Tuesday, September 25
Log In

TEST: 323 – CA – NOV 22

రాష్ట్రీయం
1) స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా రాష్ట్రంలో స్వచ్ఛతకు గుర్తింపు చిహ్నంగా ఏ కట్టడాన్ని గుర్తించారు ?
జ: చార్మినార్
2) తెలంగాణలో స్టార్టప్ కంపెనీల వ్యవస్థను బలోపేతం చేసేందుకు యువ పారిశ్రామికవేత్తల కోసం ఎంత మొత్తంతో టీ-ఫండ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ. 100 కోట్లు
3) రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏ దేశ సాంకేతిక సాయం తీసుకుంటోంది ?
జ: జపాన్
4) పాల ధరపై రైతులకు ఇచ్చే అదనపు ప్రోత్సాహకం సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. లీటరుకు ఎంత మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించనుంది ?
జ: రూ.4
5) హైదరాబాద్ HICC లో ఈనెల 28 నుంచి జరిగే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు యొక్క థీమ్ ఏంటి ?
జ: Women First, Prosperity for All
6) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ప్రధాన కార్యలయంలో ఎక్కడ ఉంది ?
జ: హైదరాబాద్ లో

జాతీయం
7) గ్లోబల్ బిజినెస్ స్కూల్ IMD వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ లో భారత్ కు ఏ ర్యాంక్ దక్కింది ?
జ: 51 వ ర్యాంకు
(నోట్: నైపుణ్యం కలిగిన వారిని నియమించుకోవడం, విదేశీ నిపుణులను ఆకర్షించడం, స్థానిక ప్రతిభను మెరుగుపరచడం లాంటి అంశాల ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తారు )
8) దివాలా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు గైడ్ లైన్స్ సూచించేందుకు కేంద్రం ఎవరి అధ్యక్షతన 14మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ?
జ: ఇంజేటి శ్రీనివాస్ ( ఇన్సాల్వెన్సీ లా కమిటీ కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి )
9) భారత్ లో 2022 కల్లా ఎంత మొత్తం వృద్ధి చెందుతుందని క్రెడిట్ సూయిజ్ నివేదికలో తెలిపింది ?
జ: 2.1 లక్షల కోట్ల డాలర్లు
10) దేశంలోనే మొదటిసారిగా భౌగోళిక సమాచార వ్యవస్థ ( GIS) మ్యాపింగ్ సర్వేను ఏ నగరంలో చేపట్టారు ?
జ: చెన్నైలో
(నోట్: ప్రస్తుతం ఉన్న 5 లక్షల కోట్ల డాలర్లతో పోలిస్తే 42శాతం వృద్ధి )
11) ఇటీవల ఏ నిత్యావసర వస్తువుకు సంబంధించిన అన్ని రకాలపైనా దిగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది ?
జ: క్రూడ్ ఎడిబిల్ ఆయిల్
12) న్యాయమూర్తుల వేతనాలను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి వేతనం ఎంత ?
జ: రూ.1.50 లక్షలు
13) ప్రపంచంలోనే అతి పెద్ద టాయిలెట్ పాట్ మోడల్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
జ: హర్యానా (మరోరా గ్రామం... ఇది ట్రంప్ విలేజ్ గా వార్తల్లోకి వచ్చింది )
14) ఆరవ ఇండియా ప్రీమియర్ వాటర్ స్విమ్మింగ్ కాంపిటేషన్ ‘‘స్విమ్మథాన్’’ పోటీలు ఏ రాష్ట్రంలో జరగనున్నాయి ?
జ: గోవా
15) భారత్ - మయన్మార్ సంయుక్త సైనిక విన్యాసాలు (IMBAX) ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి ?
జ: మేఘాలయ


16) ఏ దేశానికి చెందిన విమాన సిబ్బంది రాకపోకలకు వీసా లేకుండా ప్రయాణించడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: రష్యా
17) 2017 సంగాయ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?
జ: మణిపూర్
18) భారత్ లో మొదటి ఎలక్ట్రిక్ వెహికిల్స్ చార్జింగ్ స్టేషన్ ను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేసింది ?
జ: నాగ్ పూర్
19) దక్షిణాసియా సాహిత్యంలో 2017 DSC ప్రైజ్ ఎవరికి దక్కింది ?
జ: అనుక్ అరుద్ ప్రగ్నాసమ్ (శ్రీలంక రచయిత - రాసిన పుస్తకం: The Story of a Brief Marriage )
20) గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఏ సినిమాను ప్రదర్శించాలని కేరళ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ?
జ: ఎస్ దుర్గ (మలయాళ చిత్రం)

అంతర్జాతీయం
21) అంతర్జాతీయ కోర్టు జడ్జిగా భారత్ కు చెందిన దల్వీర్ సింగ్ భండారీ మరోసారి ఎంపికయ్యారు. ఆయనకు గట్టి పోటీ ఇచ్చినది ఎవరు ?
జ: బ్రిటన్ కు చెందిన క్రిస్టోఫర్ గ్రీన్ వుడ్
(నోట్: ఐరాస సాధరణ సభలో 183 మంది, మండలిలో అన్ని దేశాల మద్దతు భారత్ కు లభించింది )
22) అంతర్జాతీయ కోర్టు ఎక్కడ ఉంది ?
జ:  హేగ్ ( నెదర్లాండ్స్ )
23) జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే రాజీనామా చేశారు.  40 యేళ్ళుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ముగాబే ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు ?
జ: 1980లో
24) క్రికెట్ లో యాషెస్ సిరీస్ ఏ రెండు జట్ల మధ్య జరుగుతుంది ?
జ: ఆస్ట్రేలియా - ఇంగ్లండ్
25) మార్కెట్ విలువలో ఫేస్ బుక్ ను మించిన చైనాకు చెందిన సోషల్ మీడియా, వీడియో గేమ్  సంస్థ ఏది ?
జ: టెన్సెంట్ ( 531 బిలియన్ డాలర్లు ) (ఫేస్ బుక్ విలువ 519 బిలియన్ డాలర్లు )
26) 8 వేల యేళ్ళ నాటి పెంపుడు కుక్కల రాతి శిల్పాలు ఏ దేశంలో బయటపడ్డాయి ?
జ: సౌదీ అరేబియాలో
27) 2017 వరల్డ్ ఫిషరీస్ డే ని ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: నవంబర్ 21
28) యూకీ భంబ్రి ఏ ఆటకు చెందిన వారు ?
జ: టెన్నిస్
29) నవంబర్ 19న జరిగిన అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2017 యొక్క థీమ్ ఏంటి
జ: Celebrate Men and Boys
30) ప్రపంచ వ్యాప్తంగా ప్రతియేటా రోడ్డు ప్రమాద బాధితులను గుర్తు చేసుకునేందుకు World Day of Remembrance for Road Traffic Victims ను ఎప్పుడు జరుపుతారు ?
జ: నవంబర్ 19

 

Note: TRT ప్రిపరేషన్ మెటీరియల్ + మాక్ టెస్టులు  ఈనెల 27 నుంచి మొదలవుతున్నాయి. ఫీజుల వివరాల కోసం క్లిక్ చేయండి: http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/