Tuesday, September 25
Log In

TEST: 352, 353 -CA- DEC 22 & 23

రాష్ట్రీయం
1) ప్రముఖ రచయిత దేవి ప్రియ రాసిన ఏ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ?
జ: గాలి రంగు
2) అనువాదం తెలుగు విభాగంలో ఎవరు రచించిన విరామమెరుగని పయనం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది ?
జ: వెన్న వల్లభరావు
3) రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులు మంజారు చేసింది ?
జ: కాళేశ్వరం
4) రాష్ట్రంలో ఏ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు  కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ?
జ: తాటి, ఈత ఉత్పత్తుల పరిశోధనా కేంద్రం (ఆలిండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ )
5) రాష్ట్రంలో తాటి, ఈత ఉత్పత్తుల పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో 150 ఎకరాల్లో


6) ప్రయాణీకులకు వజ్ర బస్సులు అందుబాటులోకి తీసుకురావడం, అర్హత కలిగిన ఉద్యోగుల పిల్లలకు జాబ్స్ కల్పించినందుకు TSRTC కి ఏ అవార్డులు దక్కాయి ?
జ: స్కోచ్ అవార్డులు
7) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: బీపీ ఆచార్య
8) రాష్ట్రంలో మలక్ పేటలో ఎన్ని రకాల ఈత జాతికి చెందిన 250 చెట్లతో ఓ పార్క్ ను GHMC సిద్ధం చేసింది.
జ: 120 రకాలు
9) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని మండలాల్లో వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర, అభివృద్ధి ప్రణాళిక మండలి నిర్ణయించింది ?
జ: 125 మండలాల్లో
10) జీవనోపాధి కల్పన, మౌళిక వసతి సదుపాయాలను కల్పించిన దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ ఏది?
జ: తెల్లాపూర్ ( సంగారెడ్డి జిల్లా )

జాతీయం
11) రాజ్యసభలో తొలిసారిగా ఏ అంశంపై మాట్లాడటానికి మాజీ క్రికెటర్, ఎంపీ సచిన్ టెండూల్కర్ కి అవకాశం వచ్చింది ?
జ: క్రీడాహక్కు, దేశంలో క్రీడల భవిష్యత్తుపై
12) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( కృత్రిమ మేధ) తో 2035 కల్లా భారత ఆర్థిక వ్యవస్థకు 62 లక్షల కోట్లు జతకూడతాయని ఏ సంస్థ ప్రకటించింది ?
జ: యాక్సెంచర్ (అమెరికాకి చెందిన సాంకేతిక దిగ్గజం)
13) దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 27 వేల కోట్లతో ఎన్ని విమానాశ్రయాలు నిర్మిస్తున్నట్టు పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు?
జ: 19 విమానాశ్రయాలు
14) గోదావరి - కావేరీ జలాలను అనుసంధానించేందుకు జనవరిలో నాలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఏయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొంటారు ?
జ: ఛత్తీస్ గడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
15) 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో డీఎంకే నేతలు రాజా, కనిమొళిని నిర్దోషులుగా ప్రకటించింది సీబీఐ కోర్టు. అయితే ఈ స్కామ్ పై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఎప్పుడు విచారణకు ఆదేశించింది ?
జ: 2009 మే
16) స్పెక్ట్రమ్ ధరను 2008 నాటి ధరల ఆధారంగా కాకుండా... 2001 ధరల ప్రాతిపదికన టెలికం శాఖ కేటాయించింది. 8 కంపెనీలకు ఎన్ని స్పెక్ట్రమ్ లైసెన్సులను టెలికాం శాఖ జారీ చేసింది ?
జ: 122
17) 2జీ స్పెక్ట్రమ్ కేసులో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లిందని అప్పట్లో (2010 నవంబర్ 16న) నివేదిక ఇచ్చిన కాగ్ ఎవరు ?
జ: వినోద్ రాయ్
18) మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ ప్రకటించారు. అయితే నెలకు ఎన్ని బైట్ల డేటాను మన దేశంలో ఉపయోగిస్తున్నారు ?
జ: 150 గిగా బైట్లు
19) బ్లాక్ మనీని నియంత్రించేందుకు ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: స్విట్జర్లాండ్
20) ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, CEO పదవికి ఎవరు రాజీనామా చేశారు?
జ: శశి అరోరా


21) ఉడాన్ ( ప్రాంతాయ అనుసంధానిత పథకం) కింద విమాన సర్వీసులను నడిపేందుకు ఏ సంస్థకు DGCA అనుమతులు లభించాయి ?
జ: ఎయిర్ డెక్కన్
22) మాతృమూర్తులకు ఆర్థిక ప్రయోజనం కలిగించే పథకానికి కేంద్ర ప్రభుత్వం ఏమని పేరు పెట్టింది ?
జ: మాతృ వందన పథకం
(నోట్: ఈ పథకం కింద మహిళ మొదటి కాన్పు సమయంలో 3 దఫాలుగా రూ.5 వేలు చొప్పున, జనని సురక్షిత పథకం కింద మరో వెయ్యి రూపాయలు ఇస్తారు )
23) UGC ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ధీరేంద్ర పాల్
24) గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు ?
జ: విజయ్ రూపానీ (ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ )
25) తమిళనాడులో ఇటీవల ఉపఎన్నిక జరిగిన నియోజవర్గం ( గతంలో జయలలిత పోటీ చేసిన సీటు ) ఏది ?
జ: ఆర్కేనగర్ ( రాధా క్రిష్ణ నగర్ )
26) గుర్జర్లు (గుజ్జర్లు) సహా 5 కులాలకు ఒక శాతం రిజర్వేషన్ ను ఏ రాష్ట్రంలో కల్పించారు ?
జ: రాజస్థాన్ లో
27) 2017 ఐసీసీ ఎంపిక చేసిన ఉత్తమ మహిళ క్రికెట్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్న భారతీయ క్రికెటర్లు ఎవరు ?
జ: మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, ఏక్తా బిష్థ్
28) ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత్ లో అత్యధికంగా ఆర్జించిన  ప్రముఖుల్లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు ?
జ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (2017 లో రూ.232 కోట్లు )
(నోట్: రెండో స్థానంలో షారుఖ్ ఖాన్ - రూ.170 కోట్లు, 3వ స్థానంలో విరాట్ కోహ్లీ రూ.100కోట్లు )
29) టీ20ల్లో అత్యంత వేగంగా 35 బంతుల్లో సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ ఎవరి రికార్డును సమం చేశాడు ?
జ: దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ (2017లో బంగ్లాదేశ్ పై ఉన్న రికార్డును )
30) భారత్, దక్షిణాఫ్రికా మధ్య జనవరిలో జరిగే క్రికెట్ సిరీస్ కు ఏమని పేరు పెట్టారు?
జ: ఫ్రీడమ్ సిరీస్
31) ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (PBL)  పోటీలు ఎక్కడ ప్రారంభం అయ్యాయి ?
జ: గువాహటి
అంతర్జాతీయం
32) జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ తిరస్కరించింది ?
జ: ఐరాసలోని సర్వప్రతినిధి సభ
33) నేపాల్ కొత్త ప్రధాని ఎవరు ఎన్నికయ్యారు ?
జ: కె.పి.శర్మ ఓలి
34) నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్ ఎవరు ?
జ: ప్రచండ
35) 2022 కామన్వెల్త్ క్రీడల వేదికను దక్షిణాఫ్రియాలోని డర్బన్ నుంచి ఎక్కడికి మార్చారు ?
జ: ఇంగ్లాండులోని బర్మింగ్ హామ్

===========================================================

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు ( SGT, SA (సోషల్ ) వివరాలకు క్లిక్ చేయండి:

http://tsexams.com/trt-telugu-pandit-biology-mock-tests/

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు తెలుగు పండిట్, బయాలజీ వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/

AEE/ CDPO మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/aeecdpo-mock-tests/