Tuesday, September 25
Log In

TEST: 294-CA- OCT 23

రాష్ట్రీయం
1) వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట దగ్గర సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన కాకతీయ మెగా టెక్స్ టైల్స్ లో మొదటి రోజు ఎంత పెట్టుబడులు వచ్చాయి ?
జ: రూ.3,900 కోట్లు
2) దేశంలోనే మూడో ఎత్తయినదిగా భావిస్తున్న జలపాతం (700 అడుగుల ఎత్తు) ఏ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ?
జ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా (వెంకటాపురం కే మండలం - వీరభద్రపురం గ్రామానికి 5కిమీ దూరంలో)
3) దళితులకు 3 ఎకరాల భూమి కింద 2017-18 సంవత్సరానికి ఎంత భూమి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?
జ: 8924.21 ఎకరాలు
4) కేంద్ర ప్రభుత్వ ఏ పథకం కింద రాష్ట్రంలో పేదలకు విద్యుత్ కనెక్షన్లు, ప్రీ పెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు ?
జ: ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన ( సౌభాగ్య)
5) రాష్ట్రంలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: పరకాల ( వరంగల్ రూరల్ జిల్లా )
6) హైదరాబాద్ లో నవంబర్ నెలలో 30 కిమీల మెట్రో రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే సిటీ మొత్తంలో మూడు కారిడార్లలో ఎన్ని కిమీలు నిర్మించున్నారు
జ: 72 కిలోమీటర్లు
7) 2017-18లో మన రాష్ట్రానికి 8 కోట్ల పనిదినాలకు కేంద్రం కేటాయించింది. అందులో మహిళలు ఎంత శాతం పనులు నిర్వహించారు
జ: 61 శాతం
(నోట్: కేంద్రం 8కోట్ల పనిదినాలు కేటాయిస్తే... రాష్ట్రంలో ఇప్పటికే 9.88 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి )


జాతీయం
8) జలయాన పథకంలో భాగంగా గుజరాత్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించే ఫెర్రీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ?
జ: ఘోఘా నుంచి దహేజ్ వరకూ
9) దేశంలోని ఎన్ని ప్రధాన ఓడరేవుల్లో రూ.90వేల కోట్లతో భారీ స్థాయి విస్తరణ పనులు చేపడతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు ?
జ: 12 ఓడ రేవుల్లో
10) బ్యాంకింగ్ రంగం నిరర్థక ఆస్తులు (NPA) లు ఇప్పటి వరకూ ఎంత ఉన్నాయి ?
జ: రూ.8 లక్షల కోట్లు
11) నవంబర్ 14 నుంచి బెలూన్ ఫెస్టివల్ ఎక్కడ జరగనుంది ?
జ: అరకులో
12) ఇంటర్నేషనల్ ఇండియా చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతోంది ?
జ: షిల్లాంగ్
13) బియాండ్ ది డ్రీమ్ గాళ్ - అనే హేమామాలిని బయోగ్రఫీని ఎవరు రాశారు ?
జ: రామ్ కమల్ ముఖర్జీ
14) 2017 డిస్కవరీ ఎడ్యుకేషన్ 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ అవార్డు గెలుచుకున్న ఇండియన్ అమెరికన్ ఎవరు ?
జ: గీతాంజలి రావు
15) రాజ్యసభ టీవీకి ఎడిటర్ ఇన్ చీఫ్ పోస్టుకు సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు ఏర్పాటైన కమిటీ ఏది ?
జ: సూర్య ప్రకాష్ కమిటీ
16) ఢాకాలో జరిగిన ఆసియాకప్ హాకీలో భారత్ జట్టు విజయం సాధించింది. ఫైనల్లో ఏ జట్టును భారత్ ఓడించింది ?
జ: మలేసియా జట్టును
17) ఎన్నేళ్ళ తర్వాత ఆసియా హాకీ కప్ ను భారత్ జట్టు తిరిగి దక్కించుకుంది ?
జ: 2008 తర్వాత ( 9యేళ్ళకు - ఇది మూడో టైటిల్ )
18) డెన్మార్క్ ఓపెన్ సూపర్ సరిస్ లో ఛాంపియన్ గా నిలిచిన భారతీయ షట్లర్ ఎవరు ?
జ: కిదాంబి శ్రీకాంత్
(నోట్: ఫైనల్లో లీ హ్యూన్ (కొరియా) ను ఓడించాడు )
అంతర్జాతీయం
19) జపాన్ ప్రధాని షింజో అబే మళ్లీ ప్రధాని పదవి చేపట్టారు. ఆయన పార్టీ లిబరల్ డెమొక్రాటిక్ కి పార్లమెంటులో ఎన్ని సీట్లు వచ్చాయి
జ: 311 (మొత్తం సీట్లు 465)
20) 2017 బ్లూ ప్లానెట్ ప్రైజ్ ను ప్రొఫెసర్ హన్స్ జోచిమ్ ష్కెలన్ హూబర్ గెలుచుకున్నారు. ఈ ఏ దేశానికి చెందిన వారు ?
జ: జర్మనీ
21) చంద్రుడిపై ఆవాసానికి ఆనవాళ్ళు ఉన్నాయని ఏ ఆర్బిటర్ ద్వారా బయటపడింది ?
జ: కగుయా ఆర్బిటర్ ( జపాన్ )
22) 2018 హాకీ ప్రపంచ కప్ లో మొదటిసారిగా స్థానం దక్కించుకున్న దేశం ఏది ?
జ: చైనా
(నోట్: దక్షిణకొరియా 1998 తర్వాత ప్రపంచకప్ లో స్థానం కోల్పోయింది )