Tuesday, September 25
Log In

TEST: 298- CA – OCT 27

రాష్ట్రీయం
1) షీటీమ్స్ ఏర్పడి మూడేళ్ళయిన సందర్భంగా హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించిన కొత్త పోర్టల్ ఏది
జ: షీ టీమ్ ఫర్ మి
2) నగదు బదిలీ కింద రేషన్ షాపుల్లో చౌక బియ్యానికి కిలోకి ఎంత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనగా ఉంది ?
జ: రూ.26.66
3) నవంబర్ 8 నుంచి 14 వరకూ హైదరాబాద్ లో జరిగే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఎన్ని సినిమాలను ప్రదర్శించనున్నారు ?
జ: 295 సినిమాలు
4) ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రంలో సెప్టెంబర్ 25 వరకూ ఎన్ని కోట్ల పంట రుణాలను బ్యాంకులు రైతులకు అందించాయి
జ: రూ.21732 కోట్లు (ఖరీఫ్ లక్ష్యంలో 91శాతం )
5) తెలంగాణలోని పాడి పరిశ్రమ సహకారం సంఘాలకు పాలు సరఫరా చేస్తున్న చిన్న, సన్నకారు రైతులకు లీటరుకు ఎంత చొప్పు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం ఇవ్వనుంది ?
జ: రూ. 4 లు
6) ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (INSA) ఫెలోషిప్ కు ఎంపికైనది ఎవరు
జ: HCU వీసీ ప్రొ. పొదిలె అప్పారావు

జాతీయం
7) ఢిల్లీలో జరిగిన ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సమ్మేళనం (అంక్టాడ్ ) ఆద్వర్యంలో వినియోగదారుల పరిరరక్షణకై ఏర్పాటైన అంతర్జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
8) ఏ రాష్ట్రంలో విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లను 21 నుంచి 26 శాతానికి పెంచారు ?
జ: రాజస్థాన్
9) నకిలీ స్టాంపు కాగితాల నేరగాడు అబ్దుల్ కరీం తెల్గీ చనిపోయాడు. తెల్గీ స్కామ్ ఏ సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది
జ: 2004లో
10) 25 కోట్ల ఏళ్ళ నాటి భారీ రాకాసి మత్య్స బల్లి శిలాజం మన దేశంలో ఎక్కడ వెలుగు చూసింది.
జ: గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో
11) హృదయనాథ్ మంగేష్కర్ అవార్డ్ 2017 కు ఎవరు ఎంపికయ్యారు ?
జ: జావెద్ అక్తర్
12) 2017 ఆడియో విజువల్ హెరిటేజ్ ప్రపంచ దినోత్సవం (అక్టోబర్ 27) యొక్క థీమ్ ఏంటి ?
జ: Discover, Remember and Share
13) కర్ణాటకలో తీర ప్రాంత పరిరక్షణ కోసం ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి ఎంత మొత్తం రుణం తీసుకోడానికి భారత్ సంతకం చేసింది ?
జ: 65.5 మిలియన్ డాలర్లు
14) ఫోర్బ్స్ రూపొందించిన క్రీడాకారుల బ్రాండ్ విలువలో టాప్ 10 లో చోటు సంపాదించిన భారతీయ క్రికెటర్ ఎవరు ;
జ: విరాట్ కోహ్లీ ( రూ.94 కోట్లతో ఏడో స్థానం )
15) బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా లో కొత్తగా అసోషియేట్ మెంబర్ గా చేరిన రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ఏది
జ: పుదుచ్చేరి
అంతర్జాతీయం
16) లోన్లీ ప్లానెట్ బెస్ట్ ఇన్ ట్రావల్ 2018 లిస్ట్ లో... 2018లో పర్యటించాల్సిన ఉత్తమ దేశంగా ఏది ఎంపికైంది
జ: చిలీ
17) వినియోగదారుల రక్షణ కోసం ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఎప్పుడు తీర్మానాన్ని ఆమోదించింది
జ: 1985 ఏప్రిల్ 16
18)ఫోర్బ్స్ క్రీడాకారుల బ్రాండ్ విలువలో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన ప్లేయర్స్ ఎవరు ?
జ: రూ.241 కోట్లతో రోజర్ ఫెదరర్ (మొదటి), రూ.216 కోట్లతో లెబ్రాన్ జేమ్స్ ( రెండో స్థానం )
19) టెన్నిస్ కు గుడ్ బై చెప్పిన స్విట్జర్లాండ్ ప్లేయర్ ఎవరు ?
జ: మార్టినా హింగిస్
(నోట్: కెరీర్ లో 25 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళ గెలుచుకుంది )