Tuesday, September 25
Log In

TEST:297- CA OCT 26

రాష్ట్రీయం
1) తెలంగాణ రాష్ట్ర ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ ( FRMB) పరిమితిని కేంద్రం ఎంతకుపెంచింది ?
జ: 3.5శాతం
(నోట్: గతంలో ఇది 3శాతం ఉండేది.)
2) రాష్ట్ర ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (FRMB) పరిమితిని కేంద్రం 3.5శాతానికి పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికోట్ల రుణాన్ని అదనంగా పొందే అవకాశం ఏర్పడింది ?
జ: రూ.3,574 కోట్లు
3) కాళేశ్వరం అటవీ భూమి కేటాయింపునకు కేంద్రం ఒప్పుకుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత భూమిని కేంద్ర అటవీశాఖకు బదలాయించనుంది ?
జ: 3,168.13 హెక్టార్ల
4) అటవీ భూములను ఇచ్చినందుకు ఎన్ని లక్షల మొక్కలు నాటాలని కేంద్ర అటవీశాఖ రాష్ట్రానికి సూచించింది ?
జ: 50.69 లక్షలు
5) రాష్ట్రంలో నడుస్తున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి ఎవరు ?
జ: అహ్లూవాలియా


6) ముంబైలో నిర్వహించే అంతర్జాతీయ ఖళాఖండాల ప్రదర్శన ఇండియా అండ్ ది వరల్డ్ లో రాష్ట్రానికి చెందిన ఏ శిల్పాన్ని ప్రదర్శనకు పెడుతున్నారు ?
జ: ఫణిగిరిలోని బుద్ధుడి శిల్పం
7) హైదరాబాద్ లో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది
జ: రూ.5 కోట్లు
8) రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ( TSIIC) ఛైర్మన్ ఎవరు ?
జ: గ్యాదరి బాలమల్లు
9) పర్యావరణ హితంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలు స్టేషన్లకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ఏ రేటింగ్ దక్కింది ?
జ: ప్లాటినం
10) దేశంలోని అన్ని రాష్ట్రాల పర్యాటక ప్రాంతాల గురించి డిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పర్యాటక పర్వ్ లో తెలంగాణకి చెందిన ఏ నృత్యాన్ని ప్రదర్శించారు ?
జ: పేరిణి శివతాండవం

జాతీయం
11) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఎప్పుడు ఎన్నికలు జరగనున్నాయి ?
జ: డిసెంబర్ 9, 14
12) గుజరాత్ అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉన్నాయి ?
జ: 182 సీట్లు
13) ఏ రోజును యాంటీ బ్లాక్ మనీ డే గా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: నవంబర్ 8
(నోట్: పెద్ద నోట్ల రద్దు జరిగిన రోజున )
14) భారత్ లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఎవరు ?
జ: టిల్లర్ సన్
15) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి లండన్ లో గోల్డ్ పీకాక్ అవార్డు ఏ విభాగంలో లభించింది ?
జ: పబ్లిక్ సర్వీస్, ఎకనమిక్ ట్రాన్స్ ఫర్మేషన్
16) వచ్చే ఏడాదిలో చంద్రయాన్ 2 కోసం ఇస్రో సన్నాహాలు చేస్తోంది.  చంద్రయాన్ -1 ప్రయోగాన్నిఇస్రో ఎప్పుడు నిర్వహించింది ?
జ: 2008లో
17) భారత్ మాలలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ వేలను కేంద్రం అభివృద్ది చేయనుంది ?
జ: 1837 కిలోమీటర్లు
18) అహ్మదాబాద్ - ముంబై హైస్పీడు రైలుకు ఎవరు రూపొందించిన లోగోకు ఆమోదం లభించింది ?
జ: చక్రధర్ ఆళ్ళ
(నోట్: అహ్మదాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో పీజీ చేస్తున్నాడు )
19) వివిధ పథకాలద్వారా లబ్దిపొందేందుకు ఆధార్ లింకేజ్ చేయడానికి గడువును కేంద్రం ఎప్పటివరకూ పొడిగించింది ?
జ: 2018 మార్చి 31 వరకూ
20) 2G, 3G మొబైల్ బిజినెస్ కు గుడ్ బై కొట్టిన ప్రముఖ సంస్థ ఏది ?
జ: ఆర్ కామ్(రిలయన్స్ కమ్యూనికేషన్స్ )
21) ఆర్బీఐ నియమించిన పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ టాస్కఓ ఫోర్స్ కి ఎవరు అధిపతిగా నియమితులయ్యారు ?
జ: ఎం. దియోస్థాలీ
22) ట్రాక్టర్ల కొనుగోలుకు ఫైనాన్స్ చేసేందుకు ఎస్కార్ట్స్ సంస్థతో MOU కుదుర్చుకున్న బ్యాంకు ఏది ?
జ: STATE BANK OF INDIA
23) క్యోస్ ఏజ్ కన్సల్టింగ్ సంస్థ రిపోర్ట్ ప్రకారం డిజిటలీకరణలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ?
జ: మధ్యప్రదేశ్

అంతర్జాతీయం
24) అర్బన్ క్యాపిటల్ అనే సంస్థ రూపొందించి గ్లోబల్ పాస్ పోర్ట్ పవర్ ర్యాంక్ లో... ప్రపంచంలో శక్తివంతమైన పాస్ పోర్ట్ జారీ చేస్తున్న దేశంగా ఏది మొదటి స్థానంలో నిలిచింది ?
జ: సింగపూర్