Friday, May 25
Log In

TEST 273: CURRENT AFFAIRS- SEPT 30

రాష్ట్రీయం
1) తెలంగాణలో నవజాత శిశు మరణాల రేటు తగ్గినట్టు కేంద్రం తెలిపింది. ఇప్పుడు ఎంత ఉంది ?
జ: 31 (ప్రతి వెయ్యి జననాలకు )
(నోట్: 2015లో 34గా ఉండేది)

జాతీయం
2) పిల్లలను దత్తత తీసుకోవడానికి సంబంధించి సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ(CARA) చేపట్టిన కార్యక్రమం ఏది ?
జ: జన సంపర్క్
3) e-NWRm వెబ్ పోర్టల్ దేనికి సంబంధించింది ?
జ: Warehousing Development
4) వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన కేంద్ర మంత్రి ఎవరు ?
జ: రామ్ విలాస్ పాశ్వాన్
5) 2016-17 సంవత్సరానికి రూ.2,207 కోట్ల డివిడెంట్ ను కేంద్రానికి అందించిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది ?
జ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC)
6) అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో అక్టోబర్ 12న ప్రసంగించనున్న కేంద్రమంత్రి ఎవరు ?
జ: అరుణ్ జైట్లీ
7) కౌన్ బనేగా కరోడ్ పతి-9 సిరీస్ లో కోటి రూపాయలు గెలుచుకున్న సామాజిక కార్యకర్త ఎవరు ?
జ: అనామిక మంజుందార్

అంతర్జాతీయం
8) ప్రపంచంలోనే మొదటిసారిగా హ్యాకింగ్ కు అవకాశంలేని క్యాంటమ్ కమ్యూనికేషన్ లైన్ ను ఏ దేశం ప్రారంభించింది ?
జ: చైనా
9) చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మరోసారి అధ్యక్షుడు అయ్యే అవకాశాలున్నాయి.  అధికార పార్టీ పేరేంటి ?
జ: చైనా కమ్యూనిస్ట్ పార్టీ ( CPC)
10) నగరాల మధ్య ప్రయాణాలకు రాకెట్లు ఉపయోగించవచ్చని స్పేస్ ఎక్స్ సంస్థ చెబుతోంది. దానికి వ్యవస్థాపకుడు ఎవరు ?
జ: ఎలాన్ మస్క్
11) కుక్కల ద్వారా వ్యాపించే రేబిస్ వ్యాధి మరణాలను 2030 కల్లా అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా భారీ కార్యక్రమాన్ని చేపడుతున్న సంస్థ ఏది ?
జ: ఐక్య రాజ్య సమితి
12) ప్రపంచ రేబిస్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: సెప్టెంబర్ 28

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *