Tuesday, September 25
Log In

TEST 327 & 328- CA NOV 26&27

రాష్ట్రీయం
1) రోడ్ టు GES బస్సు యాత్ర నిన్న హైదరాబాద్ కు చేరుకుంది. దీన్ని నీతి ఆయోగ్ తో కలసి ఎవరు నిర్వహించారు ?
జ: యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్
2) అవయవదానంలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన రాష్ట్రం ఏది ?
జ: తెలంగాణ
(నోట్: నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ఈ అవార్డును ప్రకటించింది. 2,3 స్థానాల్లో తమిళనాడు, కేరళ నిలిచాయి )
3) స్టార్టప్ సంస్థలకు టెక్నాలజీపరమైన సహకారం అందించేందుకు టీ-హబ్ ఏ సాఫ్ట్ వేర్ దిగ్గజంతో ఒప్పందం చేసుకుంది ?
జ: మైక్రో సాఫ్ట్
4) కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న 3 వేల ఏళ్ళ నాటి ఆదిమ మానవుల ఖగోళ పరిశోధనశాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. గండశిలలుగా పిలిచే ఈ నిలువురాళ్ళు ఏ గ్రామ శివార్లలో ఉన్నాయి ?
జ: ముదుమూల్
5) రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏది ?
జ: తాడిచెర్ల ( జయంశంకర్ భూపాలపల్లి జిల్లా)

జాతీయం
6) ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ?
జ: నీతి ఆయోగ్, లా కమిషన్
7) అనుమతి లేకుండా దేశంలో విక్రయిస్తున్న ఏ విత్తనం అమ్మకాలను అన్ని రాష్ట్రాల్లో నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ?
జ: బీజీ-3 పత్తి విత్తనం
8) 12యేళ్ళ లోపు మైనర్లను రేప్ చేస్తే మరణశిక్ష విధించేలా చట్టంలో మార్పులు తేవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: మధ్యప్రదేశ్ ప్రభుత్వం
9) రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు ?
జ: నవంబర్ 26
10) EPF పై వడ్డీ రేటును తగ్గించాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ రేటు ఎంత ?
జ: 8.65శాతం
11) నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NFDC) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: ముంబై
12) చందోలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: మహారాష్ట్ర
13) 12వ అంతరాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ?
జ: హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్
14) 2018 జనవరిలో డాక్యుమెంటరీ, షార్ట్ అండ్ యానిమేషన్ ఫిల్మ్స్ లపై ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరగనుంది ?
జ: ముంబై
15) 2017 ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నది ఎవరు ?
జ: రాజ్ కుమార్ రావు ( న్యూటన్ మూవీకి )
16) దూరదర్శన్ కు డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఇరా జోషి
17) పరాబ్ 2017 వార్షిక సాంస్కృతిక ఉత్సవం ఎక్కడ జరుగుతుంది ?
జ: ఒడిషా
18) అంతర్జాతీయ గీతా మహోత్సవ్ - 2017 జరుగుతున్న కురుక్షేత్ర ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: హర్యానా
19) ఏ దేశంలో డిజిటల్ లాకర్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి భారత్ అంగీకరించింది ?
జ: మారిషస్
20) స్టాండర్డ్ అండ్ పూర్ సంస్థ ఇటీలవల భారత్ కు ఏ రేటింగ్ ఇచ్చింది ?
జ: Stable
21) రిపుల్ నెట్ పేరుతో ఇన్ స్టంట్ ఇంటర్నేషనల్ పేమెంట్ సర్వీస్ ఇచ్చిన ప్రైవేటు సెక్టార్ బ్యాంకు ఏది ?
జ: యాక్సిస్ బ్యాంక్
22) ఆసియా కబడ్డీ పురుషుల, మహిళల ఛాంపియన్షిప్ లో విజేతలుగా నిలిచిన దేశం ఏది ?
జ: భారత్
23) ఐదు స్వర్ణాలతో పాటు రెండు కాంస్య పతకాలతో ప్రపంచ యూత్ మహిళల బాక్సింగ్ లో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచిన దేశం ఏది ?
జ: భారత్
24) హాంకాంగ్ ఓపెన్ లో సింధు ఏ స్థానంలో నిలచింది ?
జ: రన్నరప్ గా
(నోట్: ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓడిపోయింది )
25) పోలండ్ లో జరిగిన సీనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ - 2017 అండర్ 23లో ఎన్ని కేజీల విభాగంలో రీతూ ఫగోట్ సిల్వర్ గెలుచుకుంది ?
జ: 48 కేజీలు
26) ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానానికి గేట్ నెంబర్ 1, 2,3 లకు ఏమని పేర్లు పెట్టారు ?
జ: వీరేంద్ర సెహ్వాగ్, అర్జుమ్ చోప్రా

అంతర్జాతీయం
27) ప్రపంచంలోనే కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ) తో పనిచేసే వర్చువల్ రాజకీయ నేత శామ్ ను ఎవరు రూపొందించారు ?
జ: న్యూజిలాండ్ కు చెందిన ఎంట్రప్రెన్యూర్ నిమ్ గెర్రిట్ సెన్
28) ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ ( IGC-2020) కి వేదిక అవుతున్న దేశం ఏది ?
జ: ఇండియా
29) ఎలిమినేషన్ ఆఫ్ వాయిలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ 2017 ఇంటర్నేషనల్ డే యొక్క థీమ్ ఏంటి ?
జ: Leave no one behind-End voilence against women and girls
30) విజిలెన్స్ ఏస్ పేరుతో ఏ రెండు దేశాల ఎయిర్ ఫోర్స్ సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి ?
జ: దక్షిణ కొరియా అమెరికా
31) ఇటీవల విదేశాల్లో అయోధ్య మహోత్సవ ఏ యే నగరాల్లో జరిగాయి ?
జ: సియోల్, గిమ్హే ( దక్షిణ కొరియా)
32) నాలుగోసారి గోల్డెన్ షూ అవార్డు (2017) గెలుచుకున్న ఆటగాడు ఎవరు ?
జ: లయోనెల్ మెస్సీ

NOTE:

TRT కి ప్రిపేర్ అవుతున్న SGT, SA(SOCIAL) అభ్యర్థులకు డిసెంబర్ 4 నుంచి మాక్ టెస్టులు నిర్వహించబడతాయి. ముఖ్యమైన సిలబస్ కవరేజ్ తో పాటు TSPSC ఎగ్జామ్స్ కి అనుగుణంగా నిపుణులతో మాక్ టెస్టులు ప్రిపేర్ చేస్తున్నాం.
పూర్తి వివరాలకు:
http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/