Tuesday, September 25
Log In

TEST: 302 – CA OCT 31

రాష్ట్రీయం
1) కాళేశ్వరం ఎత్తిపోత పథకానికి నీటిని మళ్ళించే మేడి గడ్డ బ్యారేజీ దగ్గర ఎంత నీటి లభ్యతను కేంద్ర జలసంఘ నిర్ధారించింది ?
జ: 282.3 టీఎంసీలు
2) యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది క్రమబద్దీకరణ, వేతనాల పెంపుపై విచారణ జరుపుతున్న కమిటీ ఏది ?
జ: ఆచార్య తిరుపతి రావు కమిటీ
3) తెలంగాణ చేనేత సహకార సంఘం ( టెస్కో) స్థానంలో ఏ సంస్థను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: రాష్ట్ర చేనేత అభివృద్ధిసంస్థ

జాతీయం
4) భారత్ - ఇటలీ మధ్య ఆరు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీతో ఢిల్లీలో సమావేశమైన
జ: పవోలో జెంటిలోని
5) జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: యోగేష్ చందర్ మోడీ (వైసీ మోదీ)
(నోట్: అసోం-మేఘాలయ కేడర్ ఐపీఎస్ అధికారి )
6) పబ్లిక్ రంగ సంస్థల బ్యాంకుల విలీనం కేంద్రం నియమించిన మంత్రిత్వ స్థాయి కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కమిటీ
7) రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ కు ప్రైవేట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: విక్రమ్ సింగ్ (1997 IRTS బ్యాచ్ అధికారి)
8) చంద్రుడి మీద పరిశోధనల కోసం చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఎప్పుడు చేపడుతున్నట్టు ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు ?
జ: మార్చి 2018లో
9) భారత్ ఏదేశంతో కలసి  హిందూ మహాసముద్రంలో మూడు రోజుల యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ఎక్సర్ సైజెస్ నిర్వహిస్తోంది ?
జ: జపాన్  (జపాన్ మేరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ )
10) భారత్ - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య రెండో వ్యూహాత్మక చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: అబూ దాబీ
11) 2017 PHDCCI (PHD చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) లైఫ్  టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న అలనాటి బాలీవుడ్ నటి ఎవరు ?
జ: షర్మిలా ఠాగూర్
12) ప్రమోద్ మహాజన్ స్మృతి అవార్డును అందుకున్న బాలీవుడ్ నటుడు ఎవరు ?
జ: అనుపమ్ ఖేర్
(నోట్: ప్రస్తుతం అనుపమ్ ఖేర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు )
13) ఘజియాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సురేష్ రైనా
14) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ ర్యాంకు ఎవరికి దక్కింది ?
జ: విరాట్ కోహ్లీ
15) ఐసీసీ వన్డే బ్యాట్స్ ఉమెన్ ర్యాంకింగ్స్ లో నెంబర్ స్థానం ఎవరికి దక్కింది ?
జ: మిథాలీ రాజ్
16) గుండెపోటుతో చనిపోయిన BCCI మాజీ జీఎం, హైదరాబాద్ మాజ కెప్టెన్ ఎవరు ?
జ: ఎం.వీ శ్రీధర్
17) ఏ దేశంతో జరిగిన మ్యాచ్ తో వన్డేల్లో 9 వేల రన్స్ పూర్తి చేసిన ఆరో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు
జ: కాన్పూర్ లో జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మ్యాచ్ లో
18) వైజాగ్ లో జరుగుతున్న జాతీయ బ్యాక్సింగ్ ఛాంపియన్షిప్ 49కిలోల విభాగంలో స్వర్ణం గెలుచుకున్నది ఎవరు ?
జ: శ్యామ్ కుమార్

అంతర్జాతీయం
19) ప్రపంచంలో పెరిగిపోతున్న కార్బన్ డైఆక్సైడ్ పై ప్రపంచ వాతావరణ సంస్థ ఏ నివేదికను వెల్లడించింది
జ: గ్రీన్ హౌస్ గ్యాస్ బులెటిన్
20) ప్రపంచ వ్యాప్తంగా 2016 లో కార్బన్ డైఆక్సైడ్ వాయు తీవ్రత ఎంతగా ఉన్నట్టు గ్రీన్ హౌస్ గ్యాస్ బులెటిన్ ద్వారా వెల్లడైంది
జ: 403.3 పార్ట్స్ పర్ మిలియన్ ( PPM)
21) ఫార్ములా వన్ రేసులో ప్రపంచ టైటిల్ లో నాలుగోసారి గెలుచుకుంది ఎవరు ?
జ: లూయీస్ హామిల్టర్ (బ్రిటన్ )
22) 2018 ఏప్రిల్ లో జరిగే ఏసియాన్ క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ నేషన్స్ కప్ ను నిర్వహించనున్న దేశం ఏది ?
జ: పాకిస్తాన్
23) 2018 నుంచి మహిళలు కూడా స్పోర్ట్స్ స్టేడియాలకు వచ్చి ఆటలను చూడొచ్చని అనుమతి ఇచ్చిన అరబ్ దేశం ఏది ?
జ: సౌదీ అరేబియా  (జూన్ 2018 నుంచి )