Tuesday, September 25
Log In

TEST 351 – CURRENT AFFAIRS- DEC 21

రాష్ట్రీయం
1) రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు బిజినెస్ వరల్డ్ సంస్థ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఢిల్లీలో అందించింది.  ఈ అవార్డును ప్రదానం చేసింది ఎవరు ?
జ: కేంద్రపట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్
2) రాష్ట్రంలో పదకొండో వేతన సవరణ సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ?
జ: 2018 జులై నుంచి
3) నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలను ఏ నదికి తరలించాలని కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది ?
జ: కావేరీ ( 247 టీఎంసీల తరలింపుకు ప్రతిపాదన)
4) జనవరి 3 నుంచి 7 వరకూ జరిగే 105 వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ కు ఎవరు ముఖ్య అతిథిగా హాజరవుతారు ?
జ: ప్రధాని నరేంద్రమోడీ
5) జనవరి 7 నుంచి 12 వరకూ సౌతిండియా సైన్స్ ఫెయిర్ 2018 ను ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: సికింద్రాబాద్ లోని సెయింట్ ఫ్యాట్రిక్ స్కూల్ లో


6) రాష్ట్రంలోని ఎన్ని ఉన్నత పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది ?
జ: 3,500 హైస్కూల్స్ కి
7) ఏ కులాల వారి లెక్క తేల్చేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: బీసీ కులాలు
8) బులేనా (వ్యంగ్య వ్యాఖ్యలు) పుస్తకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత ఎవరు ?
జ: పొత్తూరి వెంకటేశ్వరరావు
9) నానో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ చర్మం తయారు చేసినందుకు యంగ్ ఇంజనీర్ 2017 ను ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థ ఎవరికి పురస్కారం ప్రకటించింది ?
జ: డాక్టర్ సుష్మీ బదులికా ( IIT హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్)

జాతీయం
10) దేశంలోనే తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది.  దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: గుజరాత్ లోని వడొదరలో
(నోట్: నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోర్ట్ యూనివర్సిటీ పేరుతో దీన్ని నెలకొల్పుతారు )
11) దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు అందిస్తున్నఫించన్ ను ఎంతకు పెంచాలని కేంద్రం భావిస్తోంది ?
జ: రూ.1600లు
12) జాతీయ హరిత ట్రిబ్యునల్ తాత్కాలిక సారధిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: జస్టిస్ ఉమేష్ దత్తాత్రేయ సాల్వీ
( ఇప్పటిదాకా ఈ పదవిలో ఉన్న జస్టిస్ స్వతంత్ర కుమార్ రిటైర్డ్ అయ్యారు )
13) ఢిల్లీలో కాలుష్య మబ్బులను చెదరగొట్టేందుకు ఏ పరికరాన్ని ఉపయోగించారు ?
జ: యాంటీ స్మోగ్ గన్
14) అంతర్జాతీయ కాల్స్ పై ఫిర్యాదులు చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ఉచిత కాల్ సెంటర్ నెంబర్ ఎంత ?
జ: 1963 లేదా 1800110420
15) దేశంలో బిట్ కాయిన్ నియంత్రణ కోసం సెబీ ప్రత్యేకంగా ఓ కమిటీని వేసింది.  ప్రస్తుతం సెబీ ఛైర్మన్ ఎవరు ?
జ: అజయ్ త్యాగి
16) క్రిప్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెట్టి కుబేరుడైన బాలీవుడ్ స్టార్ ఎవరు ?
జ: అమితాబ్ బచ్చన్ కుటుంబం
17) దేశీవాళీ అండర్ 23 టోర్నీ సీకే నాయుడు ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది ?
జ: ఢిల్లీ జట్టు

అంతర్జాతీయం
18) యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్  ప్రక్రియకు ఎప్పటి వరకూ గడువు విధించారు ?
జ: 2020 డిసెంబర్ 31

 

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు ( SGT, SA (సోషల్ ) వివరాలకు క్లిక్ చేయండి:

http://tsexams.com/trt-telugu-pandit-biology-mock-tests/

TRT మాక్ టెస్టులు రాయాలనుకునేవారు తెలుగు పండిట్, బయాలజీ వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/

AEE/ CDPO మాక్ టెస్టులు రాయాలనుకునేవారు వివరాలకు క్లిక్ చేయండి :

http://tsexams.com/aeecdpo-mock-tests/