Tuesday, September 25
Log In

TEST: 358 – CA – DEC 29

రాష్ట్రీయం
1) దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొనేందుకు మొదటిసారిగా ఏ రాష్ట్ర మంత్రి అవకాశం దక్కింది ?
జ: మంత్రి కేటీఆర్
(నోట్: జనవరి 23-26 వరకూ స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతాయి)
2) బెటర్ ఇండియా ప్రకటించే టాప్ 10 ఐపీఎస్ ల జాబితాలో చోటు దక్కించుకున్న మన రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారి ఎవరు ?
జ: రాచకొండ పోలీస్ కమిషనర్ మురళీధర్ భగవత్
3) రాష్ట్రంలో శాతవాహన యూనవర్సిటీ ఎక్కడ ఉంది ?
జ: కరీంనగర్
4) వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ ను జనవరి 13 నుంచి 15 దాకా ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో
( ఇందులో 10 దేశాల రుచులు పరిచయం చేస్తారు. 25 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి)
5) హైదరాబాద్ లో మోనో రైలు మార్గాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: మియాపూర్ - శిల్పారామం- గచ్చిబౌలి
6) కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏ దేశ సాంకేతికను వాడుతున్నారు ?
జ: జపాన్
7) రాష్ట్రంలో నేవీ ప్రాజెక్టును ఎక్కడ నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది ?
జ: దామగుండం ( వికారాబాద్ జిల్లా )

జాతీయం
8) 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేదిక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎక్కడికి మారింది ?
జ: మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ (ఇంఫాల్)
9) 105 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు జరగనుంది ?
జ: 2018 మార్చి 18 నుంచి 22 వరకూ
10) ఏపీ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ ఆవరణలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (IEA) శతాబ్ది ఉత్సవాల సదస్సును ఎవరు ప్రారంభించారు ?
జ:రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
11) గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆరిజిన్ (గోపియా) ఆధ్వర్యంలో రెండేళ్ళకోసారి జరిగే ప్రవాసీ సమ్మేళన్  ఎక్కడ జరగనుంది ?
జ: బహ్రెయిన్ లో
12) రాహుల్ గాంధీ, మురళీధర్ రావు, కేటీఆర్ పాల్గొంటున్న గోపియా సమ్మేళన్ సదస్సు ఎక్కడ జరగనుంది ?
జ: బహ్రెయిన్ లో
13) హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు ప్రమాణం చేశారు ?
జ: జైరామ్ ఠాకూర్
(నోట్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ : ఆచార్య దేవవ్రత్. సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు)
14) నకిలీ ఖాతాలకు చెక్ పెట్టేందుకు ఆధార్ ను అనుసంధానం చేయాలని నిర్ణయించిన సోషల్ మీడియా దిగ్గజం ఏది ?
జ: ఫేస్ బుక్
15) భారత సాంకేతిక విద్యామండలి ( AICTE) ఛైర్మన్ ఎవరు ?
జ: అనిల్ సహస్ర బుద్దే
16) ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: మాలకొండయ్య
17) ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
జ: అమరావతి
18) ఏపీ రాజధాని అమరావతిలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ఏయే గ్రామాల దగ్గర భూమిని కేటాయించారు
.జ: శాఖమూరు, ఐనవోలు (56.10 ఎకరాల్లో )
19) చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీరేటును కేంద్రం ఎంత మేరకు తగ్గించింది ?
జ: 0.20 శాతం
20) ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు ఎంతగా ఉంది ?
జ: 8.3శాతం
21) తమ సంస్థ పేరుతో నకిలీ ఉత్పత్తులు అమ్మారంటూ ఫ్లిప్ కార్ట్ పై కేసు వేసిన సంస్థ ఏది ?
జ: స్కెచర్స్ సంస్థ
22) మహీంద్రా ఫైనాన్స్ అనుబంధ సంస్థ మహీంద్రా అసెట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ కొత్తగా చేపట్టిన ఫండ్ పథకం పేరేంటి ?
జ: ఉన్నతి ఎమర్జింగ్ బిజినెస్ యోజన
23) విలాసవంతమైన కార్లపై GST సెస్ ను ఎంతశాతం విధించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్ సభ ఆమోదించింది ?
జ: 25 శాతం (గతంలో 15శాతం)
24) ఏ చెట్టుకు చెట్టు హోదా తొలగిస్తూ ప్రవేశపెట్టిన అటవీ చట్టం సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది ?
జ: వెదురు
25) జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో 25మీటర్ల పిస్టల్ షూటింగ్ లో 33 పాయింట్లతో జాతీయ రికార్డును తిరగరాసి, స్వర్ణం దక్కించుకున్నది ఎవరు ?
జ: అనీసా (హరియాణా)

అంతర్జాతీయం
26) అత్యంత వేగంగా దౌడు తీసే జన్యుమార్పిడి రేసు గుర్రాన్ని పుట్టించేందుకు ఏ సంస్థ ప్రయోగాలు చేస్తోంది ?
జ: ఖేరన్ బయోటెక్ ప్రయోగశాల ( అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో )
27) భారత్, చైనాతో సంబంధం లేకుండా ఎవరెస్ట్ శిఖరం ఎత్తును తామే కొలుచుకుంటామని ప్రకటించిన దేశం ఏది ?
జ: నేపాల్

===========================================================

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు ( SGT, SA (సోషల్ ) వివరాలకు క్లిక్ చేయండి:

http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు తెలుగు పండిట్, బయాలజీ వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/trt-telugu-pandit-biology-mock-tests/

AEE/ CDPO/EXTN. OFFICERS మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/aeecdpo-mock-tests/