Tuesday, September 25
Log In

TEST : 321 -CA – NOV 20

రాష్ట్రీయం
1) బహిరంగ మల విసర్జన రహిత జిల్లా సిద్దిపేటను గుర్తించారు. జిల్లాలో ఎన్ని ఇళ్ళల్లో మరుగుదొడ్లను నిర్మించారు ?
జ: 2,40,338
2) హైదరాబాద్ లో జరిగిన దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ 16వ రాష్ట్రస్థాయి రాష్ట్ర విశారధ్, రాష్ట్ర భాష ప్రవీణ్ స్నాతకోత్సవంలో ఎవరు ముఖ్యఅతిధిగా విచ్చేశారు ?
జ: ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
3) రాష్ట్రంలో ఎన్ని కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు సింగరేణి ప్రయత్నిస్తోంది ?
జ: 12 గనులు ( 6 భూగర్భం, 6 ఓపెన్ కాస్ట్ )
4) రాష్ట్రంలోని 72 పట్టణ, స్థానిక సంస్థలకు చెందిన ఎన్ని ఆస్తులకు మున్సిపల్ శాఖ జియో ట్యాగింగ్ చేసింది.
జ: 12.02 లక్షల ఆస్తులు
5) వ్యవసాయం, ఉద్యాన, పశు వైద్యం తదితర కోర్సులను వృత్తి విద్యా కోర్సులుగా గుర్తింపు ఇవ్వాలని రాష్ట్రాలను ఎవరు ఆదేశించారు ?
జ: భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్ )
6) జాతీయ బ్యాడ్మింటన్ అండర్ 19 టైటిల్ గెలుచుకున్న హైదరాబాదీ ఎవరు ?
జ: గాయత్రి ( బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె)


జాతీయం
7) భారత దేశ తొలి న్యూక్లియర్ సబ్ మెరైన్ INS అరిహంత్ ను ఎవరు జలప్రవేశం చేయించారు ?
జ: రక్షణమంత్రి నిర్మలా సీతారామన్
8) INS అరిహంత్ జలప్రవేశం ద్వారా న్యూక్లియర్ సబ్ మెరైన్లు కలిగిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది ?
జ: ఆరో దేశం
(నోట్: ఇంతకుముందు అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా మాత్రమే న్యూక్లియర్ సబ్ మెరైన్లు కలిగి ఉన్నాయి )
9) 2017 ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరికి ప్రకటించారు ?
జ: డాక్టర్ మన్మోహన్ సింగ్ (మాజీ ప్రధాని )
10) స్థూల దేశీయోత్పత్తి ఆధారంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన తలసరి ఆదాయ ర్యాంకుల్లో భారత్ కు ఎంత ?
జ: 126వ ర్యాంకు (7,170 డాలర్లు)
(నోట్: కిందటేడాది 127 వ ర్యాంకు : 6,690 డాలర్లు)
11) ప్రస్తుత రబీ సీజన్ లో గోధుమలు క్వింటాకు ఎంత మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించింది ?
జ: రూ.1735 (గతం కన్నా రూ.110లు ఎక్కువ పెంచారు )
12) ఎస్సీ, ఎస్టీల్లోని వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు వారిని వేరొక వ్యక్తి ఫోనులో తిడితే అది ఎట్రాసిటీ కేసు కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించిన సెక్షన్ ఏది ?
జ: ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1) (ఎస్)
13) రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) పథకం కింద ఆంధ్రప్రదేశ్ సహా 5 రాష్ట్రాల్లో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొదట వేటి రాయితీని రైతులకు అందించనున్నారు ?
జ: ఎరువుల రాయితీని
14) ఏపీ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా అవార్డుల్లో బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరు అందుకున్నారు ?
జ: హీరో - దగ్గుపాటి రానా, హీరోయిన్ - దీపికా పదుకునే

అంతర్జాతీయం
15) విదేశాల్లో బ్లాక్ మనీ దాచుకున్న వారి వివరాలను భారత్ సహా 40 దేశాుల ఆటోమేటిక్ గా మార్పిడి చేసుకునే ఒప్పందానికి ఏ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది ?
జ: స్విట్జర్లాండ్
16) జింబాబ్వే అధ్యక్షుడైన రాబర్ట్ ముగాబేని పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించి మాజీ ఉపాధ్యక్షుడు ఎమర్సన్ ఎమ్ నాంగాగ్యాని నియమించారు. ముగాబే ఏ పార్టీకి చెందినవారు ?
జ: జాను -పీఎఫ్ పార్టీ
17) ఐఎంఎఫ్ విడుదల చేసిన జీడీపీ ఆధారంగా తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది ?
జ: ఖతార్ ( 1,24,930 డాలర్లు )
(నోట్: రెండో స్థానం - మకావు 1,14,430 డాలర్లు, లగ్జెంబర్గ్ 1,09,190 డాలర్లు )
18) అంతర్జాతీయ క్రికెట్ లో అండర్ - 19 ప్రపంచ కప్ ను మొదటిసారి దక్కించుకున్న దేశం ఏది ?
జ: అఫ్ఘనిస్తాన్ ( పాకిస్తాన్ 185 పరుగులో తేడాతో గెలిచింది)