Tuesday, September 25
Log In

TEST : 329 – CA NOV 28

రాష్ట్రీయం
1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ?
జ: 2010 వాషింగ్టన్ లో
(నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి)
2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ?
జ: ఎనిమిది
3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ?
జ: నీతి ఆయోగ్
4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ?
జ: 52.5 శాతం
5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ?
జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్
(నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు )


6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ?
జ: కెన్నెత్ ఇ. జస్టర్
7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ?
జ: అమితాబ్ కాంత్
8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ?
జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు
9) గ్రేటర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత ?
జ: రూ.16,830 కోట్లు
10) హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మిస్తున్న సంస్థ ఏది ?
జ:  L & T
(నోట్: ప్రపంచంలోనే పబ్లిక్ - ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిస్తున్న అతి పెద్ద మెట్రో ప్రాజెక్ట్ ఇదే)
11) మెట్రో రైలు ప్రాజెక్టును మొదట ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2007 మే 14న
12) జాతీయ స్థాయిలో ఉత్తమ అవయవదాన అవార్డు అందుకున్న రాష్ట్రానికి చెందిన హాస్పిటల్ ఏది ?
జ: యశోదా హాస్పిటల్

జాతీయం
13) 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ గా ఎవరు నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు ?
జ: ఎన్ కే సింగ్
(నోట్: ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు )
14) 15వ ఆర్థిక సంఘం ఎప్పటి వరకూ కేంద్రానికి నివేదిక అందిస్తుంది ?
జ: 2019 అక్టోబర్
15) ఉగ్రవాదంపై పోరులో సహకరించుకోవాలని భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: రష్యాతో
(నోట్: 1993లో ఈ రెండు దేశాలమధ్య కుదిరిన ఒప్పందం స్థానంలో కొత్తది అమల్లోకి వస్తుంది )
16) లవ్ జిహాద్ కేసుగా పరిగణించి ఎవరు చేసుకున్న వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది?
జ: హదియా
17) పంచాయతీయ రాజ్ సంస్థల్లో గెలిచిన మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు ?
జ: మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ
18) సూర్యుడిపై ప్రయోగాలకు భారత్ మొదటిసారి 2019లో పంపుతున్న శాటిలైట్ మిషన్ ఏది  ?
జ: ఆదిత్య L1 మిషన్
19) ఆదిచుంచనగిరి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కర్ణాటక
20) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కు డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సౌమ్యా స్వామినాథన్
21) మూడోసారి ప్రపంచ స్నూకర్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు ?
జ: భారత్ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ పంకజ్ అద్వానీ
22) 2017 IITF ఛాలెంజ్ స్పానిష్ ఓపెన్ సింగిల్స్ లో బంగారు పతకం గెలుచుకున్న సాతియాన్ జ్ఞానశేఖరన్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
జ: తమిళనాడు
23) ఆసియాన్ మారథాన్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు గోపీ తొనకాల్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
జ: కేరళ

అంతర్జాతీయం
24) విశ్వసుందరి 2017 కిరీటం దక్కించుకున్నది ఎవరు ?
జ: డెమీలే -నెల్ పీటర్స్ (దక్షిణాఫ్రికా)
25) భారత్ నుంచి విశ్వసుందరి కిరీటానికి పోటీ పడిన యువతి ఎవరు ?
జ: శ్రద్ధా శశిధర్
26) ఇండోనేషియాలోని బాలీలో ఏ అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా, దుమ్మూ ఎగసిపడుతున్నాయి ?
జ: అగుంగ్
27) బంగ్లాదేశ్ తిరుగుబాటు కేసులో 139మందికి విధించిన మరణశిక్ష, 146 మంది సైనికులకు పడిన యావజ్జీవ శిక్షలను బంగ్లాదేశ్ హైకోర్టు ఖరు చేసింది.  ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ?
జ: 2009 ఫిబ్రవరిలో

NOTE: TRT అభ్యర్థులకు డిసెంబర్ 4 నుంచి ప్రిపరేషన్ మెటీరియల్, మాక్ టెస్టులు మొదలవుతాయి.   పూర్తి వివరాలకు : http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/