Tuesday, September 25
Log In

TEST:347&348 – CA -DEC 17&18

రాష్ట్రీయం
1) బిజినెస్ వరల్డ్ ప్రకటించిన లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది ?
జ: మంత్రి కేటీఆర్ కి
2) నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో అత్యంత వెనకబాటు జిల్లాలు ఏవి ?
జ: మహబూబాబాద్, గద్వాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్
3) నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం అభివృద్ధిలో ముందంజలో ఉన్న జిల్లాలు ఏవి ?
జ: హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్
4) భూమిలేని నిరుపేద కూలీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది ?
జ: భూపాలపల్లి (రెండో స్థానం మహబూబాబాద్ )
5) ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు కలిగిన జిల్లాలు ఏవి ?
జ: గద్వాల, మహబూబాబాద్ నిర్మల్


6) నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం మరుగుడొడ్లు లేని ఇళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి
జ: గద్వాల, వికారాబాద్, నిర్మల్
7) తాగునీటి వసతి లేని గ్రామాలు అత్యధికంగా కలిగిన జిల్లాలు ఏవి ?
జ: నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ , ఆసిఫాబాద్
8) ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు టౌన్ హాల్ మీటింగ్స్ తరహాలో GHMC మొదలుపెట్టిన కార్యక్రమం ఏది ?
జ: మన నగరం (అప్నా షహర్)
9) మన నగరం (అప్నా షహర్) కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మొట్టమొదటి సమావేశాన్ని మంత్రి కేటీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?
జ: కుత్బుల్లాపూర్
10) కొమురవెల్లి మల్లన్న కళ్యాణం ఏ జిల్లాలో జరుగుతోంది ?
జ: సిద్ధిపేట
11) కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఏ ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ కళ్యాణం చేస్తారు ?
జ: వీర శైవ
12) క్రిస్మస్ సందర్భంగా రాష్ట్రంలో ఎన్ని పేదల క్రిస్టియన్ కుటుంబాలకు కానుకలు ఇవ్వాలని ( వస్త్రాల పంపిణీ) ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 2.13 లక్షల కుటుంబాలు

జాతీయం
13) 60 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ మిజోరం రాష్ట్రంలో ప్రారంభించారు. దాని పేరేంటి ?
జ: తుయిరియల్ జలవిద్యుత్ ప్రాజెక్టు
14) ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సరుకు రవాణాకి ఎప్పటి నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు లేదా ఈ -వే బిల్లు విధానం ప్రవేశపెట్టాలని GST మండలి నిర్ణయించింది ?
జ: జూన్ 1, 2018 నుంచి
15) ఎన్ని వేల రూపాయలకు పైబడిన సరుకులకు ఈ వే బిల్లును తప్పని చేస్తున్నారు ?
జ: రూ.50 వేలకు
16) అక్రమంగా పేమెంట్ బ్యాంక్ ఖాతాలు తెరుస్తోందన్న ఆరోపణలతో ఏ సంస్థ E-KYC లైసెన్సును UIDAI రద్దు చేసింది ?
జ: ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్
17) దేశంలోనే తొలిసారిగా 14 లైన్లతో 2.5 మీటర్ల వెడల్పుతో సైకిల్ ట్రాక్ ను ఏ ఎక్స్ ప్రెస్ హైవేపై నిర్మించారు?
జ: ఢిల్లీ - మీరట్
(నోట్: ఈ సైకిల్స్ కి ప్రాచుర్యం కల్పించేందుకు బాలీవుడ్ స్టార్ సల్మార్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు )
18) 45 యేళ్ళ పాటు సాయుధ బలగాలకు సేవలందించిన MI8 హెలికాప్టర్లను వాయుసేన అధికారికంగా వీడ్కోలు పలికింది. వీటికి మరో పేరేంటి ?
జ: ప్రతాప్ హెలికాప్టర్లు
(నోట్: సోవియెట్ యూనియన్ కాలానికి చెందిన. 1972లో భారత్ వాయుసేనలో చేరాయి. ఆపరేషన్ మేఘ్ దూత్, ఆపరేషన్ పవన్ లాంటి వాటిల్లో ఇవి సేవలు అందించాయి )
19) రష్యన్ తయారీ సుఖోయ్-30 యుద్ధ విమానాల్లో  ఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ని అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు ?
జ: బ్రహ్మోస్

అంతర్జాతీయం
20) అమెరికా H1B వీసా కలిగిన ఉద్యోగులు తమ భాగస్వాములు (భార్య/భర్త)ను ఉద్యోగానికి తీసుకెళ్ళేందుకు ఉద్దేశించిన వీసా ఏది ?
జ: H4

===========================================

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు ( SGT, SA (సోషల్ ) వివరాలకు క్లిక్ చేయండి:

http://tsexams.com/trt-telugu-pandit-biology-mock-tests/

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు తెలుగు పండిట్, బయాలజీ వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/

AEE/ CDPO మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/aeecdpo-mock-tests/