Tuesday, September 25
Log In

TEST : 324 – CA – NOV 23

రాష్ట్రీయం
1) ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు వచ్చే ఇవాంక సహా పారిశ్రామికవేత్తలకు ఎక్కడి పట్టు చీరలు బహుకరిచాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: పోచంపల్లి
2) గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలకు బదులు వేటిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కేసీఆర్ కాస్మెటిక్ కిట్లు
3) రాష్ట్రంలో ఎన్ని వృక్ష జాతులను పెంచడం, కొట్టివేయడం, తరలించడంపై ఉన్న ఆంక్షలు ప్రభుత్వం తొలగించింది ?
జ: 40 వృక్ష జాతులు
4) ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పట్టాభి సీతారామయ్య సెల్ప్ బిజినెస్ గ్రూప్స్ పథకాన్ని నవంబర్ 21 నుంచి ప్రారంభించిన బ్యాంకు ఏది ?
జ: ఆంధ్రా బ్యాంకు

జాతీయం
5) సుఖోయ్ యుద్ధ విమానం నుంచి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ ను రక్షణ శాఖ వర్గాలు విజయవంగా ప్రయోగించాయి.  ఇది ఎన్ని కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు ?
జ: 290 కిమీ.
6)గ్రామీణ మహిళల ఆరోగ్యం, పోషణ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యతను పెంచేందుకు  దేశవ్యాప్తంగా 115 వెనుకబడిన జిల్లాల్లో ఏ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
జ: ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్రాలు
7) బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమం ప్రస్తుతం 161 జిల్లాల్లో అమలవుతోంది. దీన్ని ఎన్ని జిల్లాలకు విస్తరించనున్నారు ?
జ: 640 జిల్లాల్లో
8) సుప్రీంకోర్టు, 24 హైకోర్టుల్లో పనిచేస్తున్న జడ్జీల వేతనాల పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  ఇకపై సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఎంత వేతనం ఇవ్వనున్నారు ?
జ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - రూ.2.80 లక్షలు,
9) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - రూ. 2.50 లక్షలు
(హైకోర్టు న్యాయమూర్తులకు రూ.2.25 లక్షలు వేతనం )
10) పన్నుల ఆదాయ వనరులను లెక్క వేసి, వాటిని రాష్ట్రాలు, కేంద్రం ఏ విధంగా పంచుకోవాలన్న దానిపై 15వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  సంఘం నివేదిక ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది ?
జ: 2020 ఏప్రిల్ 1 నుంచి
11) రుణ ఎగవేతదారులు, మోసపూరిత చరిత్ర ఉన్న ప్రమోటర్లకు చెక్ పెట్టేందుకు ఏ చట్టంలో మార్పులు తీసుకొస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది ?
జ: Insolvency and Bankruptcy Code (IBC)
12) దేశీయ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ హైక్ వాలెట్ సేవల కోసం ఏ పేమెంట్ బ్యాంకుతో టై అప్ అయింది ?
జ: ఎయిర్ టెల్ పేమెంట్స్
13) భారత్ లో 2020 నాటికల్లా 5 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు  డిజిటల్ ట్రైనింగ్, స్టార్టప్ ట్రైనింగ్ హబ్స్ ను ప్రారంభించిన సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఏది?
జ: ఫేస్ బుక్
14) 50యేళ్ళ క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు, చేర్పులు చేసేందుకు కేంద్రం నియమించిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు ?
జ: అరవింద్ మోడీ ( కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి సభ్యుడు )
15) భారత పర్వాతారోహకుల ఫౌండేషన్ నుంచి జీవిత కాల సాఫల్య అవార్డు పొందినది ఎవరు ?
జ: మానిక్ బెనర్జీ
16) దేశంలో సోలార్ పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గర ఎంత రుణం తీసుకునేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది ?
జ: వంద మిలియన్ డాలర్లు
17) పురుషులను కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకునేందుకు వారిలో చైతన్యం తెచ్చేందుకు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏది ?
జ: Vasectomy Fortnight
18) ఇకపై హిందూ దత్తత, నిర్వహణ చట్టం కింద పిల్లలను దత్తత తీసుకునేందుకు తల్లిదండ్రులు ఆ దత్తత స్వీకారాన్ని ఎక్కడ నమోదు చేయించుకోవాలి ?
జ: బాలల దత్తత వనరుల ప్రాధికార సంస్థ (కారా)
19) చేపల వేటలో మత్య్సకారులకు సమయం, ఇంధనం ఆదా చేసేందుకు ఇస్రో, కేంద్ర సముద్ర మత్స్య సంపద పరిశోధనా సంస్థ కలసి చేపట్టబోయే పరిశోధక ప్రాజెక్టు పేరేంటి ?
జ: సముద్ర

అంతర్జాతీయం
20) 2008 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ను గృహ నిర్భంధం నుంచి విడుదల చేయాలని ఆదేశించింది ఎవరు ?
జ: పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన జ్యూడీషియల్ రివ్యూ బోర్డ్

Friends  ఇటీవల జరిగిన TSPSC ఎగ్జామ్స్ లో ప్రశ్నల సరళి మారింది.  ముఖ్యంగా నిన్న AEO ఎగ్జామ్ లో అగ్రికల్చర్  పేపర్ టఫ్ గా వచ్చింది.  సబ్జెక్ట్ నుంచి కాకుండా అప్లికేషన్ మోడల్ లో ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి.  అలాగే అంతకుముందు జరిగిన FSO, FBO ఎగ్జామ్స్ లోనూ మ్యాథ్స్ పేపర్స్ టఫ్ గా వచ్చాయి.  అందువల్ల ఇకపై TSPSC  ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు ప్రశ్నల సరళిని అర్థం చేసుకొని చదవడం మొదలుపెట్టండి.  TRT, AEE పరిస్థితి కూడా అలాగే ఉంటుందని భావిస్తున్నాను.  గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలను (APPSC)  దృష్టిలో పెట్టుకొని చదవాలని మాత్రం ప్రయత్నించకండి.  స్టాండర్డ్ మారింది.  ఈ TSPSC ఎగ్జామ్స్ చూసిన తర్వాత... మేం కూడా కాస్త కఠినంగానే ప్రశ్నలను రూపొందించాలని భావిస్తున్నాం... రాబోయే అన్ని మాక్ టెస్టులు ఇదే పద్దతిలో తయారు చేస్తాం.  నిన్న రాసిన ఎగ్జామ్ లో కోచింగ్ లు తీసుకున్న వారు, ఎక్కువ పుస్తకాలను రిఫర్ చేసి చదివిన వారి పరిస్థితి కూడా ఒకే విధంగా తయారైంది.  అందువల్ల మీ ప్రిపరేషన్ భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకోండి.  ఆల్ ది బెస్ట్

TRT మాక్ టెస్టులు సోమవారం నుంచి (నవంబర్ 27 నుంచి)  మొదలుపెట్టాలనుకున్నాం... TRT అప్లికేషన్ల గడువు పొడిగించే అవకాశం ఉండటంతో... డిసెంబర్ 1ST లేదా 4 నుంచి మాక్ టెస్టులు నిర్వహించే అవకాశముంది.  TSPSC లేటెస్ట్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు తయారు చేస్తాం.

TRT మాక్ టెస్టుల వివరాలకు క్లిక్ చేయండి: http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/