Tuesday, September 25
Log In

TEST: 299- CA – OCT 28

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
జ: సంగారెడ్డి జిల్లా కొండకల్
2) మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ ఎంత పెట్టుబడితో కొండకల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది ?
జ: రూ.800 కోట్లు
3) గిరిజనుల సాగుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించేందుకు తెలంగాణ కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పోరేషన్ ( ట్రైకార్ ) ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది
జ: ఇక్రిశాట్ తో
4) ఇంటర్ విద్యార్థులకు సిలబస్, వీడియో పాఠాలు, పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉండేలా ఇంటర్ బోర్డు రూపొందించిన కొత్త యాప్ ను విద్యాశాఖ మంత్రి కడియంశ్రీహరి ఆవిష్కరించారు. దాని పేరేంటి ?
జ: ఈ-డిజిటల్ స్టడీ కిట్ ( డిస్క్ )


5) ఏయే భాషల్లో వికీమీడియా సేవలను విస్తరించేందుకు రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ బెంగళూరులోని ఇంటర్నెట్ సొసైటీతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: తెలుగు, ఉర్దూ
6) నీలోఫర్ హాస్పిటల్ లో తొలి తల్లిపాల బ్యాంకును ఎవరు ప్రారంభించారు ?
జ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాక సహాయమంత్రి అనుప్రియ పటేల్
7) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఉన్నత విద్యా కోర్సుల్లో ఏ పాఠాలను తప్పనిసరిగా ప్రవేశపెడుతున్నారు ?
జ: విపత్తులు నిర్వహణ
జాతీయం
8) భారత్ లో ఇన్ ఫ్రాంటీ డేని ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: అక్టోబర్ 27
(నోట్: 1947 అక్టోబర్ 27న పాక్ సైన్యం మద్దతుతో జమ్మూకశ్మీర్ లో ప్రవేశించిన గిరిజనదళాలను తరిమివేసేందుకు సిక్కు రిజిమెంట్ మొదటి బెటాలియన్ శ్రీనగర్ లో దిగింది. అందుకు గుర్తుకు ఇన్ ఫ్రాంటీ డే జరుపుకుంటారు )
9) వివాదస్పద రామమందిరం నిర్మాణంపై చర్యలకు మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చినది ఎవరు ?
జ: శ్రీశ్రీ పండిట్ రవిశంకర్ ( ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు)
10) నవంబర్ 3న వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు ఎక్కడ జరగనుంది ?
జ: న్యూఢిల్లీ
11) భారత్ లో అమెరికా రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: కెన్ జస్టర్
12) 3వ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇండియా ఫోరమ్ ఎక్కడ జరగనుంది
జ: న్యూఢిల్లీ
13) శ్రీలంకలోని ఏ యూనివర్సిటీకి 5.85 లక్షల డాలర్ల వెహికిల్స్, ఇతర సామాగ్రిని భారత్ సమకూర్చింది ?
జ: యూనివర్సిటీ ఆఫ్ జాఫ్నా
14) సైన్స్ కెరీర్స్ టాప్ 20 ఎంప్లాయీస్ సర్వే 2017లో మొదటిసారి స్థానం దక్కించుకున్న ఇండియన్ కంపెనీ ఏది ?
జ: బయోకాన్ (బెంగళూరు)

అంతర్జాతీయం
15) ప్రజా రవాణా కోసం ప్రపంచంలోనే మొదటిసారి హైడ్రోజన్ తో నడిచే పర్యావరణ హితమైన ట్రామ్ ను ప్రారంభించిన దేశం ఏది ?
జ: చైనా
16) స్పెయిన్ లో పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన ఏ ప్రాంతం ప్రాంతీయ పార్లమెంటు ద్వారా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది ?
జ: కాటలోనియా
17) కాటలోనియాలో వేర్పాటువాదులకు నాయకత్వం వహిస్తూ స్థానిక ప్రభుత్వానికి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తున్నారు ?
జ: కార్లెస్ ప్యూగ్డెమెంట్
18) తమ దేశంలోని కార్మికులకు కనీసం వేతనం ఇవ్వాలని మొదటగా ఏ అరబ్ దేశం నిర్ణయించింది ?
జ: ఖతార్
19) 2017 ప్రజా సేవల విభాగంలో HIV లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు అందుకున్న దంపతులుకు ఏ దేశానికి చెందిన వారు ?
జ: దక్షిణాఫ్రికా
(నోట్: సలీమ్ అబ్దుల్ కరీం, ఖుర్రేషా అబ్దుల్ కరీం )
20) అమెరికన్ ఎక్స్ ప్రెస్ కంపెనీకి 16యేళ్ళుగా CEO గా ఎవరు పనిచేస్తున్నారు ?
జ: కెన్నెత్ చెనాల్ట్
21) నావికా సాగర్ పరిక్రమ ప్రోగ్రామ్ కింద బయల్దేరిన మహిళా నావికా బృందం 43 రోజుల ప్రయాణంత తర్వాత ఏ దేశానికి చేరుకున్నది
జ: ఆస్ట్రేలియా
22) ప్రపంచంలోనే మొదటిసారిగా ఓ రోబోట్ కి దేశపౌరసత్వం ఇచ్చిన దేశం ఏది ?
జ: సౌదీ అరేబియా ( రోబో పేరు : సోఫియా )
23) వరల్డ్ పోలియో డేని ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: 24 అక్టోబర్