Tuesday, September 25
Log In

TEST : 326 – CA – NOV 25

రాష్ట్రీయం
1) డిసెంబర్ లో జరిగే తెలుగు ప్రపంచ మహాసభల ముగింపు కార్యక్రమానికి (19న) ఎవరు ముఖ్యఅతిధిగా వస్తున్నారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
2) 30 యేళ్ళ క్రితం భారత్ లో ప్రారంభమైన అరణ్య వ్యవసాయ విధానం ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తుంది. అరణ్య వ్యవసాయ విధానాన్ని ఏమంటారు ?
జ: పర్మా కల్చర్
3) గోల్కొండ కోటలో ఇవాంక ఎదుట భక్త రామదాసు కీర్తనపై నృత్యం చేసే అవకాశం దక్కించుకున్న యువకుడు ఎవరు ?
జ: షేక్ జానీ మియా
(నోట్: ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన నృత్యకళాకారుడు )
4) భారత వ్యవసాయ పరిధోధనా మండలి పాలకమండలి సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: డాక్టర్ వి.ప్రవీణ్ రావు
(నోట్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా పనిచేస్తున్నారు )
5) మనకి తెలియని ఎం.ఎస్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ?
జ: రచయిత్రి ఓల్గా
(నోట్: ఇంగ్లీషులో ఈ పుస్తకాన్ని టీజేఎస్ జార్జి రాశారు )
6) తెలుగువారి జ్ఞాన్ పీఠ్ అవార్డుగా ప్రసిద్ధి చెందిన లోక్ నాయక్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ?
జ: ప్రముఖ రంగస్థల ప్రయోక్త, కవి మీగడ రామలింగ స్వామి
7) అమెరికాలోని హవాయి దీవుల్లో జరిగే ఆల్ట్రా మాన్ వరల్డ్ చాంపియన్షిప్ కు భారత్ నుంచి తొలిసారిగా ఎంపికైన ట్రయాథ్లెట్ ఎవరు ?
జ: మన్మథ్ రెబ్బా (హైదరాబాద్ ఆటగాడు )

జాతీయం
8) ఏ సదుపాయం లేని స్మార్ట్ ఫోన్లు జనవరి 1 నుంచి అమ్మడానికి వీల్లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది ?
జ: జీపీఎస్
9) దేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి జరిమానా-నజరానాలతో కూడిన ఏ విధానాన్ని అవలంభించాలని నీతీ ఆయోగ్ ప్రతిపాదించింది ?
జ: ఫీబేట్
(నోట్: కాలుష్య కారక వాహనాలు, సంస్థలపై జరిమానా విధించడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారికి ప్రోత్సాహకాలను ఇవ్వడమే ఈ కొత్త విధానం లక్ష్యం. ఇప్పటికే నార్వే, సింగపూర్ తదితర దేశాల్లో అమల్లో ఉంది )
10) డిజిటల్ ఆర్థిక లావాదేవీలన్నీ ఒకే చోట నిర్వహించుకునేలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన యాప్ ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ఆవిష్కరించారు. దాని పేరేంటి ?
జ: యోనో ( యూ ఓన్లీ నీడ్ వన్ )
11) 2022 కల్లా ఎన్ని గిగా వాట్ల పునరుత్పాదక విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: 200 గిగా వాట్ల
12) భారత సార్వ భౌమ రేటింగ్ ను S & P సంస్థ ఎలాంటి మార్పు చేయకుండా కొనసాగించింది. ఆ సంస్థ ఇచ్చిన రేటింగ్ ఏది ?
జ: BBB-
13) యూపీ మున్సిపాలిటీ చట్టం అమల్లోకి వచ్చిన వందేళ్ళల్లో ( 1916లో ) తొలిసారిగా ఏ మున్సిపాలిటీకి రిజర్వు కేటగిరీ కింద మహిళ మేయర్ పదవి చేపట్టబోతున్నారు ?
జ: లఖ్ నవూ
14) తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికు CEC నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నియోజకవర్గం ఏది ?
జ: ఆర్కే నగర్
15) ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా అందించే ఓజోన్ అవార్డులకు ఎంపికైన భారతీయులు ఎవరు ?
జ: కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి అనిల్ దవే, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ డిప్యూటీ డైరక్టర్ చంద్రభూషణ్
(నోట్: కేంద్ర మాజీ మంత్రి అనిల్ దవేకి మరణానంతరం ప్రకటించారు. వీళ్ళిద్దరూ కిగాలీ ఒప్పందంలో కీలకపాత్ర పోషించారు )
16) ఆస్తులకు భూ-ధార్ పేరుతో 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్ ఏది ?
జ: ఆంధ్రప్రదేశ్
17) బెంగళూరు ఓపెన్ టెన్నిస్ లో డబుల్స్ టైటిల్ ఎవరికి దక్కింది ?
జ: దివిజ్ (భారత్ ) ఎల్గిన్ ( రష్యా)

అంతర్జాతీయం
18) విద్యుత్ కోతలకు చెక్ పెట్టేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీని 5 కోట్ల డాలర్లతో 100 రోజుల్లోనే ఎక్కడ నిర్మిస్తున్నారు ?
జ: దక్షిణ ఆస్ట్రేలియాలో
(నోట్: వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ దీన్ని నిర్మిస్తున్నారు )
19) జింబాబ్వే కొత్త అధ్యక్సుడిగా ఎమర్సన్ నంగాంగ్వా బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో రాబర్ట్ ముగాబే సర్కార్ లో ఏ పదవిలో ఉన్నారు ?
జ: ఉపాధ్యక్షుడిగా

NOTE:

TRT కి ప్రిపేర్ అవుతున్న SGT, SA(SOCIAL) అభ్యర్థులకు డిసెంబర్ 4 నుంచి మాక్ టెస్టులు నిర్వహించబడతాయి. ముఖ్యమైన సిలబస్ కవరేజ్ తో పాటు TSPSC ఎగ్జామ్స్ కి అనుగుణంగా నిపుణులతో మాక్ టెస్టులు ప్రిపేర్ చేస్తున్నాం.
పూర్తి వివరాలకు:
http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/