Tuesday, September 25
Log In

TEST: 356,357 – CA- DEC 26,27

రాష్ట్రీయం
1) ఓటు కోసం నోట్లు ఇస్తే ఎంత కాలం జైలు శిక్ష విధించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని రూపొందించింది ?
జ: ఏడాది జైలు

జాతీయం
2) ఏయే స్టేషన్ల మధ్య నిర్మించిన 12 కిమీల మెట్రో రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ?
జ: నొయిడా - ఢిల్లీ
3) ఢిల్లీ పరిధిలో మొత్తం ఎన్ని కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు మార్గం ఉంది ?
జ: 226కిమీ
4) ఏపీ రాజధాని అమరావతిలో టాలీవుడ్ పరిశ్రమ ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 5167 ఎకరాలను ఎక్కడ కేటాయించనుంది ?
జ: అనంతవరం
5) ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన 4జీ సర్వీసులను జనవరి 2018 లో ఏ రాష్ట్రంలో ప్రారంభించనుంది ?
జ: కేరళలో
6) భారత ఆర్థిక సంఘం (IEA) వందో సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: అమరావతి (రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభిస్తారు )
7) అరుణాచల్ ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కప్ప జాతికి ఏమని పేరు పెట్టారు ?
జ: ఒడొరానా అరుణాచలెన్సిస్
8) అంటార్కిటికాలోని ఏ శిఖరాన్ని అధిరోహించడం ద్వారా భారత వైమానిక దళం సప్త మహా పర్వతాలను అధిరోహించింది ?
జ:విన్సన్ శిఖరం
9) మనదేశం వచ్చే ఏడాదే ప్రపంచంలోని అయిదు ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానం పొందుతుందని చెప్పిన సంస్థ ఏది ?
జ: సెంటర్ ఫర్ ఎకనామిక్స్అండ్ బిజినెస్ రీసెర్చ్ ( CEBR)
10) తయారీ రంగ పరిశ్రమకి అవసరమైన అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కలిగిన శ్రీసిటీకి (ఏపీ) ఏ అవార్డు లభించింది ?
జ: బ్రాండ్ ఆఫ్ ఆసియా అవార్డు
11) వినూత్న ఆవిష్కరణలు, విప్లవాత్మక పరిశోధనల కోసం గూగుల్ ఎక్స్ కేంద్రాన్ని అమెరికా వెలుపల తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: విశాఖపట్నం (ఏపీ)
12) భారత్ లో తయారీ విమానాలను ఇకపై పౌరసేవలకు ఉపయోగించనున్నారు.  ఈ విమానాలను ఏ సంస్థ తయారు చేస్తోంది ?
జ: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
13) ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవి శంకర్ జీవితచరిత్రపై ఆయన సోదరి భానుమతి నర్సింహన్ రాసిన పుస్తకం పేరేంటి ?
జ: గురుదేవ్ - ఆన్ ద ప్లాటూ ఆఫ్ ద పీక్
14) ఈ ఏడాది గోల్డెన్ ట్వీట్ గా ఏది నిలిచింది ?
జ: కోహ్లీ, అనుష్మా శర్మపెళ్ళి ప్రకటన

అంతర్జాతీయం
15)ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో పేద దేశాల్లో ఎంతమందికే ఇంటర్నెట్ అనుసంధానత ఉన్నట్టు యునిసెఫ్ ప్రకటించింది ?
జ: 15శాతం మందికే
16) కృత్రిమ మేథస్సును ఉపయోగించి ఏ సామాజిక మాధ్యమం ద్వారా వరద ముప్పు హెచ్చరికలు జారీ చేయొచ్చని లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు ?
జ: ట్విటర్

===========================================================

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు ( SGT, SA (సోషల్ ) వివరాలకు క్లిక్ చేయండి:

http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు తెలుగు పండిట్, బయాలజీ వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/trt-telugu-pandit-biology-mock-tests/

AEE/ CDPO/EXTN. OFFICERS మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/aeecdpo-mock-tests/