Tuesday, September 25
Log In

TEST 296- CA -OCT 25

రాష్ట్రీయం
1) బట్టలు ఉతికేందుకు రాష్ట్రంలో 5 మోడల్ వాషింగ్ యూనిట్లు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ?
జ: నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్ధిపేట, ఆదిలాబాద్
2) అంతర్జాతీయ నీటిపారుదల కమిషన్ (ICID) ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: ప్రొఫెసర్ ఎల్లారెడ్డి
(నోట్: హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని వాలంటరీ డైరక్టర్. మెక్సికోలో జరిగిన నీటి సంరక్షణ సదస్సులో ఎల్లారెడ్డిని ఎన్నుకున్నారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు )
3) డిగ్రీకాలేజీల్లో సీట్ల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ఏది ?
జ: దోస్త్
4) హైదరాబాద్ లో చనిపోయిన సలా ఇక్బాల్ కి ఏ రంగంలో ప్రావీణ్యం ఉంది ?
జ: మహిళా బైక్ రైడర్

జాతీయం
5) భారత్ మాల సహా 83,677 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఎంత మొత్తం కేటాయించింది ?
జ: రూ. 7లక్షల కోట్లు
6) భారత మాల ప్రాజెక్టు కింద దేశసరిహద్దులతో పాటు కోస్తా, ఇతర ప్రాంతాలను కలుపుతూ ఎన్ని కిలోమీటర్లలో జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు ?
జ: 50 వేల కిమీ
7) మొండి బకాయిలతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రప్రభుత్వం ఎన్ని కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది ?
జ: రూ.2.11 లక్షల కోట్లు
8) పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఏ సంస్థలో 5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తోంది ?
జ: నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్
9) యుద్ధం, విపత్తుల సమయంలో సన్నద్ధతను పరీక్షించేందుకు వైమానిక విభాగం మిరేజ్ 2000, సుఖోయ్ 30, సీ-130జే విమానాలను ఏ ఎక్స్ ప్రెస్ హైవే పై దింపారు ?
జ: లక్నో - ఆగ్రా
10) లక్నో - ఆగ్రా హైవేపే యుద్ధవిమానాలను దింపేందుకు చేపట్టిన కార్యక్రమం పేరేంటి ?
జ: టచ్ అండ్ గో
11) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజీనామా చేసిన ఎంపీ సభ్యత్వానికి నవంబర్ 16న ఉప ఎన్నికల నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అయితే వెంకయ్య ఏ రాష్ట్రం నుంచి ఎంపీ అయ్యారు ?
జ: రాజస్తాన్
12) పిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న ఏసియాన్ దేశాల రక్షణమంత్రుల సమావేశానికి హాజరైన కేంద్రమంత్రి ఎవరు ?
జ: నిర్మలా సీతారామన్
13) ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయని గిరిజా దేవి కోల్ కతాలో కన్నుమూశారు.  ఆమె ఏ పేరుతో ప్రసిద్ధికెక్కారు ?
జ: క్వీన్ ఆఫ్ తుమ్రీ
14) ఉత్తరకొరియా కేంద్రంగా కార్యకలాపాలు నడుపుతున్న పేరు మోసిన సైబర్ నేరగాళ్ళు, మన దేశంలోనే సర్వర్లను హ్యాక్ చేసినట్టు బయటపడింది. ఆ ముఠా పేరేంటి ?
జ: లాజరస్
15) వరల్డ్ కప్ ఫైనల్స్ షూటింగ్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ లో ఎవరు స్వర్ణం గెలుచుకున్నారు
జ: జీతూ -హీనా

అంతర్జాతీయం
16) ఆధునిక చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత ప్రజాదరణ గల నాయకుడికిగా నిలిచింది ఎవరు ?
జ: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
17) కిందటేడాది మరణించిన ఏ  దేశ రాజు అంత్యక్రియలకు రూ.585 కోట్లు ఖర్చు చేయనున్నారు ?
జ: థాయ్ లాండ్ రాజు భుమిబోల్ అదుల్యదెజ్
18) భారత్ అమెరికా రాయబారిగా ఎవర్ని నియమించడంపై అమెరికా కాంగ్రెస్ లో ఓటింగ్ జరుగుతోంది ?
జ: కెన్ జస్టర్
19) చైనా ప్రధానిగా మరో ఐదేళ్ళు ఎవరుకొనసాగనున్నారు ?
జ: లి కెఖియాంగ్
20) సౌదీలో ఎర్ర సముద్ర తీరంలో రూ.32.50 లక్షల కోట్లతో భారీ నగరాన్ని నిర్మించనున్నారు. దాని పేరేంటి ?
జ: నియోమ్
21) ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎవరు నిలిచారు ?
జ: క్రిస్టియానో రొనాల్డో
(నోట్: పోర్చగల్ జట్టు కెప్టెన్; రియల్ మాడ్రిడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ )