Tuesday, September 25
Log In

TEST 301- CA OCT 30

రాష్ట్రీయం
1) మిషన్ కాకతీయతో రైతుల ఆదాయం ఎంతశాతం పెరిగినట్టు నాబార్డ్ అనుబంధ సంస్థ  నాబ్కాన్ వెల్లడించింది ?
జ: 47.4శాతం పెరిగింది.
2) దేశంలోనే అత్యధికంగా ఆధార్ నమోదైన నగరం ఏది ?
జ: హైదరాబాద్
(నోట్: 2017 సెప్టెంబర్ నాటికి 1.09 కోట్ల మంది నమోదు చేయించుకున్నారు )
3) తిరుపతి నుంచి హైదరాబాద్ నాంపల్లి వరకూ వచ్చే రాయలసీమ ఎక్స్ ప్రెస్ రైలును ఏ నగరం వరకూ పొడిగించనున్నారు ?
జ: నిజామాబాద్
4) సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను జూన్ 1 నుంచి అక్బోబర్ 28 వరకూ తెరచి ఉంచారు. మళ్లీ అక్టోబర్ 29న మూసేశారు.  ఎప్పుడు తెరుస్తారు ?
జ: జూన్ 30 వరకూ
5) ఇటీవల రాష్ట్రంలో టెక్నోజియాల్ - 2017 వేడుకలు ఎక్కడ నిర్వహించారు ?
జ: వరంగల్ లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (NIT) లో
6) ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకున్న తెలుగు పదం ఏది ?
జ: అన్న
7) 1950-70 మధ్యకాలంలో అనేక సినిమాలను నిర్మించిన నిర్మాత, సీపీఎం నాయకుడు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన పేరేంటి ?
జ: అట్లూరి పూర్ణ చంద్రరావు
(నోట్: ఎన్టీఆర్ హీరోగా ఆడపడుచు, కలవారి కోడలు, మాతృదేవత తదితర చిత్రాలు )
8) ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సొంతం చేసుకున్న తెలుగు బ్యాడ్మింటన్ ఆటగాడు ఎవరు ?
జ: కిదాంబి శ్రీకాంత్
9) కిదాంబి శ్రీకాంత్ కి ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ లో ప్రత్యర్థి ఆటగాడు ఎవరు
జ: కెంటా నిషిమోటో ( జపాన్ )


జాతీయం
10) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఖాళీ చేసిన రాజస్థాన్ నుంచి రాజ్యసభ సీటులో బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తున్నారు ?
జ: కేంద్రమంత్రి అల్ఫోన్స్
11) పాకిస్తాన్ కు చెందిన ఎంతమంది హిందువులకు భారత్ ప్రభుత్వం దీర్ఘకాలిక వీసాలు మంజూరు చేసింది ?
జ: 431 మందికి
12) పాకిస్తాన్ లో అడుగుపెట్టకుండా మొదటిసారిగా ఆప్ఘనిస్తాన్ కు ఏ ఓడరేవు మీదుగా  గోధుమలతో నౌకను పంపించారు ?
జ: ఛాబహార్ ఓడరేవు ద్వారా
(నోట్: ఈ నౌక గుజరాత్ లోని కాండా్ల నుంచి బయల్దేరింది )
13) ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చూరీ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: తమిళనాడు
14) భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్ గెలుచుకుంది.  ఇప్పటిదాకా వరుసగా ఎన్ని వన్డే సిరీస్ లను కోహ్లీ సేన గెలుచుకుంది
జ: ఏడు వన్డే సిరీస్ లు
15) ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఎర్ స్టీ ఓపెన్ ఏటీసి - 500 టెన్నిస్ టోర్నమెంట్ లో డబుల్స్ లో టైటిల్ సాధించింది ఎవరు ?
జ: రోహన్ బోపన్న
(నోట్: పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) తో కలసి ఆడాడు )
16) హో చి మిన్ సిటీలో జరిగిన వియత్నాం ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్ లో విజేతగా నిలిచిన భారత్ జోడీ ఎవరు ?
జ: సాకేత్ మైనేని- విజయ్
17) 36వ జాతీయ క్రీడలు (2018) ను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు ?
జ: గోవా