Tuesday, September 25
Log In

TEST: 272- CURRENT AFFAIRS 29SEPT

రాష్ట్రీయం
1) డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1596 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేసింది. వీటిని ఏ పథకం కింద అందజేస్తారు ?
జ: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ( PMAY)
2) జాతీయ పట్టణ ప్రాంత జీవనోపాధి కల్పనలో (NULM) లో తెలంగాణది ఎన్నో స్థానం ?
జ: రెండు
(నోట్:మొదటి స్థానం జార్ఖండ్ )
3) దసరా తర్వాత హైదరాబాద్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రతియేటా ఎవరు నిర్వహిస్తారు ?
జ: కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ

జాతీయం
4) ఏ పథకానికి సంబంధించి దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ముద్ర పథకం
5) 13వ వార్షికోత్సవం జరుపుకుంటున్న జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ( NDMA) యొక్క థీమ్ ఏంటి ?
జ: School Safety
6) National Handicapped Finance and Development Corporation (NHFDC) ఏ శాఖ కింద పనిచేస్తుంది ?
జ: సామాజిక న్యాయం, సాధికారత శాఖ
7) బెస్ట్ టూరిజం స్టేట్ గా జాతీయస్థాయి 2017 అవార్డు అందుకున్న రాష్ట్రం ఏది ?
జ: మధ్యప్రదేశ్
8) సౌచాలయాక్కగి సమర (క్రూసేడ్ ఫర్ టాయిలెట్స్ ) అనే కార్యక్రమాన్ని కర్ణాటకలో ప్రారంభించింది ఎవరు ?
జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
9) అసోచామ్ నిర్వహించిన సర్వేలో తయారీ రంగంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?
జ: మహారాష్ట్ర
10) న్యూఢిల్లీలో మరణించిన ఎం.ఎల్ ఫోతే దార్ ఎవరు ?
జ: కాంగ్రెస్ సీనియర్ నేత (ఇందిరా గాంధీ కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి)
11) పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై సైన్యం జరిపిన సర్జికల్ దాడుల కథనంతో బాలీవుడ్ లో అధియా ధార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పేరేంటి ?
జ: ఉడీ
12) 2015 జూన్ 5న ఈశాన్య ప్రాంత తీవ్రవాద ముఠాలను మట్టుపెట్టడంపై నితిన్ గోఖలే రాసిన పుస్తకం ఏది ?
జ: సెక్యూరింగ్ ఇండియా ద మోదీ వే: పఠాన్ కోట్, సర్జికల్ స్ట్రైక్స్ అండ్ మోర్
13) పోలీస్ శిక్షణలో సాంకేతిక సహకారాన్ని అందించేందుకు భారత్ ఏ దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ?
జ: ఆఫ్గనిస్తాన్
14) సీతానది వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?
జ: ఛత్తీస్ గఢ్
15) హర్యానాలో శ్వేత విప్లవం ( పాల వెల్లువ ) కోసం ఏ దేశం సహకారం అందిస్తోంది ?
జ: ఇజ్రాయెల్
16) ప్రపంచంలోనే పొడవైన (100 అడుగుల) బాంబూ మా దుర్గా విగ్రహాన్ని ఎక్కడ తయారు చేశారు ?
జ: గువహటి (అసోం)
17) స్మార్ట్ సిటీస్, రోడ్లు, ఎయిర్ పోర్టులు, మెట్రోలు... లాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: దక్షిణ కొరియా
18) దేశీవాళీ క్రికెట్ సీజన్ లోనే మొదటి టోర్నమెంట్ అయిన దులీప్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది ?
జ: ఇండియా రెడ్ జట్టు
(నోట్: ఇండియా బ్లూ జట్టుపై 163 పరుగుల తేడాతో గెలిచింది )
19) ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో టాప్ 20లో మనోళ్ళు ఐదుగురు నిలిచారు. వీళ్ళల్లో 9 వస్థానం ఎవరిది ?
జ: కిడాంబి శ్రీకాంత్

అంతర్జాతీయం
20) ఏ పండుగ సందర్బంగా వైట్ హౌస్ లో 200 మంది భారతీయ అమెరికన్లకు విందు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు ?
జ: దీపావళి
21) జపాన్ పార్లమెంటును రద్దు చేస్తూ  ఆ దేశ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. జపాన్ ప్రధాని ఎవరు ?
జ: షింజో అబే
22) ప్రముఖ మ్యాగజైన్ ప్లే బాయ్ వ్యవస్తాపకుడు హ్యూ హెఫ్నర్ కన్నుమూశారు. ఆయన ఏ దేశానికి చెందిన వారు ?
జ: అమెరికా
23) ప్రవాసులు నివసించడానికి, పనిచేయడానికి అత్యుత్తమ దేశాల్లో మొదటి స్థానం ఏ దేశానికి దక్కింది ?
జ: సింగపూర్
(నోట్: భారత్ స్థానం 14 (మొత్తం 159 దేశాల్లో Expot Explorer Survey చేసింది)
24) విశ్వంలో మరో గురుత్వాకర్షణ తరంగాన్ని ఏ డిటెక్టర్లు కనుగొన్నాయి ?
జ: లైగో, విర్గో డిటెక్టర్లు
25) హిందూ మతంలో చిన్నారులను తమ ఇష్టదేవతలు ( తలెజు) గా ఎంపిక చేసే ఆచారం ఏ దేశంలో ఉంది ?
జ: నేపాల్ లో
26) World maritime day 2017 యొక్క థీమ్ ఏంటి ?
జ: Connecting Ships, Ports and People
27) రాడార్లు కూడా కనిపెట్టలేని అత్యాధునిక 4G మధ్యశ్రేణి జే20 యుద్ధ విమానాలను సైన్యంలోకి ప్రవేశపెట్టిన దేశం ఏది ?
జ: చైనా