఈ ఎడ్యుకేషన్ సెస్ ను ఎప్పటి నుంచి వసూలు చేస్తున్నారు ?
జ: 2007 నుంచి
9) ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో అత్యధికంగా ఉంటున్న  దేశీయుల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది ?
జ: మొదటి స్థానం
( ఐక్యరాజ్యసమితి వెల్లడించిన అంతర్జాతీయ వలస నివేదిక ప్రకారం) (1.7 కోట్ల మంది భారతీయులు)
10) జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఏ చట్టం స్థానంలో ఇది అమల్లోకి వస్తుంది ?
జ: Medical Council Act of 1956
11) ఇంటికి ఆహారం తెచ్చి ఇచ్చే ఫుడ్ పాండ్ భారత్ వ్యాపార విభాగాన్ని ఏ సంస్థ సొంతం చేసుకోనుంది ?
జ: ఓలా
12) స్టార్టప్ లను ప్రోత్సహించడానికి వెయ్యి కోట్ల నిధులతో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ను ఎక్కడ నెలకొల్పనున్నారు ?
జ: ఉత్తరప్రదేశ్
13) ఐదేళ్ళ పదవీకాలం అయిపోవడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్ పర్సన్ పదవికి ఎవరు రాజీనామా చేశారు ?
జ: జస్టిస్ స్వతంత్ర్య కుమార్
14) ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించేందుకు దేశంలోనే మొదటిసారిగా సోషల్ ఆడిట్ లా ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏది ?
జ: మేఘాలయ
15) ఏకవీరన్ ( EKUVERIN) పేరుతో ఏ రెండు దేశాలు సంయుక్త విన్యాసాలు జరుపుతున్నాయి ?
జ: భారత్, మాల్దీవులు
16) గంగానది ఒడ్డున ఉన్న ఏ రెండు పట్టణాల్లో ప్లాస్టిక్ బ్యాకులు, ప్లేట్స్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పూర్తిగా నిషేధం విధించింది ?
జ: హరిద్వార్, రిషికేష్
17) పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రం ఏది ?
జ: నాగాలాండ్
18) న్యాయ గ్రామ్ అనే మోడల్ టౌన్ షిప్ ను ఏ హైకోర్టు తరపున నిర్మించనున్నారు
జ: అలహాబాద్ హైకోర్టు
19) POEATRY పుస్తక రచయిత ఎవరు ?
జ: వికాస్ ఖన్నా
20) విజయ్ దివస్ ను ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: డిసెంబర్ 16
21) దేశీవాళీ రంజీ క్రికెట్ లో పదేళ్ల తర్వాత ఫైనల్ కు చేరిన జట్టు ఏది ?
జ: ఢిల్లీ (కెప్టెన్: మనోజ్ తివారీ)

అంతర్జాతీయం
22) మిస్ ఇండియా USA 2017 కిరీటం ఎవరికి దక్కింది ?
జ: శ్రీసైని ( వాషింగ్టన్ )
23) వార్తల సర్వీసు కోసం అంతర్జాతీయ న్యూస్ నెట్ వర్క్ ను ఏ మీడియాతో కలసి ట్విట్టర్ ప్రారంభించింది ?
జ: బ్లూమ్ బర్గ్ మీడియా
24) ఏ దేశంలో మైనింగ్ సంస్థలను ఉపసంహరించుకుంటున్నట్టు అదానీ  గ్రూప్ ప్రకటించింది
జ: ఆస్ట్రేలియా
25) ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్ ను ఎవరు గెలుచుకున్నారు ?
జ: ఆస్ట్రేలియా
26) ఏ అరబ్ దేశ రాజభవనమే లక్ష్యంగా ఇరాన్ కు చెందిన హుతి తిరుగుబాటు దారులు వోల్కనో H2 క్షిపణిని ప్రయోగించారు ?
జ: సౌదీ అరేబియా (దీన్ని సౌదీ కూల్చేసింది )
27) మే 2018 లో ప్రపంచ దేశాల్ని వణికించిన వాన్న క్రై వైరస్ సైబర్ ఎటాక్ వెనుక ఏ దేశం ఉన్నట్టు అమెరికా అధికారులు తేల్చారు ?
జ: ఉత్తర కొరియా
28) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జెరూసలెం తీర్మానం ఆమోదం పొందకుండా వీటో పవర్ వినియోగించిన దేశం ఏది ?
జ: అమెరికా ( ఆరేళ్ళల్లో ఇదే ప్రథమం )
29) ప్రపంచంలో మొదటిసారిగా ఒంటెల కోసం ప్రత్యేక హాస్పిటల్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: దుబాయ్
30) బీబీసీ ఓవర్సీస్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2017 ఎవరికి దక్కింది ?
జ: రోజర్ ఫెదరర్
31) గూగుల్ సంస్థ ఏ హై ఎండ్ స్మార్ట్ ఫోన్ ఆగ్ మెంటెడ్ రియాలిటీ  ప్లాట్ ఫామ్ ను మూసెయ్యాలని నిర్ణయించింది ?
జ: టాంగో
32) 2022లో బీజింగ్ లో జరిగే వింటర్ ఒలింపిక్స్ గుర్తు ఏంటి ?
జ: వింటర్ డ్రీమ్
33) మొట్టమొదటి ఇంటర్నేషనల్ వీల్ చైర్ క్రికెట్ టోర్నమెంట్ ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు ?
జ: నేపాల్

===========================================

మా కరెంట్ ఎఫైర్స్ ను కాపీ చేసి... వాట్సాప్, ఫేస్ బుక్ లో PASTE చేసే వారికి విజ్ఞప్తి.... దయచేసి... మా వెబ్ సైట్ పేరును కూడా అందులో పెట్టగలరు.

===========================================

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు ( SGT, SA (సోషల్ ) వివరాలకు క్లిక్ చేయండి:

http://tsexams.com/trt-telugu-pandit-biology-mock-tests/

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు తెలుగు పండిట్, బయాలజీ వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/

AEE/ CDPO మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/aeecdpo-mock-tests/