Tuesday, September 25
Log In

TEST 271- CURRENT AFFAIRS 28SEPT

రాష్ట్రీయం
1) మెట్రో రైలు రెండో దశను రూ.20వేల కోట్లతో ఎన్ని కిలోమీటర్లు నిర్మించాలని భావిస్తున్నారు ?
జ: 81 కిమీ
2) రాష్ట్రంలో యానిమేషన్ - గేమింగ్ రంగాల కోసం ఇమేజ్ టవర్స్ ను ఎక్కడ నిర్మించనున్నారు ?
జ: రాయదుర్గంలోని మైండ్ స్పేస్ జంక్షన్ కి దగ్గర్లో
3) రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు దాటిన సాదా బైనామాలను రిజిష్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ?
జ:  5 ఎకరాలు
4) సాదా బైనామాల రిజిష్ట్రేషన్ కోసం రెవెన్యూ శాఖకు ఏ ఫామ్ లో అప్లయ్ చేసుకోవాలి ?
జ: ఫారం - 10
5) 2015-16 సంవత్సరానికి రాష్ట్ర పర్యాటక శాఖకు జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డులు దక్కాయి ?
జ: 8 అవార్డులు
6) BCCI జనరల్ మేనేజర్ (క్రికెట్ వ్యవహారాలు) పదవికి ఎవరు రాజీనామా చేశారు ?
జ: ఎం.వి. శ్రీధర్
7) బెల్జియం జూనియర్ ఓపెన్ అండర్ - 19 ఉమెన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు ?
జ: వైష్ణవి రెడ్డి

జాతీయం
8) దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థను ఆధునీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది ?
జ: రూ.25,060 కోట్లు
9) దక్షిణ కశ్మీర్ లోని ఐదు జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న ఫోర్స్ పేరేంటి ?
జ: విక్టర్ ఫోర్స్  ( దీనికి మేజర్ జనరల్ బి.ఎస్.రాజు అధిపతి )
10) పనామా పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ బాలీవుడ్ నటుడికి  Enforcement Directorate (ED) నోటీసులు జారీ చేయనుంది ?
జ: అమితాబ్ బచ్చన్
11) అత్యధిక పోటీతత్వం గల ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ కు ఏ ర్యాంకు దక్కింది ?
జ: 40 వస్థానం
12) మూఢనమ్మకాలపై నిషేధం విధిస్తూ చట్టం తేవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కర్ణాటక
13) PENCIL విస్తరించండి ?
జ: Platform for Effective Enforcement for No Child Labour
14) స్వచ్ఛ్ భారత్ అభియాన్  మూడో వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఏ సినిమాని ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది ?
జ: టాయ్ లెట్ : ఎక్ ప్రేమ్ కథ
15) 2008 నాటి లోక్ సభ ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కులు చూపనందుకు గాను ఏ మాజీ ముఖ్యమంత్రిపై కేంద్ర ఎన్నికల సంఘం మూడేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది ?
జ: మధుకోడా
16) హెల్మెట్ పెట్టుకుంటేనే పెట్రోల్ పోయాలని ఆదేశాలిచ్చిన రాష్ట్రప్రభుత్వం ఏది ?
జ: ఆంధ్రప్రదేశ్
17) దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నెలకొల్పారు ?
జ: త్రిపుర ( సాధుటిల్లా )
18) భారత్, అమెరికాతో కలసి ఢిల్లీలో మొదటిసారిగా వాణిజ్య, పెట్టుబడుల సదస్సుల్లో పాల్గొంటున్న దేశం ఏది ?
జ: ఆఫ్ఘనిస్తాన్  ( ఈ సదస్సు ఢిల్లీలో 29సెప్టెంబర్ నుంచి జరుగుతుంది )
19) బీబీసీ శక్తివంతమైన మహిళలల్లో చోటు దక్కించుకున్న భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు;?
జ: మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్
20) అండర్ 14 విభాగంలో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచినది ఎవరు ?
జ: జిషిత
21) ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించిన ర్యాంకింగ్స్ లో వన్డే, టెస్ట్ క్రికెట్ రెండింటిలోనూ  నెంబర్ ఒన్ గా నిలచిన జట్టు ఏది ?
జ: భారత్ ( ఇండోర్ లో జరిగిన ODI లో ఆస్ట్రేలియాని 5 వికెట్ల తేడాతో ఓడించి నెంబర్ 1 స్థానానికి ఎదిగింది )
22) ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ స్టార్స్ టాప్ 10 లో చోటు దక్కించుకున్న బాలీవుడ్ నటి  ఎవరు ?
జ: ప్రియాంక చోప్రా

అంతర్జాతీయం
23) ప్రధాని నరేంద్రమోడీ సాధించిన ప్రగతిపై వెలువడిన పుస్తకాన్ని అమెరికాలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం పేరేంటి ?
జ: ది మేకింగ్ ఆఫ్ ఏ లెజెండ్ ( రచయిత: బిందేశ్వర్ పాఠక్ )
24) బియ్యం రాయితీ పథకం ద్వారా దేశానికి నష్టం కలిగించారంటూ ఐదేళ్ళ జైలు శిక్ష పడిన థాయిలాండ్ మాజీ ప్రధాని ఎవరు ?
జ: యింగ్లక్ షినవత్రా
25) చంద్రమండలంపై మొదటి అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ఏయే దేశాలు అంగీకరించాయి ?
జ: అమెరికా - రష్యా
26) ట్విట్లర్లో ఇకపై ట్వీట్ ను ఎన్ని అక్షరాలు రాసుకునే అవకాశం కల్పించారు ?
జ: 280 అక్షరాలు  (గతంలో 140 మాత్రమే )