Tuesday, September 25
Log In

TEST : 361- CA – DEC 31

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో  మిషన్ కాకతీయ నాలుగో విడత కింద ఎన్ని చెరువుల పునరుద్దరణకు రూ.233 కోట్లను ప్రభుత్వం కేటాయించింది ?
జ: 968 చెరువులు
2) రాష్ట్రంలో విద్యుత్ ఘాతం మరణాలకు ఎంతమొత్తం పరిహారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: రూ.5లక్షలు ( గతంలో రూ.4లక్షలు)
3) తుంగభద్ర నదీజలాల్లో రాజోలి బండ మళ్లింపు పథకం (ఆర్టీఎస్) కు ఉన్న వాస్తవ నీటివాటా వినియోగంలో ఏర్పడుతున్న లోటును పూడ్చేందుకు ఏ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది
జ: తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం
4) ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేసేందుకు థర్డ్ పార్టీ ఎంక్వయిరీ కోసం ప్రభుత్వం ఎవరికి అనుమతి ఇచ్చింది ?
జ: ఆర్థిక సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్ )

జాతీయం
5) ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (IEA) కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ?
జ: ప్రొఫెసర్ ఎస్.మహేంద్ర దేవ్ ( ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ రీసెర్చ్  వైస్ ఛాన్సలర్ )
6) ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (IEA) 100వ సమావేవం అమరావతిలో జరిగింది.  తర్వాత జరిగే 101 సదస్సు ఎక్కడ జరగనుంది ?
జ: బీహార్ లోని బుద్ధగయ మగధ విశ్వవిద్యాలయంలో
7) పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ( PAC) సభ్యుడిగా కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్ సభ, రాజ్య సభ నుంచి ఎంతమంది సభ్యులు ఉంటారు ?
జ: లోక్ సభ నుంచి 22 మంది, రాజ్యసభ నుంచి ఆరుగురు సభ్యులు
8) ప్రస్తుతం పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎవరు ?
జ: మల్లిఖార్జున్ ఖర్గే
(నోట్: లోక్ సభలో ప్రతిపక్ష నేతను PAC కమిటీ ఛైర్మన్ గా నియమిస్తారు. 1967 నుంచి ప్రతిపక్షనేతలకు ఈ పదవి ఇస్తున్నారు. అంతకుముందు అధికార పార్టీకి ఇచ్చేవాళ్ళు )
9) పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ను ఎవరు నియమిస్తారు ?
జ: లోక్ సభ స్పీకర్
10) హిజ్రాల కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించి, వారికి నెలకు రూ.1500ఫించన్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: ఆంధ్రప్రదేశ్
11) 2018లో ఎన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ?
జ: ఎనిమిది రాష్ట్రాలు
12) రెండో దఫా భారత్ నెట్ ప్రాజెక్ట్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఛత్తీస్ గఢ్
13) రాష్ట్రమంతటా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?
జ: అసోం
14) భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద దేశంలోని అన్ని గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఎంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ?
జ: రూ.4066 కోట్లు
15) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) కు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: వినయ్ సహస్రబుద్ధే
16) ప్రపంచ చెస్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన  విశ్వనాథన్ ఆనంద్... ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్ లో ఏ పతకం సాధించాడు ?
జ: కాంస్య పతకం
17) 61వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది ?
జ: కేరళ

అంతర్జాతీయం
18) న్యాయవ్యవస్థను తిట్టిన కేసులో ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి ఎన్నేళ్ల శిక్ష పడింది
జ: 3యేళ్లు
19) ఒంటరిగా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేధించిన దేశం ఏది ?
జ: నేపాల్
20) పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 700 మెగావాట్లతో కొత్తగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయడానికి ఏ దేశం నిర్ణయించింది ?
జ: పాకిస్తాన్

SI/CONSTABLE/VRO/GROUP.IV
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
http://telanganaexams.com/siconstable-4steps/

TRT జాబ్ కి 50 రోజుల ప్లాన్
SGT /SA (SOCIAL, BIOLOGY, TELUGU ) కి మాక్ టెస్ట్ లు
https://tsexams.com/trt-50days/