Tuesday, September 25
Log In

TEST: 354 – CURRENT AFFAIRS – DEC 24

రాష్ట్రీయం
1) జనవరి 31 నుంచి ఫిబ్రవరి మూడో తేది దాకా జరిగే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ?
జ: రూ.80 కోట్లు
2) సమ్మక సారలమ్మ జాతర జరిగే మేడారం ఏ జిల్లాలో ఉంది ?
జ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా
3) ఆముదం, పొద్దు తిరుగుడు నూనె గింజల పంటలపై పరిశోధనలకు జాతీయ ప్రాజెక్టు కింద భారత వ్యవసాయ పరిశోధన మండలి నిధులు మంజూరు చేసింది. మన రాష్ట్రంలో ఎక్కడ ఈ పరిశోధనలు చేస్తారు ?
జ: సిద్దిపేట జిల్లా తోర్నాలలో
4) ఆంధ్రా బ్యాంక్ కొత్త ఎండీ, CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: కె.వి.బ్రహ్మాజీ రావు


జాతీయం
5) 21యేళ్ల నాటి దాణా కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ ను CBI కోర్టు దోషింగా నిర్ధారించింది.  అయితే దేవ్ గఢ్ ఖజానా నుంచి ఎంత విత్ డ్రా కేసులో ఈ తీర్పు వెల్లడైంది
జ: రూ.89.27 లక్షలు
6) గోదావరి ఉపనది ఇంద్రావతిపై ఎక్కడ ప్రాజెక్టు కట్టేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ?
జ: మిడిల్ కొలాబ్ ప్రాజెక్టు
7) ఇటీవల 40వ వార్షిక వేడుకలు జరుపుకున్న పారిశ్రామిక సంస్థ ఏది ?
జ: రిలయన్స్
8) 2జీ స్పెక్ట్రమ్ కేసులో నిర్దోషిగా తేలడంతో ఏ సంస్థ కేంద్ర ప్రభుత్వంపై రూ.10వేల కోట్లకు దావా వేయాలని నిర్ణయించింది ?
జ: వీడియోకాన్ టెలీ
9) పెద్ద నగరాలతో చిన్న నగరాలను అనుసంధానించే దేశంలో మొట్టమొదటి చౌక విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ ఎక్కడ నుంచి ఎక్కడికి తొలి విమానాన్ని నడిపింది ?
జ: ముంబై నుంచి జల్ గావ్ కు
10) కేంద్ర కార్మిక రాజ్య బీమా సంస్థను ఏ విధంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది ?
జ:  సహకార సంఘం (సొసైటీ)
11) అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించిన బీసీ కమిషన్ ఛైర్మన్ ఎవరు ?
జ: జస్టిస్ మంజునాథ్
12) దక్షిణాదిన ప్రవహించే నదుల్లో అత్యధిక స్థాయిలో రసాయనాలు ఏ నదిలో ఉన్నాయని అన్నా విశ్వ విద్యాలయం తేల్చింది
జ: కావేరీ నదిలో
13) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ జనరల్ మేనేజర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సబా కరీం

అంతర్జాతీయం
14) ముంబై ఉగ్రవాద దాడవు సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేయబోయే పార్టీకి అనుమతి ఇవ్వొద్దని పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టును కోరింది. సయీద్ పార్టీ పేరేంటి ?
జ: మిల్లి ముస్లిమ్ లీగ్
15) ఎక్కడ జరిగే కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్ ను ఎత్తివేయాలని నిర్ణయించారు ?
జ: బర్మింగ్ హామ్

===========================================================

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు ( SGT, SA (సోషల్ ) వివరాలకు క్లిక్ చేయండి:

http://tsexams.com/trt-telugu-pandit-biology-mock-tests/

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు తెలుగు పండిట్, బయాలజీ వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/

AEE/ CDPO మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/aeecdpo-mock-tests/