Tuesday, September 25
Log In

TEST 355 – CA- DEC 25

రాష్ట్రీయం
1) తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ఓరుగల్ల నృత్యోత్సవంలో ఎంతమంది కళాకారులు 38 భక్తరామదాసు కీర్తనల మీద నృత్యాలను ప్రదర్శించారు ?
జ: 500 మంది కళాకారులు
2) అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ఎవరి పేరుతో ప్రత్యేక తపాలా కవర్ ను తపాలా శాఖ విడుదల చేసింది ?
జ: నేరెళ్ళ వేణుమాధవ్ ( 70యేళ్ళుగా మిమిక్రీ చేస్తున్నారు )
3) ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ఇచ్చేందుకు పైలట్ ప్రాజెక్టుగా ముందుగా ఎక్కడ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: మహేశ్వరం మండలంలో 4 గ్రామాలకు
(నోట్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మహేశ్వరం, మన్సాన్ పల్లి, తుమ్మలూరు, సిరగిరిపురంలలో)

జాతీయం
4) వచ్చే నెలలో దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం ( WEF) వార్షిక సదస్సుకు భారత్ తరపున ఎవరు హాజరవుతున్నారు ?
జ: ప్రధాని నరేంద్రమోడీ
5) 1997లో ఏ ప్రధాని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరంకు హాజరైన  తర్వాత ఇప్పుడు నరేంద్రమోడీ పాల్గొంటున్నారు ?
జ: అప్పటి ప్రధాని హెచ్.డి.దేవెగౌడ
6) హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: జైరాం ఠాకూర్
7) తమిళనాడు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయం సాధించారు.  ఆయన ఏ పార్టీ నుంచి గెలిచారు ?
జ: స్వతంత్ర్య అభ్యర్థి
8) రైతులు తమ ఉత్పత్తులను సరైన ధరకు అమ్ముకునేందుకు దేశంలో వెయ్యి మార్కెట్లను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఒక్కో మండీకి ఎంత సాయం చేయనుంది ?
జ: రూ.50 కోట్లు ( గతంలో రూ.30 కోట్లు ఉండేది)
9) 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు కాంటాక్ట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది.  అందుకోసం తయారు చేసిన ముసాయిదా బిల్లు పేరేంటి ?
జ: అగ్రికల్చర్ ప్రొడ్యూస్, లైవ్ స్టాక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ (ప్రమోషన్, ఫెసిలిటేషన్ యాక్ట్ 2018)
10) విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు మన దేశంలో ఓట్లేయడం కోసం ఏ తరహా ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ఇటీవల ప్రజాప్రాతినిధ్య చట్ట(సవరణ) 2017 బిల్లును న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ప్రవేశపెట్టారు
జ: ఫ్రాక్సీ ఓటింగ్ ( NRI కి బదులు ఇక్కడ మరొకరు వేసేందుకు అనుమతి )
11) 2012 మే నెల వరకూ ప్రవాస భారతీయులు ఎంతమంది ఓటర్లుగా CEC దగ్గర నమోదు చేసుకున్నారు ?
జ: కోటి 37 వేల 761 మంది
12) దురంతో, శతాబ్ది, రాజధాని లాంటి రైళ్ళల్లో TTE ( ట్రైన్ టికెట్ ఎగ్జామినర్స్ )కు కొత్త యూనిఫామ్స్ ఇవ్వబోతున్నారు.  అవి ఏ రంగులో ఉంటాయి ?
జ: బూడిద రంగు (గ్రే) సూటు, తెల్లని షర్టు, ఎర్రటి టై
13) భారతీయ రైళ్ళల్లో లగ్జరీ కోచ్ గా పేరున్న అనుభూతి బోగీని శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.  ఈ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఏయే స్టేషన్ల మధ్య తిరుగుతుంది ?
జ: సికింద్రాబాద్ - పుణే
14) ఏపీ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి 60 యేళ్ళు నిండాయి. ఈ ప్రాజెక్టుకు ఎవరు శంకుస్థాపన చేశారు ?
జ: 1957 డిసెంబర్ 24న అప్పటి సీఎం టంగుటూరు ప్రకాశం పంతులు
15) ఈ ఏడాదిలో అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా 37 విజయాలు సాధించి, ఒక ఏడాదిలో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా నిలిచింది.  మొదటి స్థానం ఏ దేశ క్రికెట్ జట్టు పేరుతో ఉంది ?
జ: 2003లో ఆస్ట్రేలియా 38 విజయాలు (మొదటి స్థానం)

అంతర్జాతీయం
16) రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు ఎవరు ప్రత్యర్థిగా నిలబడుతున్నారు ?
జ: అలెక్సెయ్ నావల్నీ ( స్వతంత్ర అభ్యర్థి )
17) 125 కోట్ల యేళ్ళ క్రితమే భూమిపై కిరణ జన్య సంయోగ క్రియ మొదలైందని  ఏ శైవల శిలాజంపై జరిపిన పరిశోధనలతో కనుగొన్నారు ?
జ: బంగియో మార్ఫా ప్యుబెసెన్స్ ( 1990లో ఆర్కిటిక్ కెనాడాలోని కొండల్లో దీన్ని గుర్తించారు )
18) కొత్తగా కనుగొన్న ఓ సాలీడు జాతికి శాస్త్రవేత్తలు ఎవరి పేరు పెట్టారు ?
జ: జమైకా  సింగర్ బాబే మార్లే
(నోట్: 2009లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ తీరంలో ఈ సాలీళ్ళు బయటపడ్డాయి )
19) ప్రపంచంలోనే అతి పెద్ద ఉభయచర విమానాం మొదటిసారిగా గాల్లోకి ఎగిరింది.  కున్లంగ్ ( AG600) గా పిలిచే ఈ విమానాన్ని ఏ దేశం తయారు చేసింది ?
జ: చైనా

===========================================================

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు ( SGT, SA (సోషల్ ) వివరాలకు క్లిక్ చేయండి:

http://tsexams.com/trt-telugu-pandit-biology-mock-tests/

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు తెలుగు పండిట్, బయాలజీ వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/

AEE/ CDPO/EXTN. OFFICERS మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/aeecdpo-mock-tests/