Tuesday, September 25
Log In

TEST:263- CURRENT AFFAIRS -20SEPT

రాష్ట్రీయం
1) 2022 నాటికి గ్రామపంచాయతీల్లో దారిద్ర్య నిర్మూలనకు కేంద్రం 3 దశలను రూపొందించింది. అందుకోసం తెలంగాణలో ఎన్ని పంచాయతీలు ఎంపికయ్యాయి ?
జ: 1622 పంచాయతీలు
2) కేంద్రం ప్రకటించిన పునరుత్వాదక విద్యుత్ అవార్డ్ 2017 లో రాష్ట్రానికి చెందిన ఏ సంస్థకు అవార్డు లభించింది ?
జ: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ( TSSPDCL)
3) కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నియమించిన ఏ కమిటీ విచారణ జరుపుతోంది ?
జ: ఎ.కె. బజాజ్ కమిటీ
4) అమెరికా కాన్సులేట్ కు సొంతభవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ భూమిని కేటాయించింది ?
జ: నానక్ రాం గూడాలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో


జాతీయం
5) జీఎస్టీ అమలుతో భారత్ వృద్ధి రేటు ఎంతకు చేరుతుందని ప్రపంచబ్యాంక్ఇండియా అధ్యక్షుడు జునైద్ అహ్మద్ తెలిపారు ?
జ: 8శాతానికి పైగా
6) 2016-17 లో ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం భారత్ ఎంత వృద్ధి రేటును నమోదు చేసింది ?
జ: 7.1 శాతం
7) 1995 నుంచి జరిగిన ప్రకృతి వైపరీత్యాల్లో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ గటెరస్ ప్రకటించారు ?
జ: మూడో స్థానం
8) న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ వార్షిక సమావేశాల్లో భారత్ తరపున ఎవరు పాల్గొంటున్నారు ?
జ: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్
9) యూపీలోని ఫైజాబాద్ లో గుమ్ నామీ బాబా పేరుతో నివసించిన వ్యక్తి నేతాజీయే అనే కోణంలో దర్యాప్తు చేసిన కమిషన్ ఏది ?
జ: రిటైర్డ్ జస్టిస్ విష్ణు సహాయ్ కమిషన్
10) దేశంలో మొదటిసారిగా పశువుల చట్టం అమలు కోసం సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (హైదరాబాద్ )
11) ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా తమ తల్లిదండ్రులు, తమపై ఆధారపడిన వారిని చూసేలా PRANAM బిల్లును పాస్ చేసిన రాష్ట్ర అసెంబ్లీ ఏది ?
జ: అసోం
12) భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గుర్తింపుగా బ్రిటీష్ పార్లమెంట్ హౌస్ ఇచ్చే గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ 2017 ఏ బాలీవుడ్ నటుడికి దక్కింది ?
జ: సల్మాన్ ఖాన్
13) అమెరికాలోని వాషింగ్టన్ లో భారత్ - అమెరికా మధ్య జరుగుతున్న సంయుక్త సైనిక విన్యాసాల పేరేంటి ?
జ: యుద్ధ అభ్యాస్ 2017
14) భారత్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక సాయం చేసేందుకు ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ 200 డాలర్ల ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకోనుంది ?
జ: ఇండస్ ఇండ్ బ్యాంక్
15) భారత మహిళా క్రికెటర్, బౌలర్ జులన్ గోస్వామి కథను ఏ పేరుతో చిత్రంగా తీయనున్నారు ?
జ: చాక్ తహ్ ఎక్స్ ప్రెస్

అంతర్జాతీయం
16) ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: న్యూయార్క్
17) 1995 నుంచి జరిగిన ప్రకృతి వైపరీత్యాల్లో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో మొదటి రెండు దేశాలు ఏవి ?
జ: అమెరికా, చైనా
18) మహిళలకు సమాన వేతనాలు ఉండాలన్న నినాదంతో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన కూటమి ఏది ?
జ: సమాన వేతనం కోసం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఎపిక్ )
19) భారత్ సహా 30 దేశాల సైనికాధికారుల సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: సియోల్ (దక్షిణ కొరియా)
20) 2019లో సైనికాధికారుల సదస్సును ఎక్కడ నిర్వహిస్తామని అమెరికా ప్రతిపాదించింది ?
జ: భారత్ లో
21) 2018 సంవత్సరానికి ఎన్ని H1B వీసాలను మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించింది ?
జ: 65 వేలు
22) వేగంగా తిరిగే తారలు ధృవణ కాంతిని వెల్లడిస్తాయని 70యేళ్ళ క్రితం ఓ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త చేసిన సిద్ధాంతం ఇప్పుడు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఆ శాస్త్రవేత్త పేరేంటి ?
జ: సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్
(నోట్: 1964లో ఈ ప్రతిపాదనలు చేశారు. ఖగోళభౌతిక శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత )
23) పాకిస్తాన్ ఏ ఉగ్రవాద సంస్థపై చర్యలు తీసుకుంటేనే నిధులు మంజూరు చేస్తామని అమెరికా రక్షణ శాఖ తెలిపింది ?
జ: లష్కరే తోయిబా
24) సోవియట్ యూనియన్-అమెరికా మధ్య అణుయుద్దాన్ని నివారించిన రష్యా సైనికాధికారి స్టానిస్లావ్ పెట్రోవ్ చనిపోయారు. ఆయన కథతో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ఏది ?
జ: ద మేన్ హూ సేవ్డ్ ద వరల్డ్
25) ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ నైతిక విలువల కమిషన్ కు అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: యూఎన్ మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్