Tuesday, September 25
Log In

TEST: 295-CA- OCT 24

రాష్ట్రీయం
1) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులపై ఉపసంఘానికి ఎవరు ఛైర్మన్ ?
జ: పోచారం శ్రీనివాస్ రెడ్డి
2) రాష్ట్రంలో ఎన్ని తండాలు, గూడెలను 1756 పంచాయతీలుగా మార్చనున్నారు ?
జ: 5040
3) రాష్ట్రంలో 141 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలను ఎప్పటి నుంచి ఆధునీకరించనున్నారు ?
జ: నవంబర్ 1 నుంచి
4) నల్గొండ జిల్లా దామర చర్ల దగ్గర ప్రారంభమైన యాదాద్రి విద్యుత్కేంద్రం ఉత్పత్తిని ప్రారంభించింది.  ఇక్కడ ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది ?
జ: 4 వేల మెగావాట్లు
5) కృష్ణా, గోదావరి బేసిన్లలో రిజర్వాయర్ల నుంచి మిషన్ భగీరథకు ఎంత నీటిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 56 టీఎంసీలు
6) విహారం దీర్ఘకావ్యం (కవితా సంపుటి)ని ఎవరు రచించారు ?
జ: బీఎస్ రాములు ( బీసీ కమిషన్ ఛైర్మన్)
7) ప్రాథమిక ఆరోగ్య రంగంలో లక్ష్యాల సాధనకు సాంకేతికత, శిక్షణ సహకారం అందించేందుకు ఏ విశ్వవిద్యాలయం ముందుకువచ్చినట్టు రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు ?
జ: హార్వర్డ్ విశ్వవిద్యాలయం
8) నేపాల్ లోని మేరా పర్వతంపై( 6150 మీటర్ల ఎత్తు - మైనస్ 7 డిగ్రీల ఉష్ణోగ్రతలో) 108 సూర్య నమస్కారాలు చేసిన తెలంగాణ యువకుడు ఎవరు ?
జ: మరిపెల్లి ప్రవీణ్
(నోట్: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్లగ్రామం)
9) వియత్నాం పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియా కాన్సిలేట్ జనరల్ గా నియమితులైన తెలంగాణ కు చెందిన వ్యక్తి ఎవరు ?
జ: కొప్పుల శ్రీకర్ రెడ్డి ( యాదాద్రి -భువనగిరి జిల్లా )
10) న్యూజిలాండ్ తో జరిగే భారత్ టీ 20 జట్టులో చోటు దక్కించుకున్న హైదరాబాద్ పేస్ బౌలర్ ఎవరు ?
జ: మొహమ్మద్ సిరాజ్

జాతీయం
11) రూ.57 కోట్లతో ఏ దేశంలో చేపడుతున్న 15 ప్రాజెక్టులను కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించారు ?
జ: బంగ్లాదేశ్
12) ముంబైలోని రైల్వే స్టేషన్ లో ఫుట్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసిన క్రికెటర్, ఎంపీ ఎవరు ?
జ: సచిన్ టెండూల్కర్ (ఎంపీ లాడ్స్ నుంచి )
13) పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది ?
జ: సిన్హా ( నర్మద కంట్రోల్ అథారిటీ కార్యనిర్వాహక సభ్యుడు )
14) పోస్టల్ బ్యాంక్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కు కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?
జ: సురేష్ సేథీ
15) ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని రెండో నెంబర్ ద్వారానికి ఏ క్రికెటర్ పేరు పెట్టనున్నారు ?
జ: వీరేంద్ర సెహ్వాగ్

అంతర్జాతీయం
16) ఫార్ములా ఒన్ యూఎస్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన బ్రిటన్ రేసర్ ఎవరు ?
జ: లూయీస్ హామిల్టర్
17) రెండో ప్రపంచ మార్క్సిజం సదస్సు ఎక్కడ జరగనుంది ?
జ: చైనాలోని బీజింగ్ లో