Tuesday, September 25
Log In

TEST : 322 – CA – NOV 21

రాష్ట్రీయం
1) మెట్టుగూడ -ఎస్సార్ నగర్ మెట్రో లైన్ కు భద్రతా ధృవీకరణను ఇచ్చినది ఎవరు
జ: మెట్రో రైలు భద్రతా కమిషన్ ( CMRS)
2) హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దానికి ఏమని పేరు పెట్టారు ?
జ: పాలపిట్ట సైక్లింగ్ పార్క్
3) శాస్త్ర పరిశోధనలు చేసుకునేందుకు హైదరాబాద్ లోని ఏ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ?
జ: ఇక్రిశాట్ కు
4) మూలకణ చికిత్స, పరిశోధనా కేంద్రాన్ని రాష్ట్రంలో ఏ హాస్పిటల్ లో ఏర్పాటు చేయనున్నారు ?
జ: నిమ్స్ ఆసుపత్రిలో
5) మొదటి పాఠం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. దీని రచయిత ఎవరు ?
జ: ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య
6) ఫిబ్రవరి 19-21 తేదీల్లో వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సును హైదరాబాద్ లో ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: HICC లో

జాతీయం
7) ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనపై చైనా అభ్యంతరం చెప్పింది ?
జ: అరుణాచల్ ప్రదేశ్
8) తమ సంపదలో సగ భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఇచ్చే ఏ సంస్థలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని చేరారు ?
జ: ది గివింగ్ ఫ్లెడ్జ్
9) అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
జ: పశ్చిమబెంగాల్
10) ఏజ్ ఆఫ్ యాంగర్ : ఎ హిస్టరీ ఆఫ్ ది ప్రెజెంట్ - పుస్తక రచయిత ఎవరు ?
జ: పంకజ్ మిశ్రా
11) మిస్ వరల్డ్ 2017 కిరీటం మనుషి చిల్లార్ కి దక్కింది. ఆమె ఏ రాష్ట్రానికి చెందిన వారు ?
జ: హర్యానా
12) ఏ రాష్ట్ర రాజ్ భవన్ లో గుడ్డుతో సహా మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించారు ?
జ: తమిళనాడు ( గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ )
13) నవంబర్ 19 నుంచి జరుగుతున్న 2017 ఉమెన్స్ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతోంది ?
జ: గువహటి (అసోం)
14) ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యూనిసెఫ్) కి సెలబ్రిటీ అడ్వకేట్ (ప్రచారకర్త)గా ఎవరు నియమితులయ్యారు ?
జ: నటి త్రిష
15) అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఎక్కడ జరుగుతోంది ?
జ: పనాజీ (గోవా)

అంతర్జాతీయం
16) ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా చేరే విధంగా మల్టిపుల్ వార్ హెడ్స్ మోసుకెళ్ళే అధునాతన ఖండాంతర క్షిపణిని ఏ దేశం రూపొందించింది ?
జ: చైనా
17) అణ్వస్త్ర ప్రయోగాలతో రెచ్చగొడుతున్న ఏ దేశంపై అమెరికా ఉగ్రవాద దేశంగా ముద్ర వేసింది ?
జ: ఉత్తర కొరియా
18) మాజీ వింబుల్డన్ ఛాంపియన్ యానా నోవోత్నా చనిపోయారు. ఆమె ఏ దేశానికి చెందిన వారు ?
జ: చెక్ రిపబ్లిక్
19) వరల్డ్ టాయిలెట్ డే 2017 థీమ్ ఏంటి ?
జ: Wastewater

 

Note: TRT ప్రిపరేషన్ మెటీరియల్ + మాక్ టెస్టులు  ఈనెల 27 నుంచి మొదలవుతున్నాయి. ఫీజుల వివరాల కోసం క్లిక్ చేయండి: http://tsexams.com/trt-sgt-sa-social-mock-tests/