Tuesday, September 25
Log In

TEST 300- CA- OCT 29

రాష్ట్రీయం
1) ఇన్నోవేషన్ విభాగంలో భారత స్వతంత్ర విద్యుదుత్పత్తిదారుల సంఘం 2017 పవర్ పురస్కారం ఎవరికి దక్కింది ?
జ: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జి.రఘుమా రెడ్డి
2) 2016 ఐపీఎస్ ట్రైనీల పాసింగ్ అవుట్ పెరేడ్ హైదరాబాద్ శివర్లలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనుంది. దీనికి ముఖ్యఅతిధిగా ఎవరు హాజరవుతున్నారు ?
జ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్

జాతీయం
3) వస్తు, సేవల పన్ను (GST) అమలుతో రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ఎంత పరిహారం విడుదల చేసింది ?
జ: రూ.8,696 కోట్లు
4) భారత్ లో ఎంతమంది పిల్లలు తట్టు (మీజిల్స్) వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోలేదని అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది ?
జ: దాదాపు 29 లక్షల మంది
5) తూర్పు నౌకాదళాధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్
(నోట్: ప్రస్తుతం ఈయన భారత నౌకాదళం  ఉపదళాధిపతిగా ఉన్నారు )
6) జాతీయ ఆయుర్వేద దినంను ఎప్పుడు నిర్వహించారు ?
జ: అక్టోబర్ 28
7) ఈ ఏడాదికి కాళిదాస్ సమ్మాన్ అవార్డును ఎవరు అందుకున్నారు ?
జ: రామ్ గోపాల్ బజాజ్
8) అడాప్ట్ ఎ హెరిటేజ్ స్కీమ్ - ను పర్యాటక మంత్రిత్వ శాఖ ఎప్పుడు ప్రారంభించింది ?
జ: వరల్డ్ టూరిజం డే
9) ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీకి సామాజికంగా, లైంగికపరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా చట్టబద్ధమైన హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: కర్ణాటక
10) హజ్రత్ నిజాముద్దీన్ (న్యూఢిల్లీ), ఆనంద్ విహార్ (ఢిల్లీ) రైల్వే స్టేషన్లలో ఏ మిషన్ కింద సోలార్ ప్లాంట్స్ ను నెలకొల్పుతున్నారు ?
జ: నేషనల్ సోలార్ మిషన్
11) ప్రొ కబడ్డీ ఛాంపియన్ గా ఏ జట్టు నిలిచింది ?
జ: పట్నా పైరేట్స్ (కెప్టెన్: ప్రదీప్ నర్వాల్)
(నోట్: వరుసగా మూడోసారి కూడా గెలుచుకున్నారు )

అంతర్జాతీయం
12)ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి తప్పుకున్న మొదటి దేశం ఏది ?
జ: బురిండీ
13) మొదటిసారి అతిథ్యమిచ్చిన పిఫా అండర్ -17 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన జట్టు ఏది ?
జ: ఇంగ్లండ్
14) 150యేళ్ళ న్యూజిలాండ్ చరిత్రలో అతి చిన్న వయస్కుడిగా 40వ ప్రధానిగా ఎవరు ప్రమాణం చేశారు ?
జ: జసిందా ఆర్డెర్న్
(నోట్: స్పెయిన్ తో జరిగిన మ్యాచ్ లో 5-2 తో గెలిచింది)