Tuesday, September 25
Log In

TEST 330 – CA NOV 29

రాష్ట్రీయం
1) హైదరాబాద్ మెట్రో రైలును ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
2) మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ రూపొందించిన కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ కార్యక్రమం పేరేంటి ?
జ: సహేలీ
(నోట్: మహిళలు తయారు చేసిన హ్యాండీ క్రాఫ్ట్స్, దుస్తులు, హ్యాండ్ బ్యాగ్స్, గృహాలంకరణ వస్తువులు అమ్ముకోడానికి సహేలీ ఆన్ లైన్ స్టోర్ పనిచేస్తుంది )
3) ఏరోస్పేస్ రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం టీ-హబ్ తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఏది ?
జ: బోయింగ్
(నోట్: హారిజోన్ -ఎక్స్ ఇండియా ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరుతో కార్యక్రమం)
4) ఇటీవల మరణించిన జర్నలిస్ట్ గౌరీ లకేశ్ రచనల సంకలనాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ తెలుగులో ఆవిష్కరించారు. ఆ పుస్తకం పేరేంటి ?
జ: కొలిమి రవ్వలు
5) ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ లో రజిత పతకం సాధించిన తెలుగమ్మాయి ఎవరు ?
జ: వెన్నెం జ్యోతి
6) ఆసియా ఆర్చరీ టోర్నీలో మిక్స్ డ్ విభాగంలో రన్నరప్ గా ఎవరు నిలిచారు ?
జ: వెన్నెం జ్యోతి, అభిషేక్ వర్మ

జాతీయం
7) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును హైదరాబాద్ లోని HICC లో ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి అడ్వైజర్ ఇవాంకా ట్రంప్
8) మోడీ, ఇవాంక GES ను ప్రారంభించేందుకు ఓ రోబో మీద బటన్ నొక్కారు. ఆ రోబో పేరేంటి ?
జ: మిత్ర -1
(నోట్: మేకిన్ ఇండియాలో భాగంగా బెంగళూరుకి చెందిన ఇన్వెంటో టెక్నాలజీ ఈ రోబోని తయారు చేసింది )
9) స్వతంత్ర పాలస్తీనాకు మద్దతిస్తూ... ఇజ్రాయెల్ తో చర్చలు పున: ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తూ ప్రదాని మోడీ ఎవరికి లేఖ రాశారు ?
జ: ఐక్యరాజ్య సమితికి ( US International Day of Solidarity with Palistina people సందర్బంగా)
10) పేటీఎం పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలను ఢిల్లీలో అధికారికంగా ప్రారంభించినది ఎవరు ?
జ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ
11) ఎయిరిండియా కొత్త సీఎండీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: ప్రదీప్ సింగ్ ఖరోలా
12) లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎవరు నియమితులయ్యారు ?
జ: స్నేహలతా శ్రీవాస్తవ
(నోట్: ఈ పదవి చేపడుతున్న మొదటి మహిళ. డిసెంబర్ 1న బాధ్యతలు చేపడతారు )
13) కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఉపేంద్ర ప్రసాద్ సింగ్
14) భారత్ లో 2030 నాటికి ఎంతశాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తారని అమరికాకి చెందిన బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ స్టడీలో తేలింది ?
జ: 40శాతం మంది
15) ఏ ఏడాది వరకూ చైనాను వెనక్కి నెట్టి భారత్ అతి పెద్ద మార్కెట్ గా అవతరిస్తుందని బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ తెలిపింది ?
జ: 2027 నాటికి
16) మాస్టర్స్ ఇన్ మేనేజ్ మెంట్ కోర్సులను అందిస్తోన్న అత్యుత్తమ 50 యూనివర్సిటీల్లో మనదేశానికి చెందిని ఎన్ని సంస్థలకు చోటు దక్కింది. బ్రిటన్ కు చెందిన క్యూఎస్ విశ్వవిద్యాలయం ఈ ర్యాంకింగ్స్ ప్రకటించింది ?
జ: బెంగళూరు, అహ్మదాబాద్, కోల్ కతా IIM లు

NOTE: TRT అభ్యర్థులకు డిసెంబర్ 4 నుంచి ప్రిపరేషన్ మెటీరియల్, మాక్ టెస్టులు మొదలవుతాయి.   పూర్తి వివరాలకు : http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/