Tuesday, September 25
Log In

TEST:293-CURRENT AFFAIRS-OCT 22

రాష్ట్రీయం
1) డిసెంబర్ లో హైదరాబాద్ లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల వెబ్ సైట్ ఎవరు ప్రారంభించారు ?
జ: ముఖ్యమంత్రి కేసీఆర్
2) రైతుల వ్యవసాయ భూములకు పాస్ బుక్, టైటిల్ డీడ్ స్థానంలో వేటిని ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ?
జ: డిజిటల్ ఈ-పాస్ కార్డ్
3) రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల సరుకుల పంపిణీలో దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఏ విధానం అవలంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: నేరుగా క్యాష్ బదిలీ
4) రాష్ట్రంలో ఎన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ?
జ: 151 మండలాలు
5) ఛాతి వైద్యుల అంతర్జాతీయ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: డాక్టర్ శుభాకర్ ( ప్రముఖ శ్వాస కోశ వ్యాధుల నిపుణులు)
6) పెంపుడు జంతువుల కోసం కోటి రూపాయలతో పెట్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: కొండాపూర్ లో

జాతీయం
7) విధి నిర్వహణలో ఉన్న పోలీసులు చనిపోతే గతంలో ఉన్న ఎక్స్ గ్రేషియాని రెట్టింపు చెల్లిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎవరు ?
జ: యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్
8) చిన్నమొత్తాల పొదుపు పథకాలను మరిన్ని నిర్వహించడానికి ఏయే ప్రైవేటు బ్యాంకులకు కేంద్ర సర్కార్ అనుమతి ఇచ్చింది ?
జ: ICICI, HDFC, AXIS బ్యాంకులు
9) మనీ లాండరింగ్ ను అరికట్టేందుకు ప్రతి బ్యాంకు ఖాతాకి ఆధార్ ను అనుసంధానించడాన్ని తప్పనిసరి చేస్తూ ఎవరు ఆదేశాలిచ్చారు ?
జ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
10) కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పనిచేస్తున్న ఏ దేశానికి చెందిన కంపెనీలు ప్రపంచంలోనే నెంబర్ ఒన్ గా  నిలిచాయి ?
జ: భారత్ కంపెనీలు
11) కొత్తగా వ్యాపారం ప్రారంభించే సంస్థలు, ఫ్యాక్టరీలకు అనుమతులు ఇచ్చేందుకు ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభించిన మున్సిపల్ కార్పోరేషన్ ఏది ?
జ: బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (BMC)
12) గ్రామీణ ప్రాంతాల్లో మరుగు దొడ్లకు ఏమని పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది ?
జ: ఇజ్జత్ ఘర్ ( లేదా హౌస్ ఆఫ్ డిగ్నిటీ )
13)మరిజూనాని జబ్బులకు ఔషధంగా వాడటాన్ని చట్టబద్ధం చేసిన దేశం ఏది ?
జ: పెరూ
14) లతా మంగేష్కర్ అవార్డును అందుకున్నది ఎవరు ?
జ: గాయకులు అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్
15) జీఎస్టీ పై వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నాయని తమిళనాడులో ఏ సినిమాపై వివాదం చెలరేగింది ?
జ: మెర్సల్
అంతర్జాతీయం
16) ఎవరితో భేటీ అయినా, ఆతిథ్యం ఇచ్చినా దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తామని చైనా హెచ్చరించింది ?
జ: టిబెట్లన ఆధ్యాత్మిక గురువు దలైలామా
17) తెరచాప పడవలపై సముద్ర జలాల్లో ప్రతి మూడేళ్ళ కోసారి జరిగే వోల్వో ఓసియన్ రేస్ కప్ ఎక్కడ ప్రారంభం అవుతోంది ?
జ: అలికాంటే ( స్పెయిన్ లో )
18) సరిగ్గా 74 యేళ్ళ క్రితం (అక్టోబర్ 22, 1943) బ్రిటీష్ ప్రభుత్వం తిరుగుబాటు కోసం ఛలో ఢిల్లీ నినాదం ఇచ్చిన జాతీయ నేత ఎవరు ?
జ: నేతాజీ సుభాష్ చంద్రబోస్
(నోట్:  సింగపూర్ లో అర్జి హుకుమత్ -ఎ- ఆజాద్ హింద్ పేరుతో సైన్యం ఏర్పాటు చేసుకున్న సుభాష్ ఈ పిలుపు ఇచ్చారు )
19) ఏ దివంగత అధ్యక్షుడి రహస్యదస్త్రాలను వెల్లడించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమతి ఇచ్చారు ;?
జ: జాన్ ఎఫ్ కెన్నడీ
20) జపాన్ ప్రధానిగా షింజో అబే మరోసారి పదవిని చేపట్టే అవకాశాలున్నాయి.  ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ ఏది ?
జ: లిబరల్ డెమోక్రటిక్ పార్టీ
21) ఆస్ట్రేలియాలో ఏ కార్ల తయారీ కంపెనీని చివరగా మూసేశారు ?
జ: జనరల్ మోటార్స్ కంపెనీ ( అమెరికా )
22) ఫోర్బ్స్ ఆటగాళ్ళల్లో ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు ?
జ: క్రిస్టియానో రోనాల్డో (93 మిలియన్ డాలర్ల ఆదాయం )